నీ జతే నే కోరుకున్న – 4
రాజారామ్ గారు చెప్పిన స్టోరీ అంత విన్నాక…. హ్మ్మ్… ఇంట్రెస్టింగ్ అని అంటూ… ఆ వర్షం లో నే… కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు రామ్.
ఆలా అరగంట పాటు సాగిన ప్రయాణం తరువాత…. మెల్లిగా వర్షం అన్నది తగ్గి…. సూర్యుడు బయటకు వస్తున్నాడు.
గాడ్…. ఇప్పుడైనా వర్షం తగ్గింది అని అనుకుంటూ….. తాతయ్య ఇంకా ఎంత టైం పడుతుంది అని విసుగుగా అంటుంటే…. వచ్చింది కన్నా…. ఎదురుగా…. పెళ్లి పందిరి వేశారు చూడు అదే…. అని చెప్పగానే….. కార్ ని కొంచెం దూరంగా ఆపేసి…. కార్ దిగారు నలుగురు.
ఆ ఊరికి మాములు కార్ వస్తేనే వింతగా చూసే జనం లో…. ఇప్పుడు ఇంత పెద్ద పడవ లాంటి కార్ రావడం తో… అందరూ షాకింగ్ గా చూస్తున్నారు.
కార్ లో నుంచి…. రాజారామ్ గారు…మహాలక్ష్మి గారు సుప్రజ గారు దిగి ముందుకు వెళ్తారీ.
రామ్ కి ఇంపార్టెంట్ కాల్ రావడం తో…. కార్ లో నే కూర్చొని…. మాట్లాడుతూ ఉన్నాడు.
కన్నా… తొందరగా రా వెళదాం అని మహాలక్ష్మి గారు అనడం తో… హ గ్రాని వస్తున్న అని… ఫోన్ మాట్లాడుతూ కార్ లో నుంచి దిగుతాడు రామ్.
అక్కడ చూస్తున్న ఉరి జనాలు అంత కూడా కళ్ళు ఇంత పెదవి చేసుకొని చూస్తున్నారు బాబు గారిని చూసి….
అక్కడ అమ్మయిలు అయితే…. సొల్లు కరుస్తూ… బాబు గారి అందానికి ఫిదా అయిపోతున్నారు…. అబ్బా ఎంత అందంగా ఉన్నాడు…. అసలు అతను మనిషేనా… లేక … ఆకాశం నుంచి దిగి వచ్చాడా…. అసలు ఆ height ఏంటి…. ఆ కలర్ ఏంటి…. అసలు ఆ బాడీ ఏంటి… ఎవరైనా అతనికి ఎదురు వస్తే ఒక్క గుద్దు తో కింద పడేస్తాడేమో…… రాజకుమారుడిలా ఎంత అందంగా ఉన్నదో అని ఆ ఊరిలో అమ్మాయిలు గుసగుసలు గా అనుకుంటున్నారు…. బాబు గారి అందాన్ని చూసి…
ఎవరు చేసుకుంటారో కానీ… ఆ అమ్మాయికి అయితే బాబు గారి అందాన్ని… ఆ బాడీ ని చూసి బతికేయొచ్చు అని అని అక్కడ అమ్మాయిలు అనుకుంటూ ఉన్నారు.
రామ్ ఫోన్ మాట్లాడి తన గ్రాని చేతిని గట్టిగ పట్టుకొని జాగ్రత్తగా నడిపిస్తు… చుట్టూ చూస్తున్నాడు రామ్.
అది ఒక చిన్న పెంకుటిల్లు…. ఆ పెంకుటింట్లో 3 రూమ్స్ ఉండొచ్చు…. ఆ ఇంటికి బయటే… పెళ్లి పందిరి వేశారు…. చుట్టూ కూడా టెంట్ వేసి…. మామిడి ఆకులతో డెకొరేట్ చేసారు… చాలా సింపుల్ గా…. అక్కడ ఉరి జనాలతో…. బంధువులతో ఉంది.
సత్యం గారు పెళ్లి కి వచ్చే బంధువులను పలకరించే పని లో బిజీ గా ఉన్నారు… అప్పుడే రాజారామ్ గారు రావడం చూసి…. పరుగు లాంటి నడకతో…. అతని ముందుకి వెళ్లి…. నమస్తే అయ్యా… బాగున్నారా అని చిన్న నవ్వుతో ఎదురచి అంటాడు సత్యం.
హ… సత్యం బాగున్నాము…. మీరు బాగున్నారా…. అని పిలకరించిన తరువాత…. మీరు వస్తారు అని అస్సలు అనుకోలేదు అయ్యా…. వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అని తన పేస్ లో నే ఆ ఆనందము తెలుస్తుంటే..వెనుక ఉన్న వాళ్ళని రాజారామ్ గారు పరిచయం చేస్తుంటే…. సత్యం వాళ్ళని చిరు నవ్వుతో పలకరించి…..చిన్న చిరు నవ్వు ఇచ్చి పదండి అని లోపలకు నడిచారు.
రేయ్…. అయ్యగారికి…. చైర్స్ తీసుకు రండి..అని అక్కడ వాళ్లకు పురామైస్తాడు సత్యం…… వాళ్లకు చైర్స్ వేయించి…. అతిధి మర్యాదలు చేస్తున్నాడు సత్యం.
అయ్యా…. ఎం అయినా కావాలి అంటే… నన్ను పిలవండి అయ్యా…. నేను మళ్ళీ వస్తాను అని…. సంతోషంగా చెప్పి… పెళ్లి పనులు చూసుకోవడం లో బిజీ అయిపోయాడు సత్యం.
రామ్ ని అయితే అక్కడ ఉన్న ఉరి జనం…. రామ్ దగ్గరకు వచ్చి…. చూడటానికి రాజకుమాడిలా ఉన్నావు…. నీకు ఏ అమ్మాయి వస్తుందో కానీ… తను చాలా అదృష్టవంతురాలు అని కంప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నారు…… ఇంకా అమ్మాయిలు అంత కూడా కోరుకుతినెలా చూస్తుంటే…. ఎవ్వరిని పట్టించుకోకుండా ఫోన్ లో మెయిల్స్ చూస్తూ బిజీ గా ఉన్నాడు రామ్.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
అక్క…. చూడు మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది…. నీకు వర్షం అంటే ఇష్టం కదా…. చూడు అని డల్ గా కూర్చున్న thana అక్క కి చెప్తుంది మీనా.
వర్షం అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి…. కిటికీ లో నుంచి బయటకు చూడగా…. వర్షం ఎం లేదు…. నిరాశగా…. ఏంటి మీనా…. నువ్వు…. అబ్బదం చెప్పావు ఎందుకు… అని అలిగినట్టు పేస్ పెట్టి అంటుంది సీత.
అయ్యో… మా అక్క కి అలక వచ్చిందే…. ఎం కాదులే… కొంచెం సేపట్లో మా బావ వస్తాడు… వచ్చాక మా అక్క అలక తీరుస్తాడు లే అని కొంటేగా అంటుంది మీనా.
ఆ మాటకు…. సీత చిరు కోపంగా…. మీనా చెవిని పట్టుకొని… ఏంటి ఎం అన్నావు… మళ్ళీ అను అని చెవిని మేలేస్తుంటే….
ఆ అక్క… సోరి సోరి వదిలేయ్… ప్లీజ్… అని ముద్దుగా బతిమలుతుంది మీనా.
నీకు అల్లరి బాగా ఎక్కువ అయింది…. నీ పని తరువాతః చెప్తా…. అని చిరు కోపంగా సీత అంటే…
ఎప్పుడు బావ వచ్చాక చెప్తావా అని అంటూ వెక్కిరిస్తుంది మీనా.
నిన్ను అని సీత లేవగానే…. పరుగున బయటకు పరిగెత్తింది మీనా.
పెళ్లిమడపం లో… పెళ్ళికొడుకుతో…. పంతులు పూజ చేపిస్తు బిజీ గా ఉన్నారు….
అమ్మ… పెళ్లి కూతురిని తీసుకు రండి అని పంతులు పిలగానే….
తల్లి అక్క ని తీసుకో రా అని మీనా కి చెప్తాడు సత్యం.
అలాగే నాన్న అని లోపలకు పరుగులు తీస్తుంది మీనా.
అక్క… పంతులు గారు పిలుస్తున్నారు… పద… అని… ఒక సరి తన అక్క ని మొత్తం చెక్ చేసి…. అంత పర్ఫెక్ట్ అని రెడీ అయినా తన అక్క ని చూసి…. తల మీద మెలి ముసుగు వేసి… బయటకు తీసుకొస్తుంది మీనా.
మీన నాకు భయంగా ఉంది…. నువ్వు నా పక్కనే ఉండు… ఎక్కడకు వేళ్ళకు…. ప్లీజ్ అని వణుకుతున్న గొంతుతో అంటుంది సీత.
నేను ఎక్కడకు వెళ్ళాను అక్క… నీతో నే… నీ పక్కనే ఉంటాను… బయపడకు…. ప్రతి చిన్న దానికి ఇలా భయపడితే ఎలా చెప్పు…. నార్మల్ గా ఉండు…. ఎం కాదు లే…. అని చేతిలో కొబ్బరి బొండం పెట్టి…. పద అక్క అని బయటకు తీసుకు వస్తుంది మీనా.
ఏదో భయం తో… కంగారు గానే…. మీనా వెంట అడుగులు వేస్తూ…. పెళ్లి మండపం మీద కు వచ్చి పిటల మీద కూర్చుంటుంది సీత.
తన పక్కనే మీనా కూర్చొని… సీత చేతిని గట్టిగ పట్టుకొని… బయపడకు అని తనకి ధైర్యం చెప్తుంది.
మెలి ముసుగులో ఉన్న పెళ్లి కూతురిని చూసి…. అమాయకమైన అమ్మాయి…. ఎంత ముద్దుగా మహాలక్ష్మి ల… కల గల్లా మొకం…. తన పిన్ని వాళ్ళ కష్ఠాలు పడింది కానీ…. లేకుంటే… రాణి ల గా పెంచేవాడు మన సత్యం… అని ఉరి జనాలు వాళ్ళల్లో వాళ్ల అనుకుంటూ ఉన్నారు.
ఆ మాటలు అన్ని కూడా రామ్ కి వినపడి… చిన్నగా తల ఎత్తి… మండపం లో ఉన్న పెళ్లి కూతురిని చూస్తాడు రామ్…. రెడ్ కలర్ నెట్ మెలి ముసుగు… నిండుగా వేయడం తో.. తన పేస్ కనిపించదు… ఆలా కిందకు చూడగా…. తెల్లగా మెరుస్తున్న చేతులకు…. ఎర్ర ని గోరింటాకు అరచేతులకు ఉండి… ఎంతో ముద్దుగా కనిపిస్తుంటే….
వావ్…. బ్యూటిఫుల్ అని ఆ గోరిటాకు ఉన్న అరచేతులను చూసి…చేతి కి నిండుగా ఉన్న మట్టి గాజులను చూసి….తనలో తానే అనుకుంటాడు రామ్.
మళ్ళీ తెరుకొని… ఏంటి నేను… అని తననే తిట్టుకుంటూ మళ్ళీ ఫోన్ లో పడిపోయాడు రామ్.
సత్యం…. తన కూతురి పెళ్లి ని తన చేతుల్లో చేస్తున్నాడు అని ఎంతో ఆనందం తో కన్నీళ్లు కరుస్తూ ఉన్నాడు…
అయ్యా…. అమ్మాయి మెడ లో తాళి కట్టు నాయన అని పంతులు గారు అనగానే…..పెళ్లి కొడుకు లేచి…. తాళి పట్టుకొని పెళ్లి కూతురి మేడలో తాళి కట్టే టైం కి… ఆగండి ని ఒక అమ్మాయి వాయిస్ వినిపించి…. అందరూ వెనక్కు తిరిగి చూసారు…. పెళ్లి కొడుకుతో సహా.
తాళి కడతారు అన్న టైం కి మీనా… సీత కి ఉన్న మెలి ముసుగు తీసేసింది.
ఆ అమ్మాయి వాయిస్ కి అందరూ వెనక్కు తిరిగి చుసిన అందరికి షాక్ కొట్టింది… ఎందుకంటే… అక్కడ ఉంది…. ఒక 9 నెలల నిండు గర్భిణీ…. పోలీస్ ల తో…. పెళ్లి మండపం బయట నిలబడి ఉంది.
ఆమె ని చూడగానే….. పెళ్లి కొడుకు… తను పట్టుకున్న తాళి ని కింద పడేసి….. షాకింగ్ గా నిలబడి చూస్తున్నాడు.
సార్… వాడే…. వాడే సార్….. నన్ను పెళ్లి చేసుకొని… కడుపు చేసి….. ఇప్పుడు ఇంకో అమ్మాయి జీవితం నాశనము చేయడానికి పెళ్లి అని నాటకము ఆడుతున్నాడు అని ఆ అమ్మాయి చెప్పగానే…. పోలీస్ లు పెళ్లి కొడుకు ఉన్న దగ్గరకు వస్తుండగా…. ఆ పెళ్లి కొడుకు… కంగారుగా అక్కడ నుంచి తప్పించుకుందాం అని…. పెళ్లి మండపం దిగి…. బయటకు పరుగులు పెడుతుంటే…. పోలీస్ లు వెంటనే వాడిని పట్టుకొని… హ్యాండకేఫ్ వేస్తారు.
సీత… కింద పడ్డ తాళి ని చూస్తా్…. భయంగా తన నాన్న వైపు చూడగానే….. సత్యం…. కళ్ళలో నీళ్లు.
సత్యం కంగారుగా… పోలీస్ ల దగ్గరకు వెళ్లి…. అయ్యా…. ఎందుకు… నా అల్లుడిని తీసుకు వెళ్తున్నారు…. వదిలేయండి అయ్యా అని కంగారుగా వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ అంటాడు సత్యం… ఎక్కడ తన కూతురి పెళ్లి ఆగిపోతుందో అన్న భయం లో.
చుడండి సార్….. ఇతను కి ఆల్రెడీ పెళ్లి అయింది…. అదిగో అక్కడ నిలబడి ఉందిగా….9 నెలల ప్రెగ్నెన్సీ అమ్మాయి… ఆ అమ్మాయి తో నే పెళ్లి ఐ ది….
ఇప్పుడు మీరు ఇచ్చే కట్నం కోసం…. ఆ అమ్మాయి ని ఒంటరిగా వదిలేసి…. ఇదిగో…. మీ దగ్గర ఇలా మీ అమ్మాయి ని పెళ్లి చేసుకోవడానికి రెడీ ఐయ్యడు… ఇతని పేరెంట్స్ కూడా ఇందులో భాగమే… అని…. చెప్పి…. పెళ్లి కొడుకుని.. అతని పేరెంట్స్ ని తీసుకొని… అక్కడ నుంచి పోలీస్ జీప్ లో వెళ్లిపోయారు వాళ్ళు.
ప్లీజ్ ఫాలో మీ గయ్స్ 🥰
Swipe left/right or tap the sides to turn pages