New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రోజా – 2
రోజా 3 min read

రోజా – 2

అది ఎండాకాలమైనా సరే.. వర్షాకాలమైన సరే.. చలికాలం అయినా సరే రోజా మీద కోపం వస్తే సురేష్ రోజా ఇద్దరూ బయటే ఉండాలి..అది వాళ్ళకి గత 19 సంవత్సరాల నుంచి అలవాటే ఈరోజు ఏమి కొత్త కాదు.

 

 

సురేష్ కదలడం గమనించి.. “మావయ్య మా అమ్మ ఎలా చనిపోయింది,మా అమ్మ పేరు ఏంటి..” అని అడిగింది రోజా.

 

 

 

గత 16 సంవత్సరాల నుంచి రోజా నుంచి ఈ ప్రశ్న వస్తూనే ఉంది,సురేష్ దాటవేస్తూనే ఉన్నాడు.. ఈసారి కూడా కళ్ళు మూసుకొని నిద్రని నటిస్తూ ఉన్నాడు కళ్ళు తెరిస్తే రోజాకి సమాధానం చెప్పాలి అని.

 

 

 

ఎప్పుడు మావయ్య ఇలాగే దాటేస్తాడు ఈ ప్రశ్నకి సమాధానం అని తెలిసిన రోజా ఇక అడగడం మానేసి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర దేవిని ఆహ్వానించింది.

 

 

 

 

 

“మా నాన్న చనిపోతూ మీకు మాట ఇచ్చారు అని ఇప్పటివరకు మీ కూతురుని భరిస్తున్నాను మావయ్య.. దాని అర్థం తను తాన అంటే నేను తందాన అని అంటాను అని అయితే కాదు.” అని అన్నాడు ఊరిమే కళ్ళతో మధ్య వయసు గలా వ్యక్తిని కోపంగా చూస్తూ ఆరు అడుగుల రెండు అంగుళాలు ఉన్న వ్యక్తి.

 

 

 

“తను తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే కడుపులో పెట్టుకోండి అల్లుడుగారు.. అంతేకానీ..! ఇలా డైవర్స్ అంటూ దాని జీవితాన్ని నాశనం చేయకండి.

 

 ఇప్పుడు ఈ విషయాలు అన్నీ బయటకి వస్తే మీడియా కోడై కూస్తుంది,మన రెండు కుటుంబాల పరువు బజారు పాలవుతుంది.” అని అన్నాడు ఆ మధ్య వయసు గల వ్యక్తి అతని చేతులు పట్టుకుంటూ.

 

 

“పరువు పోతుంది అని నేను మాత్రమే కాదు మీ కూతురు కూడా ఆలోచించుకోవాలి.. ఇంకొక సంవత్సరం టైం ఇస్తున్న ఆలోపు నాకు పిల్లల్ని కనిచ్చే ఉద్దేశం ఉంటే ఓకే..లేదు అంటే ఈ డైవర్స్ పేపర్స్ మీద తనతో సంతకాలు పెట్టించి ఈ పేపర్స్ నాకు పంపించండి.” అని ఆ మధ్య వయసు గలా వ్యక్తి చేతిలో డైవర్స్ పేపర్స్ పెట్టాడు.

 

 

 

“శివ్… ఇంకోసారి ఆలోచించుకో డైవర్స్ తీసుకోవడం చాలా తేలిక.. కానీ..! ఆ తర్వాత భార్య భర్తలు కలవడం అసంభవం.” అని అన్నాడు ఆ మధ్య వయసు గల వ్యక్తి వెళ్తున్న అల్లుడు వైపు చూసి.

 

 

 

“పెళ్లి అయ్యి ఏడు సంవత్సరాలు అయింది మావయ్య.. ఇప్పటివరకు పిల్లల్ని కనొద్దు అన్నట్టుగా నీ కూతురు బిహేవ్ చేస్తుంటే నాకు ఎలా స్పందించాలో తెలియట్లేదు.

 

 నేను ఎంత హీరోని అయినా నాకు కూడా మనసు ఉంటుంది,నేను ఎంత పబ్లిక్ ఫిగర్ అయినా నాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది.. నాకు కూడా ఒక తండ్రిని అవ్వాలి అనే ఆలోచన ఉంటుంది కదా..!! దానిని మీరు కూడా ఆలోచించండి.

 

 భర్తతో విడాకులు అయితే మళ్లీ తనతో కలవలేవం అని మీ కూతురికి చెప్పండి.

 

 

 సీనియర్ హీరో జై రామ్ కూతురు హీరోయిన్ అనన్య అనే హోదా లో నుంచి హీరో శివ వైఫ్ అనన్య వరకు ఎదిగింది.. ఇప్పటికి కూడా గ్లామర్ గా కాకుండా మదర్ లా మారడానికి మీ కూతురుని ప్రయత్నించమనండి.” అని చెప్పి అక్కడ నుంచి కదిలాడు శివ్.

 

 

 

శివ కార్ కదిలి అక్కడ నుంచి వెళ్లిపోగానే అప్పటివరకు లోపలే ఉన్నట్టున్నారు ఇద్దరు ఆడవాళ్ళు బయటకి వచ్చి..”ఏంటండీ పెళ్లి అయ్యి ఏడు సంవత్సరాలేగా అయింది అప్పుడే మన అమ్మాయిని పిల్లల్ని కనమని ఒత్తిడి చేస్తున్నాడు ఏంటి అల్లుడు.” అని అంది గాగుల్స్ తీస్తూ జై రామ్ భార్య నీలిమ.

 

 

 

 “డైవర్స్ ఇస్తానంటే నేను భయపడతాను అనుకుంటున్నాడా డాడ్..”అని అంది శివ్ వెళ్ళిన వైపు కోపంగా చూస్తూ అనన్య.

 

 

 

“నిన్ను భయపెట్టానికే అయితే డైవర్స్ ఇవ్వమని అడగరు అల్లుడుగారు.. అసలు నిన్ను భయపెట్టాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు,నిజానికి అయన ప్లేస్ లో ఎవరు ఉన్నా లీగల్ గా తేల్చుకునే వాళ్ళు.

 

 కానీ..! అల్లుడుగారు చాలా మర్యాదగా అడుగుతున్నారు పిల్లల్ని కనమని ఆ తర్వాత నీ ఇష్టం అనన్య.” అని అన్నారు జై రామ్ అనన్య కళ్ళల్లోకి చూస్తూ.

 

 

 

“మీరు కూడా అల్లుడు వైపే వకళ్తా పుచ్చుకున్నట్టు మాట్లాడుతున్నారు.. మన అమ్మాయి గురించి కూడా ఆలోచించాలిగా.” అని అంది నీలిమా కోపంగా జై రాం వైపు చూస్తూ.

 

 

“మన అమ్మాయి గురించి ఆలోచించే శివ్ ని బతిమిలాడాను నీలిమ లేకపోతే శివ్ చేతులు పట్టుకొని మరి అడగాల్సిన కర్మ నాకేంటి…??? మన అమ్మాయి గురించి ఆలోచించే కదా నేను కూడా అంటుంది.

 

 అయినా 30+ ఏజ్ వచ్చింది ఇప్పటికి కూడా పిల్లల్ని కనకపోతే ఎలా..??? ఆడ అయినా మగ అయినా జీవితంలో పేరెంట్స్ అవడం అనేది తప్పకుండా తీసుకోవాల్సిన స్టెప్ అది తీసుకోవడానికి ఏంటి ప్రాబ్లం..???” అని అన్నాడు జై రామ్ నీలిమని ఆవేశంగా చూస్తూ.

 

 

 

“ఈ గ్లామర్ ఫీల్డ్ లో డెలివరీ తర్వాత కెరియర్ ఉంటుందా డాడ్…??? మీకు అన్ని తెలిసి మీరు కూడా ఇదే ఫీల్డ్ లో ఉండి మీరు ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు.” అని అంది చిరాకుగా ముఖం పెట్టి అనన్య.

 

 

 

 

 

 

ఇక ఉంటాను 

మీ అల్లరి రాక్షసి ప్రశాంతి శ్రీకాంత్..❤️❤️❤️