New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
బీస్ట్ తో పెళ్లి – 2

బీస్ట్ తో పెళ్లి – 2

వచ్చిన బంధువులందరూ శేఖర్ మాధవి లను పెద్ద కూతురుని బాగానే పెంచి పెళ్లి చేశావుగా చిన్న కూతురు దగ్గరికి వచ్చేసరికి మీ పెంపకం ఏమయ్యింది శేఖర్ అయినా ఆ పిల్ల ఎప్పుడు దుడుకుదిలే వైదేహి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వీరేంద్ర గారి కొడుకునే పడేసిందంటే మామూలుది కాదు అని తల ఒక మాట అంటుంటే కూడా ఏమీ మాట్లాడకుండా ఆకృతిని మాట్లాడించే ఛాన్స్ ఇవ్వక తన బుల్లెట్ బైక్లో ట్యాంక్ మీద ఆమెను కూర్చోబెట్టుకొని రయుమని వెళ్లిపోయాడు నిర్వాన్.

 

ఏం జరిగిందో తెలిసేలోపు హాల్ మొత్తం ఆకృతి గురించి నానా మాటలు అని ఖాళీ చేసేసరికి శేఖర్ గుండె పట్టుకొని అక్కడే పడిపోయాడు.

 

మాధవి స్వప్న నాన్న కోసం ఏడుస్తుంటే పెద్దల్లుడు మామ గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు మైల్డ్ స్ట్రోక్ అని చెప్పి రెండు రోజులు హాస్పిటల్లోనే ఉండమని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్స్.

 

తాళి మేల్లో పడగానే బొమ్మ అయిన ఆకృతి నిర్వాన్ ఫ్లాట్లోకి లాక్కొచ్చి విసురుగా పడేసేంతవరకు ఈ లోకంలోకి రాలేకపోయింది.

 

చుట్టూ చూసిన ఆమెకి నాలుగు గోడలు ఎదురుగా నిర్వాన్ తప్ప తన వాళ్ళు ఎవరు కనిపించకపోయేసరికి భయపడుతూ అంతలోనే తనేమి అంతా పిరికిది కాదు అని గుర్తు తెచ్చుకున్న ఆకృతి నిర్వాన్ దగ్గరకు వెళ్లి చెంప పగలగొట్టింది.

 

నీకు ఏం హక్కు అధికారం ఉందని అందరి ముందు మా పరువు తీయడానికి నా మెల్లో తాళికట్టావ్ మిస్టర్ నిర్వాన్?

అని నిలదీసేసరికి పెదవులు సైడ్ కి సాగదీసిన నిర్వాన్ ఆమె బుగ్గలు పట్టి ఒత్తుతూ నువ్వు నాకు సొంతం కాకుండా ఇంకెవడినో పెళ్లి చేసుకుంటే చూస్తూ ఉంటాను అనుకున్నావా అని చెప్పి ముందుకొచ్చిన ఆమె పెదవులను ఇష్టం లేకుండానే జుర్రేశాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue