రోజా ముందు కొన్ని పేపర్స్ పెట్టింది పద్మ..
ఏంటి అన్నట్టుగా చూసింది రోజా.
“మీ మావయ్య నాకు తెలియకుండా నీ పేరు మీదకి ఐదు ఎకరాల పొలం రాయించాడుగా.. అవి నందు పేరు మీదకి నువ్వు మారుస్తున్నట్టుగా, అమ్ముతున్నట్టుగా రిజిస్ట్రేషన్ చేసిన పేపర్లు సంతకాలు పెట్టు.” అని అంది కోపంగా పద్మ.
రాత్రి అంతా నిద్రపోనట్టుగా కనిపిస్తున్న పద్మ కళ్ళను చూస్తూ.. ఇందుకేనా అంత కోపంగా ఉంది అన్నట్టుగా ఒక చూపు చూసి టకటక అన్నిటి మీద సంతకాలు పెట్టింది రోజా.