New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అందాల రాక్షసి{1} – 29

అందాల రాక్షసి{1} – 29

అభి కాల్ చేసి అఫీస్ పక్కనున్న రెస్టారెంట్ లో వెయిట్ చేస్తుంటాను రమ్మని కాల్ కట్ చేయడం తో దీన్ని ఇక్కడే క్యాంటీన్లో వెయిట్ చేయమంటే బయటకి ఎందుకు వెళ్ళింది అని అభి ను తిట్టుకుంటూ హెచ్. ఆర్ ను బ్రతిమలాడి గంట పర్మిషన్ తీస్కొని అభి చెప్పిన రెస్టారెంట్ లోకి వెళ్లి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ తింటున్న అభి తల మీద ఒక్కటి పీకి నిన్ను లోపల వెయిట్ చేయమంటే బయటకి ఎందుకు వచ్చావే నీ వల్ల మా హెచ్. ఆర్ తో బండ బూతులు  తిట్టించుకుని మరీ వచ్చాను అంటూ అభి చేతిలోని ఐస్ క్రీమ్ లాక్కుని తింటూ చెప్తుంది

ఒసేయ్ కకృతి మోహమా కావాలంటే ఇంకోటి ఆర్డర్ చేసుకో నేను తినేది లాక్కుని తింటావేంటి అంటూ వెయిటర్ ను పిలిచి తన కోసం మరోటి ఆర్డర్ చేస్తుంది

వాడు తెచ్చే వరకూ నేను ఆగలేను అసలే నా ఫేవరెట్ ఫ్లేవర్ ఎంగిలి అయితే ఎన్టీ అయినా నీ ఎంగిలి బలే టేస్ట్ ఉంటుంది లే అంటూ అభి కి కన్ను కొడుతూ నవ్వుతూ తింటున్న బావన ను చూసి తల కొట్టుకుంటూ నువ్వు కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు కదే అంటూ తన కోసం వచ్చిన ఐస్ క్రీమ్ తీసుకుని తింటూ అడుగుతుంది

మనం ఎప్పటికి ఒకే లాగ ఉంటాం కానీ ముందు ఇంటర్వ్యూ సంగతి చెప్పు ఏమైంది అపుడే ఎందుకు వచ్చేసావ్ ఫస్ట్ రౌండ్ లోనే బయటకి గెంటేసారా ఎంటి

బవీ అంటూ చిరు కోపంగా చూస్తున్న అభి వైపు చూసి హాయిగా నవ్వెస్తు జస్ట్ కిడ్డింగ్ రే సరే బీ సీరియస్ చెప్పు ఏమైందీ ఇంటర్వ్యూ అంటూ అభి వైపు చూస్తుంది

ఫస్ట్ రౌండ్ లోనే సెలెక్ట్ అయ్యాను ఇదిగో అపాయింట్మెంట్ లెటర్ అంటూ నవ్వుతూ లెటర్ బావన చేతిలో పెడుతూ ఇదంతా నీ వల్లే బవీ చాలా థాంక్స్ అంటూ హార్ట్ఫుల్ గా చెప్తుంది

ఏయ్ మనకు మనకు థాంక్స్ ఎంటి అయినా నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నీలో టాలెంట్ లేకపోతే నీకు ఈ జాబ్ రాదు సో ఇదంతా నీ కష్టం ఎనీ వే కంగ్రాట్స్ డియర్ అంటూ అభి చేతిని పట్టుకుని నవ్వూతూ చెప్తుంది

అభి నవ్వుతూ థాంక్స్ బవీ ఇంకో వీక్ లో జాయిన్ అవ్వాలి ఆ లోపు మంచి హౌస్ చూడాలి ఇక్కడికి సామాన్లు షిఫ్ట్ చేయాలి గ్రాసరీస్ తెచ్చుకోవాలి అబ్బో చాలా పనులు వున్నాయి

అవన్నీ ఫినిష్ అవుతాయి కానీ ఈవెనింగ్ నా అఫీస్ అయ్యాక హౌజ్ చూడడానికి వెళ్దాం నేను బాగా తిరిగి 5 ఇల్లు లైన్ లో పెట్టాను నువ్వు దాంట్లో ది బెస్ట్ సెలెక్ట్ చేస్తే అడ్వాన్స్ పే చేసేద్దాం

హ్మ్మ్ ఆది సరే మీ బాస్ గురించి చెప్పు మనిషి ఎలాంటి వాడు అఫీస్ అవర్స్ లో స్టాఫ్ తో ఎలా వుంటాడు వర్క్ విషయం లో ఎలా ఉంటాడో నాకు తెలిస్తే నేను కొంచెం కేర్ఫుల్ గా ఉంటాను అవునూ ఇంతకి మీ బాస్ పేరు ఎంటి

ఎన్టీ బాస్ పేరు కూడా ఇంకా తెలియదా అని షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఇంతకీ మన కంపెనీ నేమ్ అయినా తెలుసా లేక అది కూడా తెలియదా అని వెటకారంగా అడుగుతుంది

హి హి అంటే బవీ సెలెక్ట్ అయ్యాక తెలుసుకోవచ్చు లే ముందే ఎందుకు తెలుసుకోవడం అని అంత డీప్ గా వెళ్ళలేదు మార్నింగ్ కూడా అఫీస్ వైపు కూడా చూడకుండా ఇంటర్వ్యూ కి టైమ్ అవుతోంది ఆని హడావిడిగా వెళ్ళిపోయాం గా అందుకే అంతగా పట్టించుకోలేదు ఇప్పుడు నువ్వు చెప్తే గుర్తు పెట్టుకుంటా

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue