New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
❤️నీ ప్రేమకై నేను❤️ – 4

❤️నీ ప్రేమకై నేను❤️ – 4

సరే డాడీ అని అజయ్ పైకెళ్ళి అన్ని గదులు ఓపెన్ చేసి చూస్తాడు కింద రామారావు కూడా గదులన్నీ చెక్ చేస్తాడు..

ఎక్కడా కనపడదు గౌతమ్ వాళ్ళు ఉన్న గది దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయకపోతే అది లోపల నుంచి లాక్ చేసి ఉంటుంది..

అంటే నైట్ ఇంటికి వెళ్లకుండా లేట్ అవ్వడంతో ఇక్కడ పడుకొని ఉందా అని సంజన సంజన డోర్ ఓపెన్ చెయ్ అని డోర్ కొడతాడు..

అజయ్ అరుపుకి కింద నుంచి పైకి వస్తాడు రామారావు కూడా …

ఎంతసేపటికి డోర్ ఓపెన్ చేయకపోవడంతో తండ్రిని చూసి నైట్ లేట్ అవ్వడంతో సంజన ఇక్కడే పడుకున్నట్లు ఉంది మీరు అంకుల్ కి కాల్ చేసి చెప్పండి నేను ఈ రూమ్ కి ఇంకొక కి ఉంది దాంతో రూమ్ లాక్ తీస్తాను అని చెప్పి అతను ఇంకొక కి కోసం వెళతాడు..

ఇంకొక కీ తో లాక్ తీసిన అజయ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి సంజనని గౌతమ్ ని చూసి షాక్ తో నుంచుండి పోతాడు..

రామారావు విశ్వనాథ్ కి కాల్ చేసి సంజన ఇక్కడే ఫామ్ హౌస్ లోనే ఉంది మీరు కంగారు పడొద్దు అని వాళ్లతో చెప్పి రూమ్ దగ్గరికి వచ్చిన రామారావు కొడుకుని చూసి ఏంట్రా అలా నుంచి ఉన్నావు అని అతని భుజం మీద చెయ్యి వేసి కదుపుతాడు.

వెంటనే స్పృహలోకి వచ్చిన అజయ్ కళ్ళనిండా నీళ్లతో సంజన ని అలా తండ్రికి చూపించలేక వెంటనే బయటకు వచ్చేసేసి తండ్రి హత్తుకొని ఏడుస్తాడు.

  ఏమైంది అజయ్ ఎందుకు ఏడుస్తున్నావు లోపల సంజన లేదా తనకి ఏమన్నా అయ్యిందా అని కంగారుగా అడుగుతాడు .

సంజన లోపలే ఉంది నాన్న తనతో పాటు గౌతమ్ కూడా ఉన్నాడు వాళ్ళిద్దరి మధ్య అని చెప్పలేకపోతాడు..

ఏంట్రా నువ్వు అనేది అని షాకింగ్ అడుగుతాడు రామారావు ..

అవును నాన్న నేను చెప్తుంది నిజం లోపల సంజనని గౌతమ్ ని అలా చూస్తానని నేనెప్పుడూ అనుకోలేదు తనే నా లైఫ్ అనుకున్నాను కానీ తను ఇలా అని అంటాడు.

వెంటనే రామారావు సంజన వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి ఫామ్ హౌస్ కి రమ్మని చెప్తాడు కోపంగా..

అప్పటికే తెల్లారడంతో సంజనకి గౌతమ్ కి మెలకువ వస్తుంది ఒళ్ళు బాగా నొప్పులుగా ఉండి కదలలేక తనువున్న పరిస్థితిని చూసుకొని ఏడుస్తూ నిదానంగా లెగిసి వాష్ రూమ్ లోకి వెళుతుంది..

తన కన్నీళ్లు ఆ నీళ్లలో కలిసిపోతాయి అద్దంలో తనని తను చూసుకుని తనలోని బాధనంత కన్నీళ్ళ రూపంలో వదిలేస్తుంది ..

అజయ్ నీ పెళ్లి చేసుకోబోతున్న ప్రేమించిన కనీసం తనని అతన్ని ముట్టుకోను కూడా ముట్టుకోనివ్వలేదు అలాంటివి తన అనుమతి లేకుండా తన శరీరాన్ని తాకిన గౌతమ్ మీద కోపంతో అతని ముట్టుకున్న ప్రతి చోట రుద్ది రుద్ది ఎర్రగా చేసుకుంటుంది.

కట్టుకోవడానికి బట్టలు లేకపోవడంతో ఏం చేయాలి అని ఆలోచిస్తూ హాంగర్ కి తగిలించిన టవల్ ని తీసుకొని కట్టుకొని బయటకు వస్తుంది .

ఫామ్ హౌస్ కి వచ్చిన సంజన తల్లి తండ్రి నీ నీ కోపంగా చూస్తూ ఉంటాడు రామారావు.

కాత్యాయని రామారావు చూస్తూ అన్నయ్యగారు మా అమ్మాయి ఎక్కడ అని అడుగుతుంది .

ఏం సమాధానం చెప్పలేక పైన ఉంది అని చెయ్యి పెట్టి చూపిస్తాడు..

కాత్యాయని తో పాటు వెళుతున్న విశ్వనాధుని చూసి మీరు ఇక్కడే ఉండండి మీ అమ్మాయి ఉన్న పరిస్థితిని మీరు చూసి తట్టుకోలేరు అని చెప్తాడు రామారావు.

ఏంటి బావగారు మీరు అనేది అని విశ్వనాథ్ అడుగుతాడు.

అతను ఏం చెప్తున్నాడో అర్థం కాక వెళ్ళేది కూడా వెనక్కి తిరిగి చూస్తుంది కాత్యాయని …నువ్వు వెళ్ళామా అని ఆమెతో చెప్తాడు… వాళ్ళతో పాటే వచ్చిన సావిత్రి కూడా కాత్యాయ నీతో పాటు పైకి వెళుతుంది ..

డోర్ తెరిచి ఇద్దరు లోపలికి అడుగుపెట్టేసరికి టవల్తో నుంచొని ఉంటుంది సంజన బెడ్ మీద పడుకొని ఉంటారు గౌతం
               
ఇద్దరికీ ఒక్క క్షణం గుండె ఆగినట్లుగా అనిపిస్తుంది ఒక్కసారిగా డోర్ తీసుకొని లోపలికి వచ్చిన తల్లిని అత్తని చూసి సంజనా కూడా షాక్ తో తో నించొని ఉండిపోతుంది.

కన్నీళ్ళతో వాళ్లను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది..

కాత్యాయని ఒక్కొక్క అడుగు లోపలికి వేసి సంజన చూస్తుంది కన్నీళ్ళతో ఎర్రగా ఉన్న కళ్ళు మొహం అంతా వాచి పెదవి చివరన చిట్లి కనిపిస్తుంది ..

కళ్లనిండా నీళ్లతో కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూస్తున్న కాత్యాయిని సంజు ఏమైంది రా నీకు అని తడబడుతూ అడుగుతుంది.

సంజన ఏడుస్తూ తల్లిని కౌగిలించుకొని నిజంగా నా తప్పేమీ లేదు నేనే తప్పు చేయలేదు అమ్మ వాడే నా మీద ఇలా అని చెప్పలేక ఏడుస్తూ వెక్కిళ్ల మధ్యన చెప్తుంది..

సావిత్రి కోపంగా గౌతం అని అరిచిన అరుపుకి నిద్రలో ఉన్న గౌతం కింద ఉన్న అజయ్ రామారావు విశ్వనాధులు కూడా ఉలిక్కి పడతారు..

 

to be continued…..