ఇదేంటి ఎవరు ఏది అడిగినా సమాధానం చెప్పే పిల్ల సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది.. అందులో అదేంటి రక్తం కారుతుంది పిల్లలకి అని ఆలోచిస్తున్నారు.
కానీ..! వాళ్ళ పనిలో ఉన్న తొందర వల్ల అక్కడ నుంచి కలిలారు వాళ్ళు తర్వాత మాట్లాడదాంలే అన్నట్టుగా.
కాలు ఇడ్చుకుంటూ నడుస్తున్న రోజాకి ఎదురుగా పోస్ట్ మ్యాన్ ఎదురొచ్చాడు నవ్వుతూ..” అమ్మ రోజా మీ ఇంటికే వస్తున్న ఇదిగో నీ పేరు మీద బ్యాంకు నుంచి ఏదో వచ్చింది సంతకం పెట్టి తీసుకో.” అని అన్నాడు పోస్ట్ మ్యాన్ బండి ఆపుతూ.
“నా పేరు మీద వచ్చిందా..!” అని అంది కళ్ళు తుడుచుకుంటూ రోజా.