వైల్డ్ బిస్ట్ – 2
‘తలుపు తీయండి నాన్న..’ అని చెప్పిన జాహ్నవి ఒక తల్లి,బిడ్డ కడుపు నింపుతున్నాను అని అనుకుంది కానీ..! తన కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంది అని ఆ క్షణం ఊహించలేదు.
తలుపు దగ్గరకి వెళ్లి ఆయన తలుపు తీసిన మరుక్షణం తలుపు నెట్టుకుంటూ పదిమంది క్రూరముగాలు ఆ ఇంట్లోకి చొచ్చుకొచ్చారు కత్తులతోటి.
ఇది ఊహించని ఆయన వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తూ భార్యని బిడ్డని “పారిపోండి..” అని అరిచాడు.. వాళ్ళ చేతిలో ఉన్న కత్తులకి బలి అయిపోయాడు.
తన భర్త మరణాన్ని కళ్ళతో చూసిన ఆమె బిడ్డను కాపాడుకోవాలి అని తన బిడ్డ చెయ్యి పట్టుకొని ఆ పక్కనే ఉన్న వంట గదిలోకి వెళ్లి తలుపు వేయబోయింది.
కళ్ళముందు తండ్రి మరణాన్ని క్షణకాలంలో చూసిన ఆమె కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవాలని పరుగు లాంటి నడకతో ఆమె తల్లిని అనుసరించింది.
రెండు లేగ దూడల్ని వెంటాడినట్టుగా ఆ క్రూర మృగాలు ఆ ఆడవాళ్ళ వెంటపడ్డారు.
వంట గదిలో గడియ పెట్టడానికి ఆమెకి సమయం ఇవ్వలేదు వాళ్ళు.
ఆమెకి అర్థం అయిపోయింది తన చావు ఈ క్షణం జరగబోతుంది అని.. కానీ..! తను ఆమె కోసం ఆలోచించలేదు.. ఆమెకి అసలు ఆశ కూడా లేదు ప్రాణం మీద తన భర్త చావు చూశాక.
కానీ..! ఇంకా ఈ ప్రపంచం చూడని తన బిడ్డ కడుపులో ఉన్న పసికందు గురించి తన బిడ్డ గురించే ఆమె చింత అంతా.. కన్నీళ్ళతో ఆమె బిడ్డని చూసి “పారిపో జాను..” అని అరిచింది ఆమె.
“నిన్ను వదిలి నేను వెళ్లనమ్మ..” అని ఏడుస్తూ ఉంది జాను.
“ఇప్పుడు నా గురించి కాదు నువ్వు ఆలోచించేది.. నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించి పారిపో.. వీళ్ళని ఎక్కువ సేపు నేను ఆపలేను..” అని అంది ఏడుస్తూ ఆ తల్లి.
ఆ క్షణం తన వాళ్ళ ప్రాణం కంటే కూడా తన కడుపులో ఉన్న బిడ్డ ప్రాణమే ముఖ్యమనిపించింది జానుకి.. తన తల్లిని వదల లేక వదులుతూ అక్కడ నుంచి పరుగెడుతూ ఉంది కడుపు మీద చెయ్యి వేసుకొని.
బలమంతా ప్రయోగిస్తూ ఆ గది తలుపులని నెడుతూ ఉంది.. తన బిడ్డని కాపాడుకోవడానికి తనలో లేని శక్తిని కూడా కూడ తీసుకుంటూ ఆ సగటు తల్లి.
ఎంత ప్రయత్నించినా గుంట నక్కల ముందు కుందేలు అయింది ఆ తల్లి.. కొన్ని క్షణాల వ్యవధి కాలానికి మాత్రమే పరిమితమైంది ఆ తల్లి బలం ఆ తోడేళ్ల ముందు..
తలుపుని చేతులతో నేడుతూ,కాళ్లతో తంతు మొత్తానికైతే ఆ తల్లిని నెట్టేశారు తలుపుతో పాటు.
వెనకకు వెళ్లి పడింది ఆ తల్లి ఓడిపోయి.
ఆమెని తొక్కుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు ఆ మృగాలు.
ఆ ఇంటి ప్రహరీ దాటి పరిగెడుతూ ఉంది జాహ్నవి ఆ చీకట్లో ఎటు వెళ్తుందో కూడా తెలియకుండా.
వెళ్తున్న మృగాల కాళ్లు పట్టుకొని ఆపడానికి ప్రయత్నించింది ఆ తల్లి.
వాళ్ల చేతిలో ఉన్న కత్తులకి నెత్తురు వేడుక చేశారు.. ఆ తల్లి శరీరాన్ని చీల్చి ఆ కత్తులతో.
చివరి ఊపిరి వరకు ప్రయత్నించి ఓడిపోయింది ఆ తల్లి.
ఆయాసంగా పరిగెడుతూ ఉంది జాహ్నవి.. నిండు నెలల వాళ్ళనో లేదా చీకటి వాళ్ళనో ఊపిరి కూడా తన చేవులకి ప్రతిధ్వనిస్తూ ఉంది.
“అరేయ్ అది ఎక్కువ దూరం పారిపోదు ఇక్కడే ఎక్కడో ఉంటుంది వెతకండి..” అని అంటూ ఒక్కో దిక్కుకి వెళ్లారు వాళ్ళు జాహ్నవి కోసం.
జాహ్నవికి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు.. వాళ్ళ చేతిలో ఉన్న కత్తులు మెరుస్తూ ఇంకా భయపెట్టాయి తనని.
పరిగెత్తడం వల్ల..నిండు నెలల గర్భం వల్ల తన కాళ్ళ వెంట రక్తం కారుతూ ఉంది.
ఇంట్లో ఉన్నప్పుడు ఉరుములు మెరుపులు భయపెట్టిన జాహ్నవికి ఇప్పుడు అసలు ఉరుములు మెరుపులు తనకి వినిపించినట్టుగా పరిగెడుతూ ఉంది.. అలుపు వస్తున్న నోటిని చేతులతో మూసుకుంటూ.
ఆరు అడుగుల రెండు అంగుళాలు ఉన్న ఒక బలిష్టమైన దేహం ఉరుములని చూస్తూ తలుపు దగ్గరకి వచ్చి నిలబడింది..
“ఎప్పుడు తలుపు మూసి ఉండే ఇల్లు ఈరోజు ఏంటి తలుపు తీసి ఉంది..!” అని అనుకుంటూ ఒక అడుగు ముందుకు వేశాడు గడపలోకి.
గడపలోకి వేసిన రెండో అడుగుకి ఏదో తగిలింది కాలికి.. భయంగా రెండు అడుగులు వెనకకి వేసి ఫోన్లో ఉన్న టార్చ్ ఆన్ చేశాడు..
ఎదురుగా బోర్లా పడుకొని ఉన్న వ్యక్తిని చూసి భయపడుతూ..” నాన్న..!” అని అన్నాడు ఆ వ్యక్తిని వెళ్ళాంకళ్ళా తిప్పుతూ.
కొన ఊపిరితో ఉన్న ఆయన..”అర్జున్.. జాను,అమ్మ….” అని అన్నాడు.. వంటగది వైపు చేయి చూపిస్తూ అలాగే కళ్ళు మూసుకోని చివరి శ్వాస వదిలేసాడు.. ఆయన కొడుకు చేతిలోనే.
“నాన్న.. నాన్న..” అని భయంగా అరుస్తూ ఆయనని ఊపుతూ ఉన్నాడు అర్జున్.
ఇక ఉంటాను
మీ అల్లరి రాక్షసి ప్రశాంతి శ్రీకాంత్..❤️❤️❤️
Swipe left/right or tap the sides to turn pages