తన ముందున్న ప్లేట్ లో క్రిస్పీ క్రిస్పీ గా ఉన్న దోశ ను చూసి వాహ్ యమ్మీ అంటూ ఆ దోశ ను చట్నీ లో డిప్ చేసి నోట్లో పెట్టుకోబోతున్న ప్రణవి దగ్గరకు మేడమ్ మీకో గుడ్ న్యూస్ దియా పాప ప్రాణాలకు ప్రమాదం లేదంట ఇప్పుడే డ్రైవర్ కాల్ చేసి చెప్పాడు అంటూ సంతోషంగా చెప్తున్న లక్ష్మి మాటలకు షాక్ అయ్యి చేతిలోని దోశ ను ప్లేట్ లో పడేసి షాక్ అయ్యి పైకి లేచి నిల్చుని ఎమ్ మాట్లాడుతున్నావ్ నువ్వు అంటూ లక్ష్మి వైపు నమ్మలేనట్టు గా చూస్తూ అడుగుతుంది
అవును మేడమ్ ఇప్పుడే డ్రైవర్ కాల్ చేశాడు దియా పాప ఇప్పుడే స్రృహ లోకి కూడా వచ్చి అందరితో మాట్లాడింది అట డాక్టర్స్ కూడా ప్రాబ్లెమ్ లేదు అని చెప్పారట అంటూ ఆనందంగా చెప్తున్న లక్ష్మి వైపు కోపంగా చూస్తు ఫాస్ట్ గా ప్లేట్ లోనే హ్యాండ్ వాష్ చేసుకుని తన మొబైల్, బ్యాగ్ తీసుకుని కార్ లో తనే డ్రైవ్ చేస్తూ హాస్పటల్ కి స్టార్ట్ అవుతుంది