ప్రణవి ను తీసుకుని మహల్ కి వెళ్ళిన సూర్య దేవ్ ఫాస్ట్ గా మహల్ లోకి వెళ్తూ ప్రణవి వెళ్ళి ఆషి ను తీసుకుని రా ఫాస్ట్ అంటూ ప్రణవి ను ఆషి రూమ్ లోకి పంపి క్రిష్ణ దేవ్ కి కాల్ చేసి దియా హెల్త్ కండిషన్ ఎలా ఉందో అని మాట్లాడుతూ తనకు తెలిసిన టాప్ మోస్ట్ డాక్టర్స్ తో బ్యాక్ టు బ్యాక్ కాల్స్ మాట్లడుతూ బిజిగా ఉంటాడు ఆషి రూమ్ లోకి వెళ్ళిన ప్రణవి కాలి రూమ్ ను చూసి నవ్వుకుంటూ నీ కోడలు మహల్ లో లేదని తెలిస్తే ఏమై పోతావ్ మావయ్యా అయినా అది జస్ట్ ప్లాసింగ్ క్లౌడ్ లాంటిది అలా వచ్చింది ఇలా వెళ్ళిపోయింది ఎప్పటికైనా నేనే నీ కోడల్ని మావయ్యా అది బ్రతికుంటే ఎప్పటికైనా దానికి నిజం తెలిసే అవకాశం ఉంది అలా జరిగితే నా ప్రేమ ఎప్పటికి గెలవదు సరి కదా బావ నన్ను దగ్గరకు కూడా రానివ్వడు