New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమించా కొత్తగా 💖 – 5

ప్రేమించా కొత్తగా 💖 – 5

శ్రీను  మాత్రం  స్వామి ఇప్పుడు నాకు  ఉన్న  ఉద్యోగం ఊడి పోకుండా చూడు…అలాగే మా  మేనేజర్  గాడికి ఏదో ఒక  ఆక్సిడెంట్  అయి మంచాన  పడేలా చెయ్.. అప్పుడు గానీ  వాడి పీడ  మాకు ఉండదు  అని కోరుకుంటాడు… 

 

అలా ఎవరి  మనసులో కోరికలు వాళ్ళు  ఆ దేవుడికి  చెప్పుకుని తీర్థ ,ప్రసాదాలు  తీసుకుని కొద్ది సేపు  గుళ్లో కూర్చుని,ఆ తరువాత ఇద్దరు  ఎవరి  ఆఫీస్ కి  వాళ్ళు వెళ్ళిపోతారు … 

 

ఆఫీస్ కి వెళ్లిన శ్రీను  వాళ్ళ మేనేజర్నీ   మనసులోనే  బండ బూతులు  తిట్టుకుంటూ,అతను ఇచ్చిన  ఫైల్స్  ఏవో చెక్  చేసుకుంటున్నాడు …. 

 

  ఇంక  మన  రిషి  బాబు   ఆఫీస్  లోకి  ఎంట్రీ  ఇచ్చి  ముందుగా  మేనేజర్ ని  కలిసి  అక్కడ  ఫార్మాలిటీస్  అన్ని  పూర్తి  చేసుకుని,ఐ మీన్  ఆకంపెనీ  రూల్స్ ని ఒకసారి  చదివి,తనకి  ఓకే  అయ్యాక  2 ఇయర్స్  బాండ్  అన్నట్టు ఆ పేపర్స్  ఫై  సైన్  చేస్తాడు… 

 

నెక్స్ట్  మేనేజర్  అతన్ని  తీసుకెళ్లి వాళ్ళ ఆఫీస్  స్టాఫ్  తో  హాయ్  ఎవరీ ఒన్  హి  ఇస్  మిస్టర్  

“రిషి కిరణ్ ”  న్యూ  జాయినింగ్…

 

 యూర్  న్యూ టీమ్ మెంబెర్ అంటూ  రిషిని వాళ్ళకి  పరిచయం  చేసి,రిషి  వైపు  తిరిగి  రిషి  ఇకనుండి  నువ్వు  వీళ్లతోనే  వర్క్  చేయాలి…

 

 

 ఆల్ ది  వెరీ బెస్ట్  అంటూ  తనకి  ఏవో  కొన్ని  ఫైల్స్  ఇచ్చి ఈ రోజు  ఇవి  చెక్  చెయ్…ఏవైనా  డౌట్స్  ఉంటె మీ టీం వాళ్ళని అడుగు ఎక్సప్లయిన్ చేస్తారు   అని  చెప్పి  ఆయన  వెళ్ళిపోతారు …. 

 

ఆయన అక్కడ  నుండి  వెళ్ళిపోయాక  స్టాఫ్ మెంబెర్స్  ఒక్కొక్కరుగా  వాళ్ళని  వాళ్ళు  పరిచయం  చేసుకుంటారు.అలా వాళ్ళ పరిచయాలు  పూర్తయ్యాక   ఎవరి  వర్క్ లో వాళ్ళు  పడిపోయారు.. 

 

మన రిషి బాబు  మేనేజర్  ఇచ్చిన  ఫైల్స్ ని  జాగ్రత్తగా  పరిశీలిస్తూ,  వర్క్లొ ఎలాంటి  తప్పులు  జరగకుండా   చూసుకోవాలి  అనుకుంటూ  ఆ  ఫైల్ లో తల దూర్చేసాడు…. 

 

అలా  ఆఫ్టర్నూన్  వరకు ఆ  ఫైల్స్ లో దూర్చిన  తల  ఎత్తకుండా పని  చేసుకుంటూ  ఉంటాడు..ఇంతలో  లంచ్  బ్రేక్  ఇవ్వడంతో అందరు  లంచ్  చేయడానికి  వెళ్తూ  రిషిని కూడా పిలుస్తారు … 

 

వాళ్ళు  పిలవడంతో  తలెత్తిన మన హీరో  ఓహ్  సారీ లంచ్  టైం అయిందా…నేను  గమనించలేదు  అంటాడు.. 

 

దానికి  మిగిలిన  వాళ్ళు చిన్నగా  నవ్వుతు ఏంటి  బాస్  వచ్చిన  రోజే  వర్క్  అంత చేసేసి   బెస్ట్ ఎంప్లొయ్  అనిపించుకుందామనే  అంటారు  ఆటపట్టిస్తున్నట్టుగా… 

 

ఆ మాటలకు రిషి  కూడా  నవ్వేస్తూ  నో నో అలా ఏం లేదు. ఏదో ఫస్ట్ డే  కదా.. వచ్చిన  రోజే  మిస్టేక్స్  చేసి బ్యాడ్  నేమ్ తెచ్చుకోవడం  ఎందుకు  అని ఏదో కొంచెం  ఎక్కువ శ్రద్ద తీసుకున్నాను..ఎంతయినా “ఫస్ట్  ఇంప్రెషన్  ఇస్ ది  బెస్ట్ కదా”అని  చెప్తాడు … 

 

దానికి  వాళ్ళు నవ్వేస్తూ హ్మ్ తెలివైనవాడివే..ఓకే లే  పద కాంటీన్ కి వెళ్లి  లంచ్ చేసొద్దాం  అంటూ  అందరు  కలిసి కాంటీన్ కి వెళ్లి  మాట్లాడుకుంటూ లంచ్  ఫినిష్ చేస్తారు…ఆఫ్టర్ లంచ్ బ్రేక్ మళ్ళీ  ఎవరి పనిలో వాళ్ళు పడతారు … 

 

  అలా  మనోడు  ఈవెనింగ్ కి  మేనేజర్  ఇచ్చిన  ఫైల్స్  అన్ని  చెక్  చేసి  ఏ తప్పులు  లేకుండా  వర్క్  పూర్తి  చేసి మేనేజర్  రూమ్కి  వెళ్లి ఆ ఫైల్స్  ఇస్తాడు … 

 

ఆయన  అవన్నీ  మళ్ళీ ఒకసారి  చెక్  చేసి మిస్టేక్స్  ఏమి  లేకపోవడంతో  రిషిని  మెచ్చుకున్నట్టుగా వెల్ డన్ రిషి… యూ డిడ్ యే గుడ్  జాబ్… కీప్ ఇట్  అప్   మాన్.ఎప్పుడు ఇలానే   వర్క్ని  జాగ్రత్తగా  చెయ్  అని  చెప్పి  యూ మే  గో నౌ అంటాడు… 

 

రిషి  మేనేజర్కి  థాంక్స్  సార్  అని చెప్పి  బయటకి  వచ్చేస్తాడు… 

 

అలా ఈవెనింగ్ ఆఫీస్ టైమ్ అయిపోవడంతో  అందరు  ఒకరికి ఒకరు బాయ్  చెప్పుకుని  ఇళ్ళకి  వెళ్ళిపోతారు… 

 

  రిషి  వచ్చేసరికి  శ్రీను రూమ్ కి  వచ్చేసుంటాడు.. 

 

అలా రూమ్ కి  వచ్చిన  రిషిని చూసిన శ్రీను ఏరా  ఎలా  ఉంది నీ ఆఫీస్  ఫస్ట్ డే  అని అడుగుతాడు.

 

  హ  రా బానే  ఉంది ..స్టాఫ్  కూడా  బానే  మాట్లాడుతున్నారు ..ఇంక  మా మేనేజర్  కూడా  మంచి వాడిలాగానే  ఉన్నాడు .. 

 

ఈరోజు  నా  వర్క్ని మెచ్చుకున్నాడు  కూడా  అంటూ  ఆఫిస్ లో జరిగింది  మొత్తం  చెప్తాడు రిషి.

 

దాన్ని విన్న శ్రీను హ్మ్   గుడ్ రా…మొత్తానికి  ఆఫీస్  నీకు  నచ్చింది అది చాలు అంటాడు నవ్వుతు..

 

హ రా…ఫస్ట్  డేనె  కదా  ముందు  ముందు  ఎలా  ఉంటుందో  చూడాలి  అంటాడు  రిషి … 

 

చూసేదేముంది రా ఇక్కడ  ఉంది  ది  గ్రేట్  రిషి  కిరణ్…వారికి   ఎవరితో  ఎలా  ఉండాలో,  ఎవరిని  ఎక్కడ  ఉంచాలో  బాగా  తెలుసుగా  ఇంక  చింతేలా   మహాప్రభూ  అంటాడు నాటకీయంగా .. 

 

నువ్వు మరీ చెప్తున్నావ్ రా బాబు.. చాల్లే ఆపింక ఎక్కువ అవుతుంది అని చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్లి పోతాడు రిషి. 

 

నెక్స్ట్ డే…

 

 మార్నింగ్  ఆఫీసి లో యధావిధిగా  అందరు  వచ్చి  ఒకరిని ఒకరు  విష్  చేసుకుని  వాళ్ళ వాళ్ళ  సీట్స్లొ  కూర్చుని  సిస్టంలొ  వర్క్  చేసుకుంటున్నారు… అప్పుడే  ఎస్క్యూజ్  మీ అంటూ ఒక అమ్మాయి  వాయిస్   వినిపించింది.

 

 

continued….

 

ఆ అమ్మాయి ఎవరు అయి ఉంటుంది?