హాల్ లో కూర్చున్న అందరికీ తను చేసిన పాయసం ను బౌల్స్ లో వేసి సర్వ్ చేస్తున్న రాగిణి స్టెప్స్ వైపు వెల్తున్న ప్రణవి ను చూసి అందరూ ఇక్కడే ఉంటే పైకి ఎక్కడికీ వెళ్తున్నావ్ ప్రణవి కమ్ అంటూ పిలుస్తున్న రాగిణి ను చూసి నీ కొడుకు కోడలు అంత దగ్గరగా అతుక్కుని కూర్చుంటే అది చూసి నేను బరించలేక వెళ్తుంటే ఎందుకు అత్త నన్ను మళ్లీ పిలిచావ్ అంటూ వెళ్లి సోఫా లో కూర్చుని పాయసం తినలేక తింటూ ఆషి ఉన్న ప్లేస్ లో తాను వున్నట్టు ఊహించుకుంటుంది …..
ఆ ప్లేస్ కోసం ఎన్నో ఇయర్స్ గా ఎదురు చూస్తూంటే దాదాపు ఆ ప్లేస్ నా సాంతం అయ్యే టైమ్ కి ఎక్కడి నుండి వచ్చావే ఇన్నాళ్ళుగా నేను పడ్డ కష్టం మొత్తం మీ పెళ్ళి తో స్పాయిల్ అయింది ఇల్లు అలగ్గానే పండుగ కాదు అలాగే మీ పెళ్ళి జరిగినంత మాత్రాన మీరు విడిపోకుండా సంతోషంగా ఉంటారు అనుకోకండి అని ఆషి వైపు కోపంగా చూస్తుంది ….
ఈ ప్రణవి ఉన్నంత వరకు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వను బావ నాకు దక్కక పొయినా పర్లేదు కానీ నీ సాంతం అవ్వనివ్వను చూస్తూ ఉండు మీ మధ్య ఎలాంటి ఆగాధాన్ని సృష్టిస్తానో దెబ్బకు మీరు మళ్లీ కలవడానికి కొన్ని నెలలు పట్టాలి అని ఇద్దరి వైపు కోపంగా చూస్తు పల్లు బిగపట్టి చూస్తూ ఉంటుంది