దియా ఏడుస్తూ మోహిత్ వైపు చూసి నేను చచ్చిపోతానా మామ అంటూ బేలగా అడగడం చూసి మోహిత్ దియా అంటూ బాధగా తనను గుండెలకు హత్తుకుని లేదమ్మా నువ్వు ఎందుకు చచ్చిపోతావ్ రా నువ్వు మా అందరి ప్రాణం నీకేం కాదు దియా నీకున్నది చిన్న ప్రాబ్లెమ్ అంతే అయినా నీకేం అయినా కావాలీ అంటే అది మీ డాడ్ ను దాటి రావాలి వాడు ఉండగా నీకేం అవుతుంది చెప్పు నీకేం కాదు ఇంకెప్పుడు అలాంటి వర్డ్స్ యూస్ చేయకు అది చాలా తప్పు అంటూ దియా కన్నీళ్ళు తుడుస్తూ అనునయనంగా చెప్తాడు
నాకు డాడ్ మమ్మా లతో హ్యాపీగా ఉండాలి అని ఉంది మామ మమ్మా తో నాకు కొన్ని కూడా హ్యపీ మూమెంట్స్ లేవు ఎప్పుడూ మమ్మా ను ఫొటోస్ లో చూడ్డమే కానీ డైరక్ట్ గా ఎప్పుడూ చూడలేదు ఎందుకు మామ నేను పుట్టగానే మమ్మా నన్ను వదిలి వెళ్ళిపోయింది నేనంటే మమ్మా కి ఇష్టమే కదా మరెందుకు వెళ్ళింది నన్ను ఎందుకు తీసుకు వెళ్ళలేదు మమ్మా లేకుండా నేను ఇన్ని ఇయర్స్ పెరిగాను ఇక ఇక్కడే ఉంటామా మామ మేము లండన్ కి రామా