నీ జతే నే కోరుకున్న – 5
వాళ్ళ మాటలు విన్న సత్యం… అక్కడ ఉన్న ఉరి జనం… అందరూ కూడా షాక్ లో ఉండిపోయారు.
ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటా అని… అందరూ బాధగా.. సత్యం వైపు చూస్తున్నారు.
సీత కళ్ళ నిండా నీళ్లతో…. అలానే నిలబడి…. చూస్తూ ఉంది….
నేను ముందే చెప్పను…. దీనికి ఇలాంటి పెళ్లి అచ్చు రాదు అని…. ఎవడో కుంటూడినో ముగోడినో ఇచ్చి పెళ్లి అయిపోయి దానికి…. ఇలా పెద్ద సంబంధాలు తెచ్చి…. మన కుటుంబ పరువును తీశారు…. అంత దీని దరిద్రం….. ఇది పుట్టినప్పటి నుంచీజ్ ఇప్పటి దాకా…. దరిద్రం అన్నది చుట్టుకొని… పక్కన వాళ్లకు కూడా ఆ దరిద్రం అంటుకుంటుంది…. ఇంకా నా బిడ్డ కు (మీనా )పెళ్లి ఎలా జరిగేది…. ఈ దరిద్రపు గొడ్డు ది నా ఇంట్లో ఉండగా….మేము బాగుపడము….. ఇంకా నేను నా కూతురు అంత ఉరి వేసుకొని చావలసిందే అని రాజ్యం ఒక దొంగ ఏడుపు ఏడుస్తా్…. ఉరి జనం లో సీత గురించి… చేడు గా చెప్తుంది రాజ్యం (సీత సవతి తల్లి ).
ఆ మాటలు విన్న సీత కి గుండె బరువు ఎక్కింది….. తన కళ్ళలో నుంచి నీరు కారిపోతూనే ఉన్నాయ్…. ఎం అనలేక… అలానే ఉండిపోయింది సీత.
రాజారామ్ గారు…ఫ్యామిలీ అంత కూడా…. చూస్తున్నారు తప్పించి వాళ్ళు ఎం చేయగలరు.
సత్యం.. కి అసలు ఏ మాటలు కూడా వినిపించడం లేదు… తన కూతురి పెళ్లి…. ఇలా మండపం లో ఆగిపోయే సరికి… ఈ తండ్రి గుండె బరువు ఎక్కింది…. ఇంకా తన కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని బాధగా అలానే శూన్యం లో కి చూస్తూ అలానే నడుస్తూ… ఇంట్లో కి వెళ్లి…. డోర్ వేసుకొని… గాడి వేసుకున్నాడు సత్యం.
డోర్ వేసిన సౌండ్ విని…. సీత వెనక్కు తిరిగి చూడగా…..సత్యం డోర్ వేసుకోవడం కనిపించి… నాన్న… అని గట్టిగా అరుస్తూ…. పరుగున డోర్ దగ్గరకు వెళ్లి… నాన్న నాన్న అని గట్టిగ అరుస్తుంది సీత.
అందరూ కూడా కంగారుగా… పరుగున వెళ్లి… సత్యం.. సత్యం అని డోర్ ని కడుతున్నారు కానీ… సత్యం డోర్ తీయడం లేదు…
నాన్న డోర్ తీయి నాన్న… ప్లీజ్ అని సీత మీనా ఏడుస్తూ ఉన్నారు.
రాజారామ్ గారు వెంటనే…. కన్నా… డోర్ ని పగలగొట్టు నాన్న…. సత్యం ఎం అయినా చేసుకున్నాడో ఏంటో అని కంగారుగా అంటుంటే…. ఓకే తాతయ్య… ఎం కంగారు పడకండి అని…. పరుగున…. ఇంటి దగ్గర వెళ్లి అక్కడ వాళ్ళను తప్పించి…. డోర్ ని ఒకే ఒక్క తన్నుడు లో డోర్ ని పగలగొట్టాడు రామ్.
లోపలకు వెళ్లి చూడగా…. అక్కడ సత్యం…. ఫ్యాన్ కి తాడు వేసుకొని…. తన మెడకు వేసుకుంటూ ఉన్నాడు…. రామ్ వెంటనే అల్లర్ట్ ఐ… ఫాస్ట్ గా సత్యం ని కిందకు లాగాడు.
అంకుల్.. అంకుల్…. అర్ యూ ఓకే… ఒక సరి కళ్ళు తెరవండి అని రామ్ కంగారుగా సత్యం ని తడుతూ లేపుతున్నాడు.
సీత ఉరి జనం పరిగెత్తుకు వచ్చి…. సత్యం లేపడానికి చూస్తున్నారు.
వాటర్ తెచ్చి… మొకం మీద చెల్లి…. వాటర్ తాగించక… కొంచెం కుదుట పద్దాక…. ఏంటి నాన్న… నువ్వు… ఎం చేస్తున్నావు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నాన్న. అని సత్యం గుండెల మీద వెక్కి వెక్కి ఏడుస్తుంది సీత.
లేదు తల్లి…. ఈ తండ్రి…. నీ పెళ్లి ని చేయలేక పోయాడు…. ఈ తండ్రి ఉంటే ఎంత లేకుంటే ఎంత అని.. సీత ని పట్టుకొని…. ఆ తండ్రి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
వాళ్ళ ని చూసి.. అక్కడ జనం అంత బాధ తో నిండిపోయింది.
రాజారామ్ గారు…. మహాలక్ష్మి గారు లోపలకు వచ్చి…. ఏంటి సత్యం ఈ పిచ్చి పని…. ఎందుకు ఇలా చేస్తున్నావు…. ఈ ఆడపిల్లలని వంటరిగా వదిలేసి వెళ్తావా… ఎందుకు ఇలా చేసావు అని రాజారామ్ గారు కోపంగా సత్యం మీద అరుస్తాడు రాజారామ్.
ఎం చేయమని అంటావు అయ్యా…. నా కూతురి పెళ్లి ఇలా మధ్యలో నే ఆగిపోయింది…. ఇప్పుడు నా కూతురి పెళ్లి ఎలా చేయాలి అయ్యా…. నా కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారు…. ఇంకా ఈ బాధ ని తట్టుకునే కంటే…. చావడమే మేలు కదాఅయ్యా అని గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు సత్యం.
ఆ మాటకు…. రాజారామ్ కి బాధ గా అనిపించుంది…. సత్యమ్ ని ఆలా చూడలేక…. ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిగా….. నీతో కొంచెం మాట్లాడాలి సత్యం…. ఒంటరిగా అనగానే…. అక్కడ ఉరి జనం కి అర్ధం ఐ… అందరు బయటకు వెళ్ళిపోతారు.
సీత మీనాకూడా బయటకు వెళ్లిపోయారు… రాజ్యం…కూడా…. బయటకు వెళ్తుంటే…. మీరు ఆగండి…. మీరు ఇక్కడే ఉండండి అని అనగానే… వాళ్ళు ఆగిపోతారు.
ఇప్పుడు అక్కడ కేవలం…. రాజారామ్ గారు మహాలక్ష్మి సుప్రజ….. ఆ రూమ్ లో నే కొంచెం పక్కకు రామ్ నిలబడి ఉన్నాడు…. సత్యమ్ ఫ్యామిలీ…..
రాజారామ్ గారు సత్యం చేతిని పట్టుకొని….. మీరు ఎం బాధ పడకండి….. ఈ మండపం లో నే… ఇప్పుడే… మీరు అనుకున్న టైం కె…. మీ కూతురి పెళ్లి జరిపించేలా చేస్తా….. అని నేను మాట ఇస్తున్నాను అని రాజారామ్ గారు… సత్యం చేతిలో చేతిని వేసి అంటాడు.
సత్యం… ఎంతో ఆశగా…. నా కూతురి పెళ్లి ని జరిపిస్తారా అని అడుగుతాడు కళ్ళ నిండా నీళ్లతో.
(ఎందుకంటే తన కూతురికి పెళ్లి కాదేమో అని భయం తో…. రాజారామ్ గారు చెప్పిన మాట ని వింటున్నాడు సత్యం.)
జరిపిస్తాను…. మరి పెళ్లి కొడుకు ఎవరో కాదు…. నా మనవడు… శ్రీ రామ చంద్ర అని రాజారామ్ గారు చెప్తాడు.
అంతే ఆ మాట విన్న అందరికి షాక్ కొట్టినట్టు అయింది….
ఏవండీ… ఎం అంటున్నారు…. అసలు మన మనవడు ఏంటి అని కంగారుగా అంటుంది మహాలక్ష్మి గారు.
అవును మహా… నేను అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్న…. మీకు ఇష్టమా లేదా అది చెప్పండి అని అంటాడు రాజారామ్ గారు సీరియస్ గా.
మహాలక్ష్మి గారు… సుప్రజ గారు…బయట ఉన్న సీత వైపు చూసి….అమ్మాయి కి ఏంటి… అమ్మాయి ముద్దుగుమ్మా ల గా ఉంది…. మహాలక్ష్మి ల ఉంది…. నేను ఎందుకు వదులుకుంటాను….. మాకు అయితే… ఇష్టమే… అని వారి అభిప్రాయాన్ని చెప్పరు మహాలక్ష్మి గారు సుప్రజ గారు…. కానీ రామ్ ఎం అంటాడో అని రామ్ వైపు చూడగా…
అప్పటికే….. కోపం ఒక రేంజ్ లో ఉండి… కళ్ళు ఎర్రటి చరికలు వచ్చి… పిడికిలి గట్టిగ బిగించి రాజారామ్ వైపు కోపంగా చూస్తున్నాడు రామ్.
ఆ క్షణం…. రామ్ ని చుసిన ప్రతి ఒక్కరికి వణుకు వచ్చింది రాజారామ్ గారి తో సహా.
సత్యం…. మీరు ఒక సరి బయటకు వెళ్లి పెళ్లి పనులు చుడండి….. అలాగే… అమ్మాయి కి ఈ పెళ్లి ఇష్టమో కాదో అడగండి అని రాజారామ్ గారు అనగానే…..
తను నా కూతురు అయ్యా…. నా మాట అస్సలు కాదు అనదు…. నేను వెళ్లి పెళ్లి పనులు చూస్తాను అని ఆనందంగా బయటకు వెళ్లిప్పయదు సత్యం.
రాజ్యం కి అయితే కడుపులో మంట గా ఉంది…. ఒక సంబంధం పోయింది అనుకుంటే… ఇప్పుడు ఇంత పెద్ద డబ్బు ఉన్న సంబంధం దొరికింది అని….. కళ్ళలో నిప్పులు పోసుకొని మండిపోతుంది రాజ్యం. ఈ పెళ్లి ని ఎలానో ఎలాగా జరగకుండా చూడాలి అని తనలో తానే క్రూరమైన ప్లాన్స్ వేసుకుంటూ ఉంది రాజ్యం.
బయటకు నవ్వుతు వస్తున్న…. సత్యం ని చూసి… పరుగున సత్యం దగ్గరకు వెళ్లి…. గట్టిగ చుట్టేసుకొని వెక్కి ఏడుస్తుంది సీత.
తల్లి ఏడవకు తల్లి…. ఎం కాలేదు… నీకు రాజలాంటి సంబంధం చూసాను….. ఇప్పుడు నీ పెళ్లి ఆగిపోలేదు తల్లి…. అని ఎంతో ఆనందంగా చెప్తూ….
నా కూతురి పెళ్లి ఆగలేదు…. అందరూ ఇక్కడ ఉండి నా కూతురి పెళ్లి ని చుడండి…. ఎవ్వరు ఎక్కడకు వెళ్ళకండి అని ఉరి జనం వైపు చూసి ఎంతో ఆనందంగా చెప్తూ….. పద తల్లి నీతో మాట్లాడాలి అని…. ఇంటికి వెనుక వైపుకు తీసుకు వెళ్ళాడు సత్యం తన కూతుర్లని.
తల్లి నీకు మంచి సంబంధం చూసాను… ఈ పెళ్లి చేసుకుంటావా అని ఎంతో ఆశగా అడుగుతాడు సీత ని.
తండ్రి కళ్ళలో ఆనందాన్ని చూసి…. నేను ఎప్పుడు కూడా నీ మాట ని కాదు అనను నాన్న…. మీ ఇష్టమే నా ఇష్టం… అని అంటుంది సీత… తన తండ్రి సంతోషంగా ఉండటం చూసి.
నా బంగారు తల్లి… అని తన నుదిటి మీద ముద్దును పెట్టుకొని…. పెళ్లి పనులు చూడటానికి వెళ్ళిపోయాడు సత్యం.
ఏంటి అక్క…. నీకు ఈ పెళ్లి నిజంగా నే ఇష్టమా…. అసలు పెళ్లి కొడుకు ఎవరో కూడా తెలీదు కదా….. నువ్వు అసలు చూడలేదు… అతని గురించి కొంచెం కూడా తెలీదు కదా అని అడుగుతుంది మీనా.
నాన్న కి నచ్చడు గా అది చాలు అని… వెనుక నుంచి వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోయాడు సీత మీనా.
అది కాదు కన్నా…. ఓకే సరి నా మాట విను నాన్న అని రాజారామ్ గారు…. రామ్ ని బతిమలుతున్నాడు…. కానీ అప్పటికే…. తన చేతిలో ఉన్న ఫోన్ నెల మట్టం అయింది…. ముక్కలు ముక్కలుగా పగిలిపోయి ఉంది…. రామ్ కోపానికి.
అది కాదు కన్నా…. నేను మాట ఇచ్చాను…. నీకు ముందే చెప్పను కదా…సహాయం చేసే అవకాశం వస్తే నేను వదులుకోను అని…. అది ఈ విషయం లో నాకు దొరికింది….. ప్లీజ్ కన్నా నా మాట విని ఈ పెళ్లి చేసుకో నాన్న.. అని బతిమలుతున్నాడు రాజారామ్.
మహాలక్ష్మి గారు… సుప్రజ గారు బాబు గారి కోపానికి జాడిసి పక్కకు నిలబడి…. వీళ్ళను చూస్తూ ఉన్నారు.
ప్లీజ్ ఫాలో మీ గయ్స్ 🥰
Swipe left/right or tap the sides to turn pages