New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
❤️నీ ప్రేమకై నేను❤️ – 6

❤️నీ ప్రేమకై నేను❤️ – 6

చూడండి ఆంటీ మీరు తనని ఇక్కడ వదిలేయాలనుకుంటే వదిలేసి వెళ్ళండి లేదా తీసుకువెళ్లాలనుకుంటే తీసుకు వెళ్ళండి అంతేగాని ఈ సెంటిమెంట్ డ్రామా నా దగ్గర వర్క్ అవుట్ అవ్వదు…

నాకు చాలా వర్క్ ఉంది అని సంజన ని చూసి ఎవ్వరి మాటలు వినొద్దు. నీకు కేవలం నేను చెప్పిన మాటలు మాత్రమే నీ మైండ్ లో రన్ అవ్వాలి ఇంకేమి నీ మైండ్లో రన్ అయినా నా సంగతి నీకు బాగా తెలుసు ఓకేనా అని ఆమె బుగ్గ మీద చెయ్యి వేసి అంటాడు.

చిరాగ్గా మొహం పక్కకు తిప్పేసుకుంటుంది సంజన.

గౌతమ్ నవ్వుతూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు.

సంజనని తీసుకొని కాత్యాయని విశ్వనాధ్ వాళ్ళ ఇంటికి వెళ్లి పోతారు .

సావిత్రి అజయ్ రామారావు వాళ్ళ ఇంటికి వెళ్లి పోతారు.. గౌతమ్ చేసిన పనికి కోపంగా ఇంట్లోకి అడుగుపెట్టిన అజయ్ హాల్లో కనిపించిన సామాన్లన్నీ విసిరికొడుతూ వాడిని ఊరికనే వదలను వాడి ప్రాణాలు తీస్తాను నా సంజన ని నాకు కాకుండా చేశాడు నా ప్లాన్ అంతా కొలాప్స్ అయ్యేలాగా చేశాడు అని గట్టిగా అరుస్తాడు ..

సావిత్రి అజయ్ కోపాన్ని చూసి దూరంగా నుంచుంటే రామారావు అజయ్ను ఆపి ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది సంజనను ఎలా పెళ్లి చేసుకోవాలి మన కంపెనీని ఎలా నిలబెట్టాలి అని ఆ గౌతమ్ గురించి కాదు ఏదైనా కోపంతో ఆవేశంతో కాదు ఆలోచనతో చేయాలి ఏం చేయాలో ముందు అది ఆలోచించు మనకి ఎక్కువ టైం లేదు..

నువ్వు సంజనని పెళ్లి చేసుకోక పోతే మన ముగ్గురం అడుక్కుతినాల్సిందే గౌతమ్ ని కోపంతో పగతో బలంతో మనం ఏమి చేయలేము ఎందుకంటే వాటన్నిటిలో వాడు మనల్ని మించి ఉన్నాడు ఆలోచించి దెబ్బ తీయాలి డైరెక్ట్ గా వాడి పరువు మీదే కొట్టాలి ఏం చేయాలో ఆలోచించు అని కొడుకు భుజం తట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ..

వెనకే వెళ్లిన సావిత్రి ఆ అమ్మాయి విషయంలో ఇంత జరిగాక కూడా ఇంకా మీరు ఆ అమ్మాయిని మీ కొడుక్కి చేసుకుందామని అనుకుంటున్నారా అని అడుగుతుంది కోపంగా .

మనకు అంతకుమించి దారి లేదు ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు నువ్వు సైలెంట్ గా ఉండు అని కోపంగా మాట్లాడతాడు రామారావు ..

ఇంటికి వెళ్లిన సంజన తన రూమ్ కి వెళ్లి మంచం మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ..

కూతురు బాధను చూసి కాత్యాయని నీ బాధని నేను ఓదార్చలేను కానీ నా కూతురు జీవితం నా కళ్ళముందే నాశనం అయిపోతుంది నేను భరించలేను ఏది చేసిన ఆలోచించే చెయ్యి నీకేమైనా అయితే నీ మీద ప్రాణాలు పట్టుకు బ్రతుకుతున్న నేను మీ నాన్న కూడా ప్రాణాలతో ఉండము నా కూతురు పిరికిది కాదు ధైర్యంగా ఎలా నిలబడాలో దానికి చిన్నప్పటినుంచి మేము నేర్పించాము ఎటువంటి పిచ్చి పని చేయదు అని నాకు నమ్మకం ఉంది అని కాత్యాయని ఆ గది నుంచి బయటకు వచ్చేస్తుంది .

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue