ఆయుష్ గారు దియా రిపోర్ట్స్ వచ్చాయి అంటూ తన ముందు కూర్చున్న ముగ్గురి వైపు చూస్తూ తన టేబుల్ మీదున్న దియా రిపోర్ట్స్ చూస్తూ చెప్తున్న డాక్టర్ వైపు ముగ్గురు టెన్షన్ గా చూస్తారు డాక్టర్ నోటి నుండీ ఎటువంటి న్యూస్ వినాల్సి వస్తుందో అని ఆయుష్ నే ముందుగా మాట్లాడుతూ చెప్పండి డాక్టర్ రిపోర్ట్స్ ఆన్ని నార్మల్ గానే ఉన్నాయ లేక తనకి ఇంకా ఏమైనా అంటున్న ఆయుష్ వైపు చిరు నవ్వుతో చూస్తూ నథింగ్ టు వర్రీ ఆయుష్ గారు షి ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ & మీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పాలి
దియా కి ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు అని డాక్టర్ చెప్పడం విని ముగ్గురు ఊపిరి పీల్చుకుని ఒకరి మొహాలు ఒకరు అనందంగా చూసుకుని తిరిగి డాక్టర్ వైపు చూస్తూ గుడ్ న్యూస్ ఆ ఎన్టీ డాక్టర్ అది అంటూ డాక్టర్ వైపు చూస్తారు