అలా ఆ ఇల్లు ఆరోజు నవ్వులతో, ఆనందాలతో విరబూస్తుంది.
రామ్, సీత మళ్లీ వాళ్ల ఇంటికి బయలుదేరారు.
ఇంటికి రాగానే రాజ్యలక్ష్మి గారు ఇద్దరికీ దిష్టి తీయించి లోపలికి రమ్మని చెప్తారు.
రాజ్యలక్ష్మి గారికి సీతను చూస్తుంటే, సీత మొహంలో ఏదో కొత్త కల కనిపిస్తుంది. సీత దగ్గరికి వెళ్లి, “నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు సీత!” అంటారు.
“అవును అమ్మమ్మగారు. మా పిన్ని నన్ను చాలా బాగా చూసుకుంది. నేను వచ్చిన తర్వాత మా పిన్నిలో ఇంత మార్పు వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇన్ని రోజులు మా నాన్న చెల్లెలి గురించి కొంచెం దిగులుగా ఉండేది. కానీ ఇప్పుడు నేను దిగులు పడాల్సిన అవసరం లేదు.”
అని వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా, సుమన, ఇందుమతి అక్కడికి వస్తారు.