వేద్ నేను అక్కడ కూడా ఎవరితో అయినా ఎంజాయ్ చేస్తానని డౌట్ గా ఉందా అని అడుగుతాడు వేదా ని…
చెప్పా కదా తప్పయిపోయింది నా సిచువేషన్ లో ఉండి కూడా ఆలోచించు ఇప్పటివరకు నేను కోపంగా ఉన్న అని ఇప్పుడు నువ్వు నా మీద రివెంజ్ తీర్చుకోకు అని ఏడుస్తుంది వేద…
వేద మీద కోపంగా ఉండలేని వేద్ కరిగిపోయి వేదాని దగ్గరికి తీసుకుని ఇంకెప్పుడు అలా డౌట్ పడకు నేను ఎప్పుడు ఇంకో అమ్మాయిని అలా ఆ ఫీలింగ్ తో చూడను అని ఇప్పుడు నేను చాలా అలసిపోయాను నువ్వు చేసింది ఏమైనా బాగా ఉందా మనం ఎప్పుడూ ఎలా ఎంత హ్యాపీగా ఉండే వాళ్ళం ఆఫీసు నుంచి పరుగున ఇంటికి వచ్చావ్ నాతో మాట్లాడకుండానే మ్యాగీ చేసుకుని టెర్రస్ పైకెల్లావ్ అక్కడ తినేసి తాగేసి లాప్టాప్ లో వర్క్ చేసుకుంటే నిద్రపోయావ్ .
ఏం చేస్తున్నావ్ అని పైకి వచ్చి నిన్ను అలా చూసి కిందకి తీసుకొని వచ్చి బెడ్ రూమ్లో పడుకోబెట్టాను మార్నింగ్ చెక్కేసావు సరేలే నీకోసం అమెరికా వస్తే అక్కడ కూడా నాకు మీటింగ్ ఉందని అబి ని కలవడానికి వెళ్ళా వ్ సరే వచ్చాక కలిసి పోదాం అనుకుంటే ఆ దొంగ సచ్చిందోచ్చి మొత్తం స్పాయిల్ చేసి సరిగ్గా ఫుడ్ కూడా లేదు ప్రెసెంట్ నాకు నిద్ర కావాలి . వేదా న్ని బెడ్ పైకి తోసి మీద పడుకుని కళ్ళు మూసుకుంటాడు..