చావు చివరి వరకు వచ్చి తన నిర్ణయం మార్చుకున్న సీత తిరిగి భర్త దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్న సమయంలో.. తన అంతరాత్మ వచ్చి మాట్లాడేసరికి తిరిగి అయోమయంలో పడింది..
***
“ఇప్పుడు నువ్వు చేస్తుంది అదే కదా! అంతే అతనిలానే ప్రేమ, ఆప్యాయతలు మరిచిపోయి.. సారీ నీకు ఉంటే కదా మరిచిపోవడానికి ఇంతకాలం ఉన్నట్టు నటిస్తూ ఇప్పుడు అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నావు.
నువ్వు రుజువు చేసావు, అందరూ అన్న మాట నిజం. నీ రక్తం నీదే.. మీ బుద్ధి మీదే.. నేను ఎంత దాన్ని మార్చాలని చూసినా నన్ను తొక్కేసి, నీ పంతం లెగ్గించుకుందాం అనుకున్నావ్ అదే చేశావు. వెళ్ళు ఇలా సిగ్గు లేకుండా బతికే బదులు ఎటైనా పోయి చచ్చిపో.. చావు.. చావు.. చావు..” అని గట్టిగా అరుస్తూ ఆ అంతరాత్మ మాయం అయిపోయింది.
తను వెళ్ళిపోయినా “చచ్చిపో..” అనే మాట మాత్రం చెవి దగ్గర జోరీగలా పదే పదే వినిపిస్తూనే ఉంది.
‘చి.. నా బ్రతుకు చివరికి నా అంతరాత్మ కూడా నన్ను అర్థం చేసుకోవటం లేదు. ఇంకెవరో అర్థం చేసుకోలేదు అని ఎందుకు బాధ పడాలి నేను..’ అని అనుకుంది సీత.