నేను ఎందుకు గిల్టీ ఫీల్ అవ్వడం … అసలు అవసరం లేదు ” అని అనుకుంటూ ప్రిన్సిపాల్ కి రేపు ఆఫ్టర్ నూన్ ఎగ్జామ్ రాయడానికి ఒకే చెప్పి నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది.
ఇంటికి వెళ్లి బెడ్ మీద కూర్చోనీ , పుష్ప అనే పేరు ఆన్సర్ షీట్ మిద ఎందుకు రాసింది అని ఆలోచిస్తూ ఉంటుంది పూర్ణిమ…
అలా పుష్ప గురించి ఆలోచిస్తూ ఉంటే తెలియకుండానే పూర్ణిమ కళ్ళల్లో నీళ్ళు చెంపల మీదకి జారిపోతూ ఉంటాయి…
బాధగా తన బెడ్ పక్కన ఉన్న టేబుల్ డ్రా ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోటో ఫ్రేమ్ చేతిలోకి తీసుకొని , దాన్ని తడుముతూ…..ఏడుస్తూ ఉంటుంది పూర్ణిమ.