లక్ష్మీ ను హాస్పిటల్ కి తీసుకు వెళ్లిన కొద్ది సమయంలోనే రాము వాళ్ళ అమ్మ సడన్ గా అక్కడికి ఊడి పడేసరికి అందరూ ఆమెనే భయంతో చూసారు. ఎప్పుడూ పూజలు, పునస్కారాలు తప్ప వేరే ఏ బంధాలు మీద ఆశక్తి చూపని ఆవిడ ఇప్పుడు ఏమి చేస్తుందో అని టెన్షన్ అందరికీ..
***
రాము వాళ్ళ అమ్మ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రశాంతంగా కుర్చీలో కూర్చుని ఉంది. వీళ్ళు అందరూ అనుకున్నట్టే ఆవిడకు ఏ బంధాలు మీద, మనుషుల మీద ప్రేమాభిమానాలు కొంచెం కూడా లేవు..
ఇంతలో మరో వైపు వేరే పని మీద బయటికి వెళ్ళిన ఆ పెద్దాయన పెళ్ళికాని కొడుకు, కూతురు విషయం తెలుసుకుని నేరుగా హాస్పిటల్ కే వచ్చేశారు.
“రేయ్! బాబు! వచ్చారా.. అక్కను గదిలోకి తీసుకుని వెళ్ళి చాలా సమయం అయింది రా.. ఎంత సమయం గడిచినా ఒక్కరు కూడా బయటికి రావడం లేదు నాకేదో కంగారుగా ఉందిరా.. అదేంటో కనుక్కో కొంచెం నువ్వైనా..“ అని ఆ తల్లి తన కొడుకుతో చెప్పింది.
“ఏటి ఓ లమ్మా! ఇప్పుడు ఏమైపోనాది ఎందుకంత కంగారు పడిపోతున్నావు? ఆయుషు ఉంటే వతారు లేదంటే లేదు.. దానికి ఏలా అంత హైరానా నీకు..” అని రాము వాళ్ళ అమ్మ తూర్పు భాష లో ఒక్కో పదం సాగదీస్తూ అంది.