New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అందాల రాక్షసి{1} – 46

అందాల రాక్షసి{1} – 46

మోహిత్ ఆయుష్ చెప్పిన బ్రేస్లేట్ గురించే ఆలోచిస్తూ వుంటాడు అలాంటి బ్రేస్లేట్ ఇందాక నేను చూసాను కానీ ఎక్కడ?? చాలా క్లోజ్ గా చూశాను అంటూ బ్రుకుటి ముడి వేసి ఆలోచిస్తున్న మోహిత్ కు ఇందాక తను ప్రణవి తో మాట్లాడ్డం గుర్తొస్తుంది యస్ ప్రణవి లెఫ్ట్ హ్యాండ్ కి సేమ్ మోడల్ బ్రేస్లెట్ ఉంది అనుకుంటూ బావ నువ్వు చెప్పిన బ్రేస్లేట్ ప్రణవి హ్యాండ్ కి ఇందాక నేను చుసాను అంటే ఈ పని చేసింది అదే అంటూ కోపంగా చెప్పగానే ఆయుష్ కళ్లు కోపంతో ఎర్ర పడతాయి

కోపంగా పైకి లేచి ప్రణవి కోసం వెళ్తున్న ఆయుష్ కి అడ్డుగా నిల్చుని అన్నయ్య ప్లీస్ ఆగు ఎక్కడికీ అంత కోపంగా వెళ్తున్నావ్ అంటూ ఎర్రగా మారిన ఆయుష్ మొహాన్ని చూస్తూ కంగారుగా అడుగుతాడు

అడ్డు తప్పుకో నిష్ ఇవాళ ప్రణవి కి ఆయుష్ అంటే ఎంటో చూపిస్తాను తన వల్లే నా కూతురు ఒక రోజంతా నరకం చూసింది తనకు అంతకు మించిన నరకాన్ని చూపించక పోతే నా పేరు ఆయుష్ వర్మ నే కాదు
అన్నయ్య ఆగు అంటూ ఆయుష్ చేతిని పట్టుకుని నిజ నిజాలు తెలియకుండా ప్లీస్ తొందర పడకు ప్రణవి ఏమైనా పరాయి అమ్మాయ తను స్వయానా మావయ్యా కూతురు ప్రణవి గురించి నా కంటే నీకే ఎక్కవగా తెలుసు ఎందుకంటే తను నీతో పాటు లండన్ లోనే నీ ఇంట్లో ఉండేది నీతో పాటు పెరిగింది అన్నిటికీ మించి నిన్ను ప్రాణంగా ప్రేమించింది

నిష్ అంటూ ఆయుష్ అరిచిన అరుపు ఆ కారిడార్ మొత్తం ప్రతిధ్విస్తుంది

నీకు కోపం వచ్చినా నిజం అయితే అదే కదా అన్నయ్య తను నిన్ను చాలా ప్రేమించింది ఇప్పటికీ ప్రేమిస్తుంది నీకు వదిన దూరం అయ్యాక నీకు భార్యగా కావాలని దియా తో అమ్మా అని పిలిపించుకోవాలని చాలా ట్రై చేసింది కానీ నువ్వు తనకు ఆ అవకాశం ఇవ్వలేదని డాడ్ ద్వారా మీ మ్యారేజ్ ప్రపోజల్ నీకు చెప్పేలా చేస్తే నువ్వు స రోజు నుండి డాడ్ తో సరిగ్గా మాట్లాడ్డం మానేశావ్ కానీ తను నిన్ను మర్చిపోలేక ఇప్పటికీ చాలా బాధ పడుతుంది

నిన్ను అంతలా ప్రేమించే ప్రణవి దియా ను అలాంటి స్థితిలో చూసి ఎందుకు డోర్ లాక్ చేస్తుంది ఒక్క సారి ఆలోచించు అన్నయ్య తన చేతికి బ్రేస్లేట్ ఉన్నంత మాత్రానా తనే చేసినట్టు కాదు కదా

అలాంటి బ్రేస్లెట్ మహల్ లో ఎవరికీ లేదు కాబట్టి తనే ఈ పని చేసింది తన చేతికి ఆ బ్రేస్లేట్ ఉండాలి ఈ రోజూ నా చేతుల్లో చావడం ఖాయం అంటూ ఆవేశంగా ప్రణవి వైపు వెళ్తున్న ఆయుష్ ను ఆపడానికి నిషాన్ వెనుకే పరుగు లాంటి నడకతో వెళ్తే ఆరాం గా వెనుకే ఫాలో అవుతాడు మోహిత్

రాగిణీ పక్కన కూర్చుని దియా, ఆషి ల హెల్త్ గురించి అడుగుతూ బాధ పడుతున్నట్లు యాక్ట్ చేస్తున్న ప్రణవి కి డోర్ దభేల్ మని ఓపెన్ చేసుకుని రూమ్ లోకి వస్తున్న ఆయుష్ ను తన మోహం లోని కోపాన్ని చూసి పైకి లేచి నిల్చుంటుంది

కొడుకు మోహం ఎందుకంత ఎర్రబడిందో అర్తం అవ్వక ఆయుష్ ఏమైంది ఎందుకలా వున్నావ్ అంటూ ఆయుష్ వైపు చూస్తుంది

దియా ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉంటే హెల్ప్ చేయాల్సింది పోయి తన మాటలు ఎవరికీ వినిపించకుండా ఎందుకు తన రూమ్ డోర్ లాక్ చేశావ్ అంటూ ఆవేశంగా ప్రణవి గొంతు పట్టుకుని నొక్కుతూ గోడకు ఆనించి ఆవేశంగా అరుస్తాడు

ప్రణవి ఊపిరి ఆడక దగ్గుతూ బా…వ ప్లీస్ వ…దు…లు అని ఒక్కో అక్షరాన్ని కూడబలుక్కుని పలుకుతూ ఊపిరి ఆడక దగ్గుతూ కళ్లు పైకి తేలేయడం చూసి ఆయుష్ ఎమ్ చేస్తున్నావ్ వదులు దాన్ని అంటూ రాగిణి ఎంత చెప్తున్నా తన పట్టు కొంచెం కూడా విడవకుండా మాట్లాడు ఎందుకలా చేసావ్ దియా చనిపోవాలి అనే కదా అంటూ కోపంగా చూస్తు అరవగానే ప్రణవి ఆయుష్ కోపానికి నిలువెల్లా వనికిపోతూ నా…కేం తె…లి
..య…దు బా…వ ప్లీ…స్ వ….దు…లు అంటూ ఏడుస్తూ ప్రాధేయ పడుతుంది

అన్నయ్య ప్రణవి చచ్చిపోయెలా ఉంది వదులు అంటూ ఒక వైపు నిషాన్ మరో వైపు బావ అది చచ్చేలా ఉంది రా వదులు అంటూ మోహిత్ చేరో వైపు పట్టుకుని లాగడం తో ఆయుష్ అసహనంగా ప్రణవి ను పక్కకు తోయడం తో ప్రణవి వెళ్ళి మూలాన పడి గొంతు పట్టుకుని గట్టిగా దగ్గుతూ ఊపిరి పీల్చుకుంటూ కాసేపూ నరకం అనుభవిస్తుంది

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue