New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ

20 stories Ongoing Adventure Suspense Crime

చిమ్మచీకటి... ఆ పల్లెటూరి రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గుడిసె పైకప్పు మీద వర్షం కురుస్తోంది.గుడిసె మూలన ఉన్న చిన్న దీపం వెలుతురులో, ఏడేళ్ల కూతురు అక్షర, ఐదేళ్ల కొడుకు వివేక్ ఆకలితో ఏడుస్తూ అమ్మ ఒళ్ళో తలదాచుకున్నారు. భర్త రాఘవ చనిపోయి అప్పుడే ఆరు నెలలు దాటింది. అప్పటివరకు ఇల్లే ప్రపంచంగా బతికిన తులసికి, ఇప్పుడు రేపటి బతుకు ఎలా అనే ప్రశ్న మిగిలింది.పక్కింటి రంగమ్మ వచ్చి, "ఏమే తులసి, రేపటి నుండి మా పొలంలో కూలిపనికి వస్తావా? రోజుకు వంద రూపాయలు ఇస్తారు. పిల్లల్ని సాకాలిగా మరి.కన్నీళ్లు తుడుచుకుని తులసి తల ఊపింది. అవును, తను ఒంటరిది కాదు... ఇద్దరు పిల్లల తల్లి. వాళ్ల భవిష్యత్తు తన చేతుల్లోనే ఉంది.మరుసటి రోజు…

Browse Stories

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 11

తులసి ఒక్క అడుగు ముందుకు వేసి  గంభీరమైన స్వరంతో, “వీరభద్రం! ఈ భూమి రాజేంద్రది కాదు, ప్రభుత్వానిది. ప్రజలది. ఈ రోజు ఇక్కడ అక్షరానికి పునాది పడి తీరుతుంది. దాన్ని అడ్డుకునే మొగాడు ఈ జిల్లాలో ఎవడూ లేడు” అని సింహంలా గర్జించింది. వెంటనే తులసి తన స్మార్ట్‌ఫోన్ తీసి లౌడ్‌స్పీకర్‌ ఆన్ చేసి జిల్లా ఎస్పీకి డయల్ చేసింది. “ఎస్పీ గారు! రాజేంద్ర రౌడీలు స్కూల్ శంకుస్థాపనను అడ్డుకుంటున్నారు. నా ఫోన్ లైవ్ లొకేషన్ ట్రాక్ […]

4 min 17 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 12

కలెక్టర్ తులసి పంపిన పక్కా ఆధారాల రిపోర్ట్ వల్ల హోమ్ మినిస్టర్ భార్గవ్ రామ్ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అధికార గర్వంతో ఉన్న అతనికి ఒక  మహిళ, అది కూడా ఒక కలెక్టర్ తన పదవిని ఊడగొట్టడం అస్సలు జీర్ణం కాలేదు. పదవి పోయినా తనకున్న అంగబలం, అర్థబలం తో తులసి పై పగ తీర్చుకోవడానికి భార్గవ్ రామ్ కుట్రలు పన్నడం మొదలుపెట్టాడు. మొదటగా, తులసిని మానసికంగా దెబ్బతీయడానికి ఆమె పై అవినీతి ఆరోపణలు చేస్తూ […]

3 min 13 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 13

తులసి బయట ప్రపంచంలో ఎంత పెద్ద తుఫానునై నా ఎదుర్కొని నిలబడే కలెక్టర్ తులసికి, ఇంటికి రాగానే తన పిల్లల నవ్వులే ఉపశమనం. రఘు చనిపోయిన తర్వాత తులసి సివిల్స్ చదవడానికి తులసిని ప్రోత్సహించి తనకి అన్ని విషయాలలో తోడు ఉంటూ తాను కలెక్టర్ అయిన దగ్గర నుండి  నేటివరకు ఆమెకు, ఆమె పిల్లలకు నీడలా నిలిచింది ఆనందరావు మాస్టారు. తులసి కి గురువైన ఆనందరావు మాస్టారు, ఇప్పుడు తులసి పిల్లలై న పదకొండేళ్ల అక్షర, తొమ్మిదేళ్ల […]

4 min 6 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 14

తులసి రఘు రాసిన పాత డైరీ తులసి చేతికి దొరికిందనే నిజం జైల్లో ఉన్న రాజేంద్ర, భార్గవ్ రామ్‌లకు తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. కలెక్టర్ తులసి తీసుకున్న కఠిన చర్యల వల్ల రాజేంద్ర ఇప్పటికే హై-సెక్యూరిటీ సెంట్రల్ జైల్లో పక్కా బందోబస్తు మధ్య కటకటాలు లెక్కబెడుతున్నాడు.    మరోవైపు, పదవి కోల్పోయిన మాజీ హోమ్ మినిస్టర్ భార్గవ్ రామ్ కూడా తన అక్రమాల కేసులో రిమాండ్ ఖైదీగా అదే జైలుకు చేరుకున్నాడు. చట్టం ముందు మోకరిల్లి […]

3 min 12 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 15

మరుసటి రోజు ఉదయం విలాసవంతమైన కోర్టు హాల్ నిశ్శబ్దంగా ఉంది. బోనులో నిలబడి ఉన్న రాజేంద్ర, మాజీ పొలిటికల్ మినిస్టర్ భార్గవ్ రామ్ ముఖాల్లో అప్పటివరకు ఉన్న అహంకారం కాస్తా సడలింది. వారి తరపున రాష్ట్రంలోనే పేరుమోసిన క్రిమినల్ లాయర్ వాదిస్తున్నాడు. “యువర్ ఆనర్! ప్రాసిక్యూషన్ మోపిన ఆరోపణలన్నీ అభూత కల్పనలు అని రఘు మైనింగ్ క్వారీలో గుండెపోటుతో (Heart Attack) చనిపోయాడని పోస్ట్‌మార్టం రిపోర్ట్ స్పష్టంగా చెబుతోంది.    ఒకవేళ అది హత్యే అయితే, దానికి  […]

3 min 8 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 16

కోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ తులసి పేరు మారుమోగిపోయింది. ఒక శక్తివంతమైన మంత్రిని, మైనింగ్ మాఫియా డాన్‌ను బోనులోకి లాగి, జైలుకు పంపిన సింహస్వప్నంలా ఆమెను మీడియా కొనియాడింది. కానీ, ఆ విజయం తెచ్చిన సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అధికారం కోల్పోయినంత మాత్రాన భార్గవ్ రామ్ వెనుక ఉన్న రాజకీయ శక్తులు బలహీనపడలేదు. గాయపడిన సింహంలా జైలు గోడల మధ్య కూర్చుని కూడా భార్గవ్ రామ్ తన పగను రగిల్చుకుంటూనే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం. […]

4 min 9 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 17

అక్షర, వివేక్ ‌లకు చింత పల్లె అడవి ప్రాంతం మొదట ఒక కొత్త లోకం లా అనిపించింది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన చెట్లు, సాయంత్రం ఆరు దాటితే కటిక చీకటి. కరెంట్ సరిగ్గా ఉండదు, జంతువుల అరుపులు రాత్రి పూట భయం కలిగించేవి.భార్గవ్ రామ్, రాజేంద్ర లు తులసిని ఇక్కడికి పంపితే భయపడి ఆఫీస్ వదిలి పారిపోతుందని, లేదా రాజీనామా చేస్తుందని ఆశపడ్డారు. కానీ, తుఫానుకు ఎదురు వెళ్లడమే నేర్చుకున్న తులసికి ఈ కొత్త సవాలు […]

3 min 8 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 18

చింతపల్లె అడవుల్లో కటారి సామ్రాజ్యాన్ని కలెక్టర్ తులసి ఒక్కొక్కటిగా కూకటివేళ్లతో సహా పెకలించి వేస్తుంటే, జైల్లో ఉన్న భార్గవ్ రామ్, రాజేంద్రల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తమ చివరి ఆర్థిక వనరు కూడా మూతపడితే తాము జైలు నుండి ఎప్పటికీ బయటకు రాలేమని వారికి అర్థమైంది. అందుకే, తులసిని లొంగదీసుకోవడానికి ఆమె బలహీనత అయిన పిల్లలు అక్షర, వివేక్‌లను అడ్డుపెట్టుకోవాలని కటారికి జైలు నుండే ఖచ్చితమైన ఆదేశాలు అందాయి. అడవిలో ఒక పక్కా వ్యూహం ప్రకారం, పిల్లలిద్దరూ […]

3 min 5 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 19

చింతపల్లె అడవిలో స్మగ్లర్ కటారి అరెస్టుతో భార్గవ్ రామ్, రాజేంద్రల ఆఖరి వ్యూహం కూడా ముక్కలైపోయింది. తులసి పిల్లలను కిడ్నాప్ చేయించిన కేసులో దొరికిన పక్కా ఆధారాలతో  బినామీ కంపెనీల రహస్యాలు, విదేశీ బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఇప్పుడు తులసి చేతిలో ఉన్నాయి. ఈ ఆధారాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  మరియు సిబిఐ అధికారుల సహాయంతో పక్కా చార్జ్‌షీట్‌ను తులసి సిద్ధం చేసింది. రఘును క్వారీలో దారుణంగా చంపించిన కేసుతో పాటు, ఒక […]

3 min 3 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 20

రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం భార్గవ్ రామ్, రాజేంద్రలకు ఉరిశిక్ష విధించిన తర్వాత తులసి జీవితంలో ఒక పెద్ద భారం దిగిపోయినట్లయింది.  ఆ విజయం ఆమెను విశ్రాంతి తీసుకోనివ్వలేదు. తనను కక్షసాధింపుగా బదిలీ చేసిన చింతపల్లె ఫారెస్ట్ ఏరియానే ఇప్పుడు ఆమెకు కర్మభూమిగా మారింది. చింతపల్లెలోని అమాయక గిరిజన ప్రజల కళ్లల్లో మార్పు కోసం తులసి తన పరిపాలనా దక్షతను పూర్తిగా ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఆమెతో పాటు ఆనందరావు మాస్టారు, పిల్లలు అక్షర, వివేక్ కూడా ఆ అడవి […]

3 min 1 view