ఆయుష్ దియా రూమ్ నుండి బయటకు వస్తూ మున్నా కి కాల్ చేస్తాడు మొదటి రింగ్ కే మున్నా కాల్ లిఫ్ట్ చేసి హలో సర్ గుడ్ మార్నింగ్ అంటూ పొలైట్ గా విష్ చేస్తాడు మార్నింగ్ మున్నా వాళ్ళు ఏమైనా స్పృహ లోకి వచ్చారా ఎదైనా చెప్పారా అంటూ మోహిత్ తన గెస్ట్ హౌస్ లో ఉంచిన రౌడీ ల గురించి అడుగుతాడు
ఇంకా లేదు సర్ మోహిత్ సర్ చాలా గట్టిగా కొట్టారు అందుకే ఇంకా కాన్శియస్ లోకి రావడం లేదు ఇందాకే డాక్టర్ వచ్చి చూసి వెళ్లారు ఇంకో హాఫ్ అన్ అవర్ లో పూర్తి స్పృహ లోకి వస్తారు అని చెప్పారు సో వాళ్ళు స్రృహ లోకి వస్తె మన స్టైల్ లో కోటింగ్ ఇస్తే వాళ్ళే చెపుతారు మీరు వర్రీ అవ్వకండి గంట లో మీకు ఇలా ఎవరు చేయమని చెప్పారో కనుక్కుని చెప్తాను