ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 22
“మాస్టారు గారూ, సిద్ధార్థ్ చాలా తెలివిగా అడుగులు వేస్తున్నాడు. ఢిల్లీ స్థాయిలోని పెద్దల రికమండేషన్లతో వాడు చింతపల్లె అడవుల్లో మైనింగ్ లీజును రీ-ఓపెన్ చేయించాలని చూస్తున్నాడు. దానికి తోడు మన అక్షర, వివేక్ చదువుకునే స్కూల్ బోర్డుపై కూడా వాడు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం ఉంది” అంది తులసి రాత్రి భోజనం ముగిశాక ఆనందరావు మాస్టారితో ఆందోళనగా చెప్తూ. ఆనందరావు మాస్టారు నిశ్చలంగా నవ్వి, “తులసీ, సిద్ధార్థ్ లండన్ చదువులు చదివి ఉండవచ్చు. కానీ […]