New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమించా కొత్తగా 💖 – 4

ప్రేమించా కొత్తగా 💖 – 4

అప్పటివరకు త్వరగా డోర్ ఓపెన్ చేయనందుకు కాస్త కోపంగా వున్నవాడు కాస్త రిషి మాటలు విన్నాక కాస్త కూల్ అయి హ్మ్  సరేలే  అడ్డం  లెయ్…

 

   ఈరోజు  మా మేనేజర్  గాడు హాఫ్ డే  లీవ్  తీసుకున్నాను అని వర్క్  అంత  నా చేతే  చేయించాడు దొంగ సచ్చినోడు.ఒళ్ళంతా  పులిసిపోయింది.

 

  నేను  వెళ్లి  స్నానం  చేసొస్తాను..ఈలోపు నువ్వు రాత్రికి  వంట  పని చూడు  అంటూ తనకి  ఒళ్ళంతా నొప్పులు ఉన్నట్టుగా ఎక్సప్రెషన్స్ ఇస్తూ తన  లాప్టాప్  బ్యాగ్  పక్కన  సోఫాలో పడేసి,టవల్  తీసుకుని  వాష్  రూమ్ లోకి దూరాడు.

 

ఇంక  మన  రిషి బాబు  శ్రీను వర్క్ తో నిజంగానే చాలా టైర్డ్ అయ్యాడని అర్ధం చేసుకుని కళ్ళు  నులుముకుంటూ ,కిచెన్  లోకి వెళ్లి కొన్ని  నీళ్లు  మొహం మీద  చల్లుకుని  నిద్ర  మత్తు వదిలాక   కూరగాయలు  కట్ చేయడం  స్టార్ట్  చేసాడు… 

 

అలా  కూరగాయలు  కట్  చేస్తున్న  టైంలో  లేలేత   వంకాయను  చూడగానే  మార్నింగ్  ఆఫీస్లొ  కనిపించిన  అమ్మాయి గుర్తు వస్తుంది.

 

  అబ్బా  ఏమున్నావే  సుందరి.. నువ్వు కూడా ఈ లేత వంకాయల నిగనిగలాడుతూ చూడగానే నామనసు  దోచేసావ్ కదే చెలీ..కానీ  నాకు నీ జాడ  తెలిసేదెలా, నేను మళ్ళీ నిన్ను  కలిసేదెలా? మరలా నాకు  నిన్ను  చూసే భాగ్యము  కలుగునా అనుకుంటూ  ఆ వంకాయలో ఆ అమ్మాయిని  ఊహించుకుంటూ ఉంటాడు… 

 

 

ఆ అమ్మాయి  అందమైన రూపం కళ్ళ ముందు కనపడగానే  అతని  పెదవులపై  అందమైన నవ్వు  వచ్చి చేరుతుంది…అలా తనలో తానే  నవ్వుకుంటూ ,ఆ అమ్మాయిని  తలుచుకుంటూ వంట చేస్తుంటాడు…. 

 

వంట  పూర్తయిందా  లేదా అని చూడడానికి  వచ్చిన  శ్రీను  రిషి  అలా తనలో తానే నవ్వుకోవడం ,  మురిసిపోవడం చూసి ఏంటి రా నీలో  నువ్వే  నవ్వేసుకుంటున్నావ్, అదేదో  జరంత  మాక్కూడా  చెబితే  మేము కూడా నవ్వుకుంటాం  కదేటి  అంటాడు … 

 

శ్రీను  మాటలకి తేరుకున్న  రిషి  అదేం  లేదులేరా ఏదో  గుర్తొచ్చి  నవ్వుతున్నాను   అంతే   అంటాడు… 

 

ఏం గుర్తొచ్చిందేంటి  అంతగా  తమరికి అంటూ  కొంపదీసి  పొద్దున్న ఆ ఆఫీస్ లొ  చూసిన  పిల్ల గానీ  గుర్తొచ్చినదా ఏంటి  అంటాడు  డౌట్ గ చూస్తు..

 

దానికి  రిషి చిన్నగా   నవ్వుతు  హ్మ్  అవునురా….ఎందుకో  ఆ అమ్మాయి  తెగ  గుర్తొచ్చేస్తుంది…  మళ్ళీ తను  నాకు  కనిపిస్తుందో  లేదో  అంటాడు చివర్లో నవ్వు పోయి బాధగా మొహం పెట్టి … 

 

అప్పుడు శ్రీను హ్మ్  అనుకున్న…  నువ్విలాంటి  పిచ్చి పిచ్చివే  అలోచించి  నవ్వుకుంటున్నావ్  అని   అంటాడు  కొంచెం  అసహనంగా… 

 

హ రా …ఎంత  వద్దన్నా  తన  రూపమే  నాకు  కనిపిస్తుంది ఏం చేయను   అంటాడు రిషి ..

 

హ హ  ఎందుకు  కనిపించదు… కనిపిస్తది  కనిపిస్తది  మన  వయసు  అలాంటిది  కదా… అలానే  అనిపిస్తది  కానీ ఇప్పటికే  లేట్  అయింది…తమరి వంట  పూర్తయితే పోయి  తిని  పడుకుందాం  నాకు  నిద్ర  వస్తుంది … 

 

అసలే  ఆ చండ శాసనుడు ఈ రోజు  నాఒళ్ళు హూనం  అయ్యేలా  పని  చేయించాడుగా… దానికి తగినంత విశ్రాంతి లేకుంటే రేపు ఉదయం ఆఫీస్ కి వెళ్లలేను   అంటూ  వాళ్ళ  మేనేజర్ ని  నాలుగు  తిట్లు  తిట్టుకుంటూ  పోయి ఇద్దరు కలిసి  భోజనం  చేసేస్తారు… 

 

నెక్స్ట్ డే సాటర్డే  ఆఫీస్ కి  లీవ్  కావడంతో  శ్రీను  కూడా ఇంట్లోనే  ఉంటాడు  కాబట్టి మార్నింగ్ పది  వరకు  ఇద్దరు  నిద్ర  లేవలేదు …. 

 

పదకొండు  అవుతుండగా మత్తుగా  నిద్ర  లేచి బ్రష్  చేసి,ఫ్రెష్ అయి  వండుకునే  ఓపిక లేక ,ఇద్దరు  కలిసి బయటే  తినేసి రిషి  కొన్ని డ్రెస్సెస్  తీసుకోవాలి  అంటే ఇద్దరు  షాపింగ్  మాల్ కి  వెళ్తారు … 

 

మాల్ లో అటు ఇటు  తిరిగి తనకు   కావాల్సిన  షర్ట్స్,  పాంట్స్  ఒక  నాలుగు జతలు  తీసుకుని  ప్యాక్  చేయిస్తాడు  రిషి… 

 

శ్రీను  కూడా  టీ షర్ట్స్, షార్ట్స్  తీసుకుంటాడు … అలా  ఇద్దరు  షాపింగ్ ఫినిష్  చేసుకుని  రూమ్ చేరుకుంటారు ..

 

***

రిషి  బాబు  ఆఫీస్ లో జాయిన్  అవ్వాల్సిన  రోజు  రానే  వచ్చింది.సో  ఆ రోజు  ఫస్ట్ డే అని ఇద్దరు  పొద్దున్నే  నిద్ర  లేచి తల స్నానం  చేసి రెడీ  అయి  గుడికి  బయలుదేరుతారు. 

 

మనోడికి కూసంత భక్తి  కూడా ఉందిలెండి.. గుడి  ముందు  చెప్పులు  వదిలి ట్యాప్  దగ్గర  కాళ్ళు  కడుక్కుని టెంకాయ ,పూజా సామాగ్రి  తీసుకుని  గుడి  లోపలకి  వెళ్తారు.. 

 

  ఆరోజు  సోమ వారం  అండ్  వాళ్ళకి  దగ్గరలో   శివాలయం  ఉండడంతో ఇద్దరు  అక్కడికే  వెళ్తారు… 

 

గుళ్ళోకి  వెళ్లి ప్రదక్షణలు చేసొచ్చి టెంకాయ  కొట్టి ఆ  దేవుడికి  మనస్ఫూర్తిగా నమస్కరించిన మన రిషి  స్వామి  ఈ రోజు  ఆఫీస్ లో నా మొదటి రోజు.ఆ  ఆఫీస్లొ ఎటువంటి  ఇబ్బంది  లేకుండా,అందరితో  కలిసి  హ్యాపీగ  పని  చేసేలా చూడమని  ప్లస్  ఆ రోజు  కనిపించిన  అమ్మాయి  మళ్ళీ తనకి   కన్పించేలా  చూడమని  కోరుకుంటాడు.. 

 

continued….