ఆయుష్ మీటింగ్ వెంటనే క్యాన్సల్ చేసి మ్యానేజర్ తో ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేయమని చెప్తాడు ఇంకో రెండు గంటల్లో ఫ్లయిట్ ఉండడం తో తన మ్యానేజర్ వెంటనే టికెట్స్ బుక్ చేసి అదే విషయాన్ని ఆయుష్ కి చెప్తాడు ఆయుష్ మ్యానేజర్ ను తీసుకుని హోటల్ రూమ్ వెకేట్ చేసి ఎయిర్ పోర్ట్ కి స్టార్ట్ అవుతూ ఇంత జరిగినా తనకు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వని మున్నా మీద కోపం పెరిగిపోతూ ఉంటే వెంటనే మున్నా కి కాల్ చేస్తాడు
మున్నా ఫాదర్ కి హార్ట్ ఎటాక్ రావడం తో ఇమ్మీడియెట్ గా హాస్పటల్ కి తీసుకు వెళ్లడం వల్ల ఈ టైమ్ లో తల్లిని ఒక్కటే వదిలి వెళ్ళలేక ఆషి, దియా సెక్యూరిటీ గురించి మిగిలిన గార్డ్స్ కి కేర్ఫుల్ గా ఉండమని చెప్పి మున్నా హాస్పటల్ లో నే ఉండడం తో మహల్ లో జరిగిన విషయాలు ఏవీ మున్నా దాక రాలేదు