New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అందాల రాక్షసి{1} – 40

అందాల రాక్షసి{1} – 40

ఆషి ను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్న ఆయుష్ ఆషి తల పట్టుకుని నిల్చోని  పడిపోతూ ఉండడం చూసి ఫాస్ట్ గా ఆషి ను చేరుకుని ఆషి… ఆషి ఓపెన్ యువర్ అయిస్ అంటూ ఆషి బుగ్గలు తడుతూ ఉంటే ఆషి కష్టంగా కళ్లు తెరచి ఆయుష్ వైపు చూస్తూ ఐ యాం సారి ఆయుష్ గారు అంటూ స్రృహ తప్పడం తో అందరు కంగారుగా ఆషి చుట్టూ చేరి ఆషి… అమ్మా ఆషి …..కళ్లు తెరువు అంటున్నా ఆషి కళ్లు తెరవక పోవడం తో ఆయుష్ వెంటనే ఆషి ను లిఫ్ట్ చేసి బయటకు వెళతాడు

నాన !!! మామ్ కి ఏమైందీ అని ఏడుస్తూ ఆషి అలా పడిపోవడం వల్ల భయపడుతూ నిషాన్ ను చుట్టుకుని ఏడుస్తూ అడుగుతుంది

ఏమ్ కాలేదు దియా కామ్డౌన్ చూడు మామ్ నువ్వు కళ్లు తెరవలేదని చాలా ఏడ్చింది ఎమ్ తినలేదు అందుకే శక్తి లేక పడిపోయింది అంతే చూడు కాసేపట్లో నవ్వూతూ తిరిగొస్తుంది

మామ్ కి నా వల్లే అబ్బు తగిలింది పాపం మామ్ మామ్… మామ్ అంటూ బెడ్ ను చేతులతో గట్టిగా తన శక్తికి మించి కొడుతూ వుండడం తో దియా చేతికి ఉన్న సెలైన్ నీడిల్ ఊడి బ్లడ్ రావడం తో దియా ఆ నొప్పికి ఏడవడం తో నిషాన్ ఎంత బుజ్జగిస్తున్నా దియా ఏడుపు అపకపోయేసరికి తప్పక తనకు సేడెటివ్ ఇచ్చి సిస్టర్ తో చూసుకోమని చెప్పి ఆషి దగ్గరకు అడుగులు వేస్తాడు

ఆషి ను దియా రూమ్ పక్కనే ఉన్న రూమ్ లో బెడ్ మీద పడుకోబెట్టి మోహి కాల్ ది డాక్టర్ అంటూ మోహిత్ ను డాక్టర్ దగ్గరకు పంపి ఆషి వైపు చూస్తాడు తెల్లటి చీర మీద పసుపు నీళ్లు పోయడం వల్ల పసుపు రంగు లో మారిన తెల్లని చీర నుదుటన, పాపిట్లో కుంకుమ, చెక్కిల్లకు గంధం ,చేతికి మట్టి గాజులు ,నుదుటిన అయిన గాయం అంగ ప్రదక్షణ చేయడం వల్ల చేతులకు గాజులు గుచ్చుకుని అక్కడక్కడ గీరుకుపోయి కనిపిస్తుంది

ఆషి మోకాళ్ల దగ్గర బ్లడ్ స్టైన్స్ కనిపించడం తో అందరినీ రాగిణి తో సహా బయటకి పంపి చీర ను మోకాళ్ల పైకీ లాగి చూడగా అక్కడ గుడి మెట్లు ఎక్కడం వల్ల రెండు మోకాళ్ల దగ్గర బ్లడ్ బొట్లు బొట్లు గా రావడం చూసి ఆయుష్ దవడ బిగుసుకుంటుంది ఈ లోపు మోహిత్ డాక్టర్ ను తీసుకు రావడం చూసి చీర ను ఎదావిదిగా సర్ది డాక్టర్ వైపు చూస్తాడు

వాట్ హ్యాపెండ్ ఆయుష్ గారు మీ మిసెస్ కి ఏమైంది అంటూ ఆషి పల్స్ చెక్ చేస్తూ ఆయుష్ వైపు చూస్తాడు

డోంట్ నోహ్ డాక్టర్ సడెన్ గా అన్ కాన్షియస్ అయి పడిపోయింది తలకు కూడా దెబ్బ తగిలింది కాస్త చూడండి అంటూ ఆయుష్ చెప్పడం తో ఒకే రిలాక్స్ ఆయుష్ గారు అంటూ స్టెత్ తో ఆషి హార్ట్బీట్ చెక్ చేయబోతున్న డాక్టర్ చేతిని పట్టుకుని ఆపి డోంట్ టచ్ హర్ షి ఈజ్ మైన్ తనను టచ్ చేయకుండా ట్రీట్ చెయ్ అంటూ యాటిట్యూడ్ గా చెప్తున్న ఆయుష్ వైపు డాక్టర్ బ్లాంక్ ఫేస్ తో చూస్తాడు

చెప్పేది మీకే ఆషి ను టచ్ చేయకుండా ట్రీట్ మెంట్ చేయండి తను నాది మాత్రమే

ఆయుష్ గారు టచ్ చేయకుండా ట్రీట్మెంట్ ఎలా చేస్తాను నాకు ప్రాబ్లెమ్ ఎంటో తెలియాలి కదా తను మీ వైఫ్ నే కావచ్చు బట్ మేము డాక్టర్స్ అండి తాకకుండా ప్రాబ్లెమ్ ఎంటో చెప్పడానికి మాకు దివ్య దృష్టి లేదు అంటూ అసహనంగా చెప్తాడు

అయితే లేడీ డాక్టర్ ను పంపండి అంతే కానీ మీరు నా వైఫ్ ను తాకితే ఊరుకోను తను నాది నేను మాత్రమే టచ్ చేయాలి

డాక్టర్ ఆయుష్ వైపు వియర్డ్ గా చూస్తూ సిస్టర్ అంటూ పిలిచి సిస్టర్ రాగానే డాక్టర్ ప్రియ ను నేను పిలుస్తున్నా అని చెప్పి వెంటనే ఇక్కడకి తీసుకురా అని చెప్పడం తో ఓకే డాక్టర్ అంటూ సిస్టర్ ఫాస్ట్ గా వెళ్ళి డాక్టర్ ప్రియ ను తీసుకుని వస్తుంది

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue