New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
❤️నీ ప్రేమకై నేను❤️ – 7

❤️నీ ప్రేమకై నేను❤️ – 7

నేను ఒప్పిస్తాను అంకుల్ తను లేకుండా నేను బ్రతకలేను నాకు సంజన కావాలి. నేను తనని ఎంతగా ప్రేమించానో మీకు తెలియదు తను నాకు దక్కకపోతే నేను చావటానికి అన్నా సిద్ధపడతాను గాని తనని మాత్రం వదులుకోను అని అంటాడు..

విశ్వనాథ్ అజయ్ ని చూసి సంజనకి నీలాంటి వాడు భర్తగా దొరకడం తన అదృష్టం అని అంటాడు.. కన్నీళ్ళతో

అజయ్ రామారావు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు మన ప్లాన్ సక్సెస్ అయ్యింది అన్నట్లుగా.

పైకి వెళ్లిన సావిత్రి సంజన చూసి ఎందుకురా ఇంత దిగులుగా కూర్చున్నావు అని అడుగుతుంది .

ఏం లేదు ఆంటీ అని చిన్నగా సమాధానం ఇస్తుంది.
సంజన.

నీకోసం అజయ్ వచ్చాడు వాడు నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని నిక్కచ్చిగా చెప్పాడు అని చెప్తుంది సావిత్రి..

కానీ నేనైతే ఇప్పుడు పెళ్లికి రెడీగా లేను ఆంటీ నా మనసులో అజయ్ ఉన్న నా శరీరాన్ని ఇంకొక వ్యక్తి తాకాడు అది మలినం అయిపోయింది అలాంటి శరీరంతో మీ ఇంటిలో కోడలిగా నేను అడుగుపెట్టలేను దయచేసి నన్ను క్షమించండి నాకంటే మంచి అమ్మాయి అజయ్ కి భార్యగా దొరుకుతుంది అని చెప్తుంది కన్నీళ్ళతో.

నీ కంటే మంచి అమ్మాయి నాకు భార్యగా దొరకొచ్చేమో కానీ నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకదు నేను నీ శరీరాన్ని చూసి ప్రేమించలేదు నీ మనసును చూసి ప్రేమించాను మలిన పడింది మీ శరీరమే గాని నీ మనసు కాదు వయసు మీద పడి కృంగిపోయే శరీరం నాకు అవసరం లేదు నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ నాకు చాలు ఎంత కాలమైనా నీ ప్రేమ కోసం ఎదురుచూస్తాను నిన్ను తప్ప నేను ఎవర్ని పెళ్లి చేసుకోలేను నా భార్య స్థానంలో ఇంకొకరిని నేను ఊహించుకోలేను అని అంటాడు అజయ్ లోపలికి వచ్చి..

అది కాదు అజయ్ నేను చెప్పేది అని ఏదో చెప్పబోతుండగా ఆమె నోటికి చెయ్యి అడ్డుపెట్టి ఇంకేమీ చెప్పొద్దు అన్నట్లుగా సంజనను ఆపేస్తాడు అజయ్..

సావిత్రి వైపు కాత్యాయని వైపు చూసి నేను తనతో ఒంటరిగా మాట్లాడాలి కొంచెం మీరు బయట వెయిట్ చేస్తారా  అని మర్యాదగా అడుగుతాడు ..

ఇద్దరూ అక్కడ్నుంచి బయటకు వచ్చేస్తారు..

సంజన ఎదురుగా మంచం మీద కూర్చొని ఇప్పుడు ఇలా జరిగింది అని నాతో పెళ్లికి వద్దు అని అంటున్నావు ఇదే మన పెళ్లి అయినాక జరుగుతుంటే ఏం చేసేదానివి అప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయే దానివా ..
నీ తప్పు లేకుండా నిన్ను నువ్వు శిక్షించుకోవడం నాకు నచ్చలేదు వాడు చేసిన మోసానికి నువ్వు బలవడం నాకు ఇష్టం లేదు.. నువ్వు  నాకు కాబోయే భార్యవి నేను ప్రేమించిన దానివి నేను ఎప్పటికీ నిన్ను వదులుకోలేను ఐ లవ్ యు సంజన అని అతని కన్నీళ్లు ఆమె పాదాల మీదకు పడేలాగా ఆమె పాదాలను అతని చేతులతో పట్టుకుంటాడు …

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue