కొన్ని రోజులకు లక్ష్మి ని, పాప ను తీసుకొని ఇంటికి చేరుకున్నారు లక్ష్మీ కుటుంబం అంతా.. ఇంటికి చేరుకున్న తర్వాత ఒక వైపు పసిపాప ఆలనా పాలనలో రోజులు గడుస్తుంటే.. మరొకవైపు ఆ పసిపాప అన్న బుడ్డ గాడి ఊసులతో ఇల్లంతా సందడిగా మారింది. ఇంతలో అనుకోకుండా లక్ష్మికి సీరియస్ అవడంతో అనుకోకుండా ఆమెకు ఆపరేషన్ చెయ్యాల్సి వచ్చింది..
***
ఆపరేషన్ అయిన తర్వాత కూడా లక్ష్మీ చాలా నీరసంగా ఉంది. అందుకే ఇంక ఆ రోజు నుంచి ఆ పసి దాన్ని లక్ష్మీ కి దూరంగా ఉంచారు. ఆ బుడ్డాగాడు కొంచెం ఎదిగాడు కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు.
ఆ పాపకి మూడు నెలలు దాటిపోయాయి…
ఇంకా ఆ పసికందుకు పేరు పెట్టే అవకాశం కూడా రాలేదు.
చివరికి లక్ష్మీ కొంచెం కోలుకుని వాళ్ల ఇంటికి వెళ్లిన తర్వాతే.. ఆ పాపకి పేరు పెట్టే పని మొదలైంది.
లక్ష్మీ తల్లిదండ్రులే ఆ బాధ్యత తీసుకున్నారు.
అప్పటి వరకు నిశ్శబ్దంగా సాగిన ఆ పాప చిన్న జీవితం…