New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
❤️నీ ప్రేమకై నేను❤️ – 5

❤️నీ ప్రేమకై నేను❤️ – 5

సావిత్రి కోపంగా గౌతం అని అరిచిన అరుపుకి నిద్రలో ఉన్న గౌతం కింద ఉన్న అజయ్ రామారావు విశ్వనాధులు కూడా ఉలిక్కి పడతారు..

సావిత్రి అరుపుకి ఏం జరిగిందో అని భయపడుతూ పైకి వెళదామని చూసిన విశ్వనాథ్ చేతిని పట్టుకొని ఆపేసి మీరు పైకి వెళ్లొద్దు మావయ్య పైన సంజన పరిస్థితిని చూసి మీరు తట్టుకోలేరు అని చెప్పాడు  కన్నీళ్ళను దిగమింగి బాధగా చెప్తాడు ..

అసలు ఏమైంది ఎందుకు మీరు నన్ను నా కూతురు దగ్గరికి వెళ్లనివ్వడం లేదు తనకు ఏమైనా అయిందా అని కంగారుగా అడుగుతాడు.

అజయ్ విశ్వనాధ్ ని చూసి తను పైన చూసిందంతా చెప్తాడు..

కూతురు గురించి అజయ్ చెప్తున్నది నమ్మలేకపోతాడు కన్నీళ్ళతో నువ్వు అసలు ఏం చెప్తున్నావు నీకైనా అర్థమవుతుందా అని అడుగుతాడు..

నేను చూసింది చెప్పాను అంకుల్ నేను చెప్పింది వినిన మీరే ఇలా అయిపోతే నా కళ్ళతో నేను వాళ్ళని అలా చూసి ఎంత బాధపడి ఉంటాను అని అంటాడు..

ఒక్కసారిగా విశ్వనాధ్ సోఫాలో కూలబడిపోతాడు..

సావిత్రి అరిచిన అరుపుకి కళ్ళు తెరిచిన గౌతం ఎదురుగా కోపంగా తననే చూస్తూ ఉన్నా సావిత్రిని కాత్యాయనిని చూసి ఏమైంది ఆంటీ ఎందుకు అలా అరుస్తున్నారు అని అడుగుతాడు.

సావిత్రి కోపంగా మంచం దగ్గరికి వెళ్లి గౌతమ్ ని చూసి అసలు నువ్వు మనిషివేనా నీ స్నేహితుడికి కాబోయే భార్య మీద చెయ్యి వేస్తావా తన జీవితాన్ని నాశనం చేస్తావా అని అరుస్తుంది .

తను నా స్నేహితుడికి కాబోయే భార్య కాదు నాకు కాబోయే భార్య నేను సంజన ని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు.

సంజన కోపంగా తల్లిని వదిలి గౌతమ్ దగ్గరకు వచ్చి అతని చంప మీద గట్టిగా కొట్టి ఏమనుకుంటున్నావు రా నువ్వు? నువ్వు నా జీవితాన్ని నాశనం చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటున్నావా నేను చావనన్న చస్తాను గాని నిన్ను పెళ్లి చేసుకోను ఇప్పటివరకు నువ్వు నా ఫ్రెండ్ వి ఇప్పటినుంచి నువ్వు నా ఎనిమివి ఐ హేట్ యు అని అంటుంది ఏడుస్తూ ..

గౌతమ్ నవ్వుతూ నువ్వు ఎన్నన్నా ఎవరు ఎంత ఆపినా నిన్ను పెళ్లి చేసుకునేది మాత్రం నేనే గుర్తుపెట్టుకో అని వార్డ్ రోబ్ లో నీకోసం డ్రెస్ పెట్టాను వెళ్లి చేంజ్ చేసుకో నిన్ను ఇలా నేను తప్ప ఇంక ఎవరు చూసినా ఆ క్షణమే వాళ్ళకి ఈ భూమి మీద ఆయుష్షు తీరిపోతుంది గుర్తుపెట్టుకో అని సీరియస్ గా చెప్తాడు ..

ముగ్గురు గౌతం కోపానికి భయపడి ఇంకొక మాట మాట్లాడకుండా సైలెంట్ అవుతారు .

సంజన వార్డ్ రోప్ ఉన్న డ్రెస్ తీసుకొని వేసుకొని  వస్తుంది…

కిందకు వస్తున్న  సంజన ని చూసి అజయ్ సైలెంట్ గా ఉండిపోతాడు విశ్వనాథ్ ధ్ సంజనాన్ని చూసి తన దగ్గరకు వెళతాడు తండ్రిని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది..

బాధగా దగ్గరికి వచ్చిన అజయ్ తనని పట్టుకో పోతుంటే వెనక్కి జరుగుతుంది .

అజయ్ బాధగా సంజన ని చూస్తూ జరిగిందంతా మర్చిపో ఇక్కడ అసలు ఏమీ జరగలేదు. నీకేమీ కాలేదు జరిగిన దానిలో నీ తప్ప ఏమీ లేదు మన పెళ్లి అనుకున్న సమయానికే జరుగుతుంది అని అంటాడు.

డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చిన గౌతం అజయ్ మాటలకు ఏంట్రా ఇంకా తనని పెళ్లి చేసుకుందామని ఆలోచనలోనే ఉన్నావా అని మెట్లు దిగుతూ సంజు నాది దాని పెళ్లి చేసుకుందాం అన్న ఆలోచన కానీ తనని పట్టుకుందామని ఆలోచన నీకు వచ్చిన స్నేహితుడు అని కూడా చూడకుండా చంపేస్తాను..

నా సంగతి నీకు బాగా తెలుసు నాది అనుకున్నది ఎవ్వరు తీసుకున్న నేను ఊరుకోను అలాంటిది నా సొంతమైన  సంజు ని నేను ఎలా వదులుకుంటాను అనుకున్నావు నీకు ఎలా దక్కనిస్తాను అనుకుంటున్నావు సంజనా పెళ్లి జరుగుతుంది కానీ అది నీతో కాదు నాతో అని సంజన తల్లిదండ్రులను చూసి మీరు తన తల్లిదండ్రులు కాబట్టి తనని తీసుకెళ్లే హక్కు ఉంది అది కేవలం పెళ్లి అయ్యేంతవరకు మాత్రమే వన్స్ మా పెళ్లి జరిగిన తర్వాత తన కేవలం నా దగ్గరే ఉంటుంది అప్పటివరకు మీ కూతుర్ని చాలా ప్రేమగా చూసుకోండి తనకే మాత్రం బాధ కలిగిన నేను మిమ్మల్ని తన తల్లిదండ్రులని కూడా చూడను అని గట్టిగా వార్నింగ్ టోన్లో చెప్తాడు.

అసలు ఏమనుకుంటున్నావు గౌతమ్ నువ్వు తను నాది నాది అంటున్నావు తను ఏమన్నా వస్తువు అనుకుంటున్నావా నా కూతురు ఒక మనిషి అన్న సంగతి నువ్వు మర్చిపోయావా తన ఇష్టం లేకుండా నువ్వు తన మీద చేయి వేసావు అలాగే తన ఇష్టం లేకుండానే తన పెళ్లి చేసుకుందామని అంటున్నావు తనకంటూ ఇష్టం ఫీలింగ్స్ అయి ఉంటాయని నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని బాధగా అడుగుతుంది కాత్యాయని.

చూడండి ఆంటీ మీరు తనని ఇక్కడ వదిలేయాలనుకుంటే వదిలేసి వెళ్ళండి లేదా తీసుకువెళ్లాలనుకుంటే తీసుకు వెళ్ళండి అంతేగాని ఈ సెంటిమెంట్ డ్రామా నా దగ్గర వర్క్ అవుట్ అవ్వదు…

 

to be continued….