గబగబా టికెట్ ఇక్కడ వరకే తీసుకున్నాను కదా దిగాలి అని అనుకొని తన బ్యాగ్ భుజానికి తగిలించుకొని ఫాస్ట్ గా బస్సులోంచి దిగుదాము అని రెండు అడుగులు వేసింది.. పెద్దావిడ దగ్గర ఉన్న లగేజ్ చూసి అది మోసుకుంటూ ఆవిడ రావడానికి ఇబ్బంది పడుతుంది అని ఆమె లగేజ్ కూడా..”నేను తీసుకొస్తాను అమ్మ.” అని అందుకొని బస్సు గబగబా దిగింది రోజా.
వెనక నవ్వుతూ చూసి ఆ పెద్దావిడ కూడా కదిలింది.
పెద్దావిడ బస్సు దిగగానే ఆమెకి ఆవిడ లాగేజ్ ఇచ్చి..”ఇక్కడకి ఆటోలు రావా అమ్మ.” అని అడిగింది రోజా.
“నువ్వు కొత్తన ఇక్కడకి రావడం.” అని అంది ఆ పెద్దావిడ రోజా వైపు చూస్తూ.
“హుమ్మ్..” అని తల కిందకి వాల్చింది రోజా.