New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఆమె మనసులో.. సీత కథ

20 stories Ongoing Love Family Drama

ఆ రాత్రి, విజయవాడలోని వారి చిన్న ఇంటి బెడ్‌ రూమ్‌ లో, చంద్రకాంతి వెన్నెల వెండి కిరణాలు జాలువారుతూ కిటికీ గుండా చొచ్చుకుపోతున్నాయి. గదిలోని గాలి మందంగా, మధురమైన గులాబీల సువాసనతో నిండిపోయింది.సీత.. పేరుకు తగ్గట్టు సౌమ్యత, సహనం, ప్రేమ అన్నీ.. ఆ సీతమ్మ తల్లిలోని అన్ని లక్షణాలను పుణికి పుచ్చుకుంది. ఆమెకు 30 ఏళ్ల వయసు, కానీ ఇంకా 18 ఏళ్ల అమ్మాయిలా కాంతివంతంగా, మృదువుగా కనిపిస్తుంది. ఆమె పక్కనే రవి.. తన భర్త. అతని వయసు 35 ఏళ్లు. బలమైన శరీరం, కళ్లలో సౌమ్యత, సహనం, ప్రేమ అన్నిటికంటే ఆమె పట్ల అపారమైన ప్రేమ, ఆప్యాయత.రవి పక్కనే పడుకుని ఉంది సీత. రవి ఆమెను మెల్లగా తన ఒడిలోకి లాక్కున్నాడు.…

Browse Stories

ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 4

అపరాధ భావంతో ఉన్న సీత, చావు దరి చేరేసరికి.. ముందుగా తన భర్తనే గుర్తు వచ్చేసరికి తన నిర్ణయం వెనక్కి తీసుకుంది.. ఇంతలో తన అంతరాత్మ తన కళ్ళకు కనిపించి అడుగుతున్న ప్రశ్నలకు మైనంగా ఉండిపోయింది సీత..   ***   సీత ను చిత్కారంగా చూస్తూ.. “చి.. సీత అన్న పేరుకే తీరని మచ్చవి నువ్వు! నీలో ఉన్నాను అని తలుచుకుంటేనే ఒళ్లంతా కంపరంగా ఉంది నాకు..   ఇంతా చేసి పైగా తిరిగి వాదిస్తున్నావ్, […]

3 min 34 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 5

చావు చివరి వరకు వచ్చి తన నిర్ణయం మార్చుకున్న సీత తిరిగి భర్త దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్న సమయంలో.. తన అంతరాత్మ వచ్చి మాట్లాడేసరికి తిరిగి అయోమయంలో పడింది..   ***   “ఇప్పుడు నువ్వు చేస్తుంది అదే కదా! అంతే అతనిలానే ప్రేమ, ఆప్యాయతలు మరిచిపోయి.. సారీ నీకు ఉంటే కదా మరిచిపోవడానికి ఇంతకాలం ఉన్నట్టు నటిస్తూ ఇప్పుడు అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నావు.   నువ్వు రుజువు చేసావు, అందరూ అన్న మాట […]

3 min 19 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 6

అంతరాత్మ అడిగిన ప్రశ్నలకు, అన్న మాటలకు సీత బాధ పడుతూ.. తన తండ్రి, నాన్నమ్మ గురించి ఆలోచిస్తూ.. తన బాల్యపు రోజుల్లోకి తన ఆలోచనలు వెళ్ళిపోయాయి..   ***   లక్ష్మీ వాళ్ళ నాన్న ఆ నర్స్ ను చూసి ఇప్పుడు ఏమి చెపుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉండగా.. ఆ నర్స్ అతడి దగ్గరికి వచ్చి.. ( అప్పటిలో గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లకుండా ఇంటి దగ్గరే పురుడులు పోసే వాళ్ళు.. వీళ్ళు చేయలేకపోతే […]

3 min 18 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 7

లక్ష్మీ పురిటి నొప్పులతో బాధ పడుతుంటే.. ఆమెకు కొంచెం సీరియస్ గా ఉందని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి ఆమెను కంగారుగా తీసుకుని వెళ్ళారు. వాళ్ళు అక్కడికి చేరుకున్న కాసేపటికి ఆ పెద్దాయన సంతానం అంతా కూడా ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకున్నారు.   ***   అక్కడికి చేరుకున్న రాము వాళ్ళ అమ్మ ను చూసి అందరి కంటే లక్ష్మీ వాళ్ళ అమ్మ నే ఎక్కువగా కంగారు పడిపోతుంది. అది ఎందుకు అని తెలియాలి అంటే రాము […]

3 min 19 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 8

లక్ష్మీ ను హాస్పిటల్ కి తీసుకు వెళ్లిన కొద్ది సమయంలోనే రాము వాళ్ళ అమ్మ సడన్ గా అక్కడికి ఊడి పడేసరికి అందరూ ఆమెనే భయంతో చూసారు. ఎప్పుడూ పూజలు, పునస్కారాలు తప్ప వేరే ఏ బంధాలు మీద ఆశక్తి చూపని ఆవిడ ఇప్పుడు ఏమి చేస్తుందో అని టెన్షన్ అందరికీ..   ***   రాము వాళ్ళ అమ్మ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రశాంతంగా కుర్చీలో కూర్చుని ఉంది. వీళ్ళు అందరూ అనుకున్నట్టే ఆవిడకు ఏ […]

3 min 21 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 9

లక్ష్మీ వాళ్ళ నాన్న అక్కడే ఉన్న రాము వాళ్ళ అమ్మ ను, ఆమె నిర్లక్ష్యపు ధోరణికి అక్కడ చూస్తూ ఉండలేక తల్లి బిడ్డకి ఎలా ఉందో కబురు చెప్పమని చెప్పి అక్కడి నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు చాలా సమయం గడిచిన తర్వాత ఆ నర్స్ ఆ పాపను తీసుకుని బయటికి వచ్చింది..   ***   ఆ నర్స్ కి చేతులెత్తి దండం పెడుతూ, కంటతడి పెట్టుకుంటున్న లక్ష్మీ అమ్మను చూసి ఆ నర్స్..   […]

3 min 10 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 10

రాము వాళ్ళ అమ్మ హాస్పిటల్ కి చేరుకునేసరికి, లక్ష్మీ వాళ్ళ నాన్న ఇంక అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతాడు. ఒక పక్క రాము వాళ్ళ అమ్మ గురించి భయ పడుతూనే.. మరో వైపు లక్ష్మీ గురించి కంగారు పడుతున్నారు వీళ్ళు. ఇంతలో పాపను తీసుకుని నర్స్ రావడంతో అందరి మొఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. కానీ రాము వాళ్ళ అమ్మ మాటలకి అక్కడి అందరికీ పట్టరాని కోపం వచ్చేస్తుంది..   ***   లక్ష్మీ వాళ్ళ అమ్మ అన్న […]

3 min 12 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 11

అప్పుడే పుట్టిన పసికందును చూసి రాము వాళ్ళ అమ్మ అంటున్న మాటలు అప్పుడే అక్కడికి వస్తున్న లక్ష్మీ వాళ్ళ నాన్న చెవిన పడ్డాయి.. ఆ పెద్దాయన అప్పటి వరకు ఆపుకున్న కోపమును ఇంక ఒక్క నిమిషం కాదు కదా ఒక్క సెకండ్ కూడా ఆ మాటలను, ఆ మనిషిని చూస్తూ ఉండలేకపోయాడు. అందుకే లక్ష్మీ తల్లి దండ్రులు ఇద్దరూ ఆవిడను గట్టిగానే నిలదీశారు..   ***   రాము వాళ్ళ అమ్మ అడిగిన ప్రశ్నకు లక్ష్మీ తల్లి […]

3 min 10 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 12

లక్ష్మీ తల్లి దండ్రులు ఎదురు తిరిగి మాట్లాడేసరికి.. రాము వాళ్ళ అమ్మ శాపనార్ధాలు, శోఖాండలు పెడుతూ.. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంక వీళ్ళు అంతా సంతోషంతో ఊపిరి తీసుకున్నారు. ఆ బుడ్డాగాడి ఊసులతో అందరూ రాము వాళ్ళ అమ్మ మాటలను పట్టించుకునే స్థితిలో లేరు..   ***   మన బుడ్డాగాడు అందరితో సంతోషంగా ఉండటమే కాకుండా.. ఎవరు ఏది తినమని ఇచ్చినా కూడా తీసుకుని.. “మా చెల్లికి ఏది?” అని అడిగేవాడు.   “ఓరి బడవా! […]

3 min 15 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 13

కొన్ని రోజులకు లక్ష్మి ని, పాప ను తీసుకొని ఇంటికి చేరుకున్నారు లక్ష్మీ కుటుంబం అంతా.. ఇంటికి చేరుకున్న తర్వాత ఒక వైపు పసిపాప ఆలనా పాలనలో రోజులు గడుస్తుంటే.. మరొకవైపు ఆ పసిపాప అన్న బుడ్డ గాడి ఊసులతో ఇల్లంతా సందడిగా మారింది. ఇంతలో అనుకోకుండా లక్ష్మికి సీరియస్ అవడంతో అనుకోకుండా ఆమెకు ఆపరేషన్ చెయ్యాల్సి వచ్చింది..   ***   ఆపరేషన్ అయిన తర్వాత కూడా లక్ష్మీ చాలా నీరసంగా ఉంది. అందుకే ఇంక […]

3 min 10 views