అపరాధ భావంతో ఉన్న సీత, చావు దరి చేరేసరికి.. ముందుగా తన భర్తనే గుర్తు వచ్చేసరికి తన నిర్ణయం వెనక్కి తీసుకుంది.. ఇంతలో తన అంతరాత్మ తన కళ్ళకు కనిపించి అడుగుతున్న ప్రశ్నలకు మైనంగా ఉండిపోయింది సీత..
***
సీత ను చిత్కారంగా చూస్తూ.. “చి.. సీత అన్న పేరుకే తీరని మచ్చవి నువ్వు! నీలో ఉన్నాను అని తలుచుకుంటేనే ఒళ్లంతా కంపరంగా ఉంది నాకు..
ఇంతా చేసి పైగా తిరిగి వాదిస్తున్నావ్, నోరు లేస్తుంది. అవునులే ఎందుకు నోరు లెగదు, నీ గురించి తెలిసి మళ్ళీ అడుగుతున్న చూడు నాకు బుద్ధి లేదులే.. ఎటువంటి వంశంలో పుట్టావు నువ్వు? నిన్ను పట్టుకుని ఏమేమి అడుగుతున్నాను చూడు నేను.. నాకు సిగ్గు లేదు, ఎలా ఉంటుంది? నీ అంతరాత్మను కదా!
ఇప్పటికైనా చేసిన తప్పు తెలిస్తే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్లాలి అనుకుంటావేమో! అలా మాత్రం చేయకు తల్లి! అక్కడికి వెళ్లకుండా వాళ్ళ మోఖాలు కూడా చూడకుండా ఏటో పో.. ఏదో రకంగా నా ఆత్మకు మాత్రం శాంతిను ఇవ్వు.. అర్థం అవుతుందా!?” అని గట్టిగా అంటున్న అంతరాత్మ మాటలు సీత చెంప మీద పెళ్లుమని కొట్టినట్టు అనిపించింది..
ఒక్క నిమిషం ముందు వరకు క్రితం ఆ ట్రైన్ కింద పడి ప్రాణం తీసుకోవాలి అనుకున్న సీత తన భర్త గుర్తు వచ్చేసరికి నిర్ణయం మార్చుకుని ఆత్మహత్య చేసుకోకూడదని అనుకుంది. కానీ ఇంటికి వెళ్లాలంటే తన మనసులో పడుతున్న సంఘర్షణ నిర్ధారించుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటే ఇంతలో తన మనసు ఘోష ఇలా అంతరాత్మ రూపంలో చెప్పి చెప్పకుండానే చచ్చిపో అని చెప్తుంది. ఆ మాటలకు మరింత ఆలోచనలో పడిపోయింది సీత.