ఆమె – 15
“అంటే… నేను ఆడపిల్లగా పుట్టానని దూరం పెట్టారా?” క్రియన్సీ గొంతు వణికింది. నవీన సమాధానం చెప్పలేకపోయింది. ఆమె మౌనమే క్రియన్సీకి సమాధానంగా అనిపించింది. “కానీ అమ్మా… నేను పుట్టినప్పుడు నా తప్పేంటి? నేను కావాలని ఆడపిల్లగా పుట్టానా? నేను ఆయన కూతురిని కదా!” క్రియన్సీ కళ్ల నుంచి కన్నీళ్లు ధారగా కారాయి. నవీన వెంటనే కూతురిని దగ్గరకు తీసుకుంది. “నాకు తెలుసమ్మా. నువ్వు ఏ తప్పూ చేయలేదు. […]