New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life)

98 stories Ongoing Romance Love Suspense

ఎపిసోడ్ 1ఆకాశంలో మబ్బులు దూదిపింజల్లా అక్కడక్కడా రిలాక్సవుతున్నాయి. ఆ మబ్బుల చాటు నుండి చంద్రుడు సముద్రంతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. అయినా చంద్రుని వెండి కిరణాలను చూసి సముద్రం ఉప్పొంగి వాటిని అందుకోవాలని ఆరాటపడుతూ, నురగలు కక్కుతుంది. ఆకాశాన్ని అందుకోవాలనీ సముద్రం, సముద్రం లో కలవాలని ఆకాశం, ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి.ఆ సమయంలో సముద్రపు తెల్లని నురగతో, చంద్రుని వెండి వెన్నెలతో, పోటీ పడుతూ ఉల్లి పొరలాంటి లేత నీలిరంగు చీరలో  సముద్రపు ఒడ్డున ఇసుకలో పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఉంది. ఆ అమ్మాయి మనసు చెబుతున్న ఊసులను సముద్రం వింటోంది. ఆమె ఎద లో జరుగుతున్న అలజడిని ఆకాశం గమనిస్తూ వుంది. పడుకుని ఉన్న అమ్మాయిలో చిన్నపాటి కదలిక మొదలయింది. ఎక్కడినుంచో లేజర్ లైట్లలా అతని…

Browse Stories

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 88

  ఎపిసోడ్ 88   విజె ఉసూరుమంటూ.. ఆ కవర్ ఓపెన్ చేసాడు..   డోర్స్ తెరవగానే ఎదురుగా సితాలు కనిపించింది.. “అమ్మా టిఫిన్ చేయడానికి కిందికి వస్తారా? లేక ఇక్కడికి పంపించనా?” అని అడిగింది..   ఒక్కసారి గాఢంగా ఊపిరి పీల్చిన స్వప్నిక..  “ఆయన రెడీ అవ్వగానే ఇద్దరం కిందికే వస్తాం..   అక్కడే తిని బయటికి వెళ్లాలి. ఈరోజు కావ్య ఎంగేజ్మెంట్. తెలుసు కదా నీకు” అని అంది..   “సరే అమ్మా..రండి మరి” […]

4 min 6 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 87

ఎపిసోడ్ 87   సీతాలూకీ స్వప్నిక పరిస్థితి చెప్పిన విజె ఆమెని హెల్ప్ చేయమని అడుగుతాడు…   సీతాలు అతని వంక భయంగా చూసింది.   “సీతాలు నువ్వేం భయపడకు. నేను నీకు చెప్తున్నాను కదా! ప్లీజ్ అసలు విషయం ఏంటో చెప్తే కానీ,    నేను ఏ నిర్ణయం తీసుకోలేను అని ముందే చెప్పాను కదా నీకు” అని బాధపడుతూ అడిగాడు విజె..   “అంటే బాబు మన అమ్మాయి చదువుకునే రోజుల్లో మురళి కావ్య […]

4 min 13 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 86

ఎపిసోడ్ 86   తలెత్తిన ఆమె కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి..  ఇంతలో కింది నుండి సీతాలు…   “అమ్మా, వంటయింది..కిందకి రండి..” అని పిలిచింది.. స్వప్నిక లేచి నిలబడింది..   దాంతో ఈ లోకం లోకి వచ్చిన విజె… “హూ.. వెళదాం..పదా..” అని చేతులు చాచాడు విజె..   ఆశ్చర్యంగా చూసింది స్వప్నిక.. “ఏంటీ?” అని అడిగింది..   అమె మాట పూర్తి కాకముందే  విజె తన రెండు  చేతులతో ఎత్తుకున్నాడు..   “విజె..ప్రతి సారి ఇలా […]

4 min 13 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 85

ఎపిసోడ్ 85   స్వప్తిక గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే  సీతాలు మాత్రమే తనకు సహాయం చేస్తుందని అనుకున్నాడు విజె… తర్వాత ఏమయిందో  ఇప్పుడు మనం తెలుసుకుందాం..   ఇంటి ముందు కారాగిన తక్షణం సీతాలు దిష్టి తీయడానికి ఎర్ర నీళ్ళు ఉన్న తాంబాణం తీసుకొచ్చి ఇద్దరికీ దిస్టి తీసి లోపలికి  తీసుకెళ్ళింది. తర్వాత స్వప్నికను దగ్గర తీసుకుని కౌగిలించుకుంది.    “బాగున్నారా అల్లడు గారు..” అని భుజాల చుట్టు కొంగు వేసుకుని పలకరించిన సీతాలు, స్వప్నికని […]

5 min 8 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 84

ఎపిసోడ్ 84   స్వప్నిక నిద్రలోకి జారుకుంది.. విజె ఒక్కడే ఆమెకు తోడుగా ఉన్నాడు.. సెలెన్ నీడిల్ ఉన్న చేయి మెల్లిగా కిందికి జారబోయింది.    వెంటనే విజె ఆ చేయిని పట్టుకుని బెడ్ పై ఉంచాడు.. అతని అరచేయి ఆమె గుప్పిట్లో చిక్కుకుంది..   ఒక్కక్క వేలు తీస్తూ… ‘ఏ స్వప్న లోకం నుంచి వొచ్చావో తెలియదు కానీ..వచ్చీ రాగానే వల వేసి వలచేలా చేసావు..మైమరచె మైకమ్ లో ముంచావు..   నిజంగా ఇదంతా కలలా […]

5 min 10 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 83

ఎపిసోడ్ 83   హాస్పెటల్ బయటకొచ్చాక.. భరత్ వైపు సీరియస్ గా చూసాడు మురళి.   “అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా?”కోపంగా అడిగాడు.   దానికి భరత్ కామన్ గా నవ్వుతూ.. “ఏమయిందిరా? నేనేం చేసాను?” అని అడిగాడు..    కాని అతని మాట వెనుక  ఏదో ఒక సీక్రేట్ ఉందని మురళికి అనిపించింది.   “చూడు భరత్! నీ మంచి కోసమే చెబుతున్నా.. స్వప్నిక లైఫ్ తో నువ్వు ఆటలాడింది చాలు..   […]

3 min 13 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 82

ఎపిసోడ్ 82   రేపు మా ఇంట్లొ గెట్ టూ గెదర్ పార్టీ ఉందని విజెనే భువనేష్ ని ఇన్వైట్ చేస్తాడు. తరవాత ఏమయ్యిందో తెలుసుకుందాం..     “ఏంటి, విజె? ఈ టైమ్ లో పార్టీనా” అని ఆశ్చర్యంగా అడిగింది మల్లికా మేడం..     “ఏమవుతుందత్తా..రేపు కాదు గానీ..ఒక రెండు రోజుల తరువాత పార్టీ చేద్దాం..అప్పటి వరకు స్వప్నికకు కూడా కొంచెం నయమవుతుంది.” అని అన్నాడు విజె..   స్వప్నిక వైపు తిరిగి..   […]

4 min 12 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 81

ఎపిసోడ్ 81   “హాయ్.. స్వప్నికా?”అని ఆమె వైపు ఓ చిరునవ్వు విసిరి విజె వైపు కళ్లు తిప్పాడు భువనేశ్..   ఎత్తుగా ఉండీ, దానికి తగ్గ లావుతో మరీ బాడీ బిల్డర్ లా కాకుండా ఎక్సర్ సైజ్ బాడితో, సింహం లాంటి సన్నని నడుము,    పచ్చని పసిమి ఛాయ, పై రెండు బటన్స్ తీసిన నెవీ బ్లూ డెనిమ్ షర్ట్ నుండి  క్లీన్ గా వ్యాక్స్ చేసిన విశాలమైన ఛాతి మెరుస్తూ కనిపిస్తుంది..    […]

4 min 11 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 80

ఎపిసోడ్ 80   మల్లిక మేడం ఇంటి నుండి సూప్ తీసుకువచ్చింది. దాన్ని తీసి స్వప్నికకు తాగించ బోయింది.      తను తాగిస్తానని ఆమె చేతిలోని బౌల్ ని తీసుకున్నాడు విజె..   స్వప్నిక పక్కన కూర్చుని కొద్దికొద్దిగా ఆమె నోటికి స్పూన్ తో అందించాడు..   ‘లవ్ అనేది ఇంత పని చేయిస్తుందా అని ఆశ్చర్యంగా అతన్ని చూసాడు మహేష్.    “ఏమైనా నీకు హ్యాట్సాఫ్ సిస్టర్..మావాడి కొమ్ములు వంచి సెట్రైట్ చేసావు..” అని […]

4 min 12 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 79

ఎపిసోడ్ 79   రవళి తల్లి వెళ్ళిన వైపు చూసి కోపంగా ఒక అడుగు ముందుకు వేయపోయాడు వీజె. దాంతో అతన చెయ్యి పట్టుకుని ఆపింది స్వప్నిక.   ” స్వప్నికా, ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు తేల్చుకోవాలి.. నీకేం తెలియదు. నన్ను ఎందుకు ఆపుతున్నావు చెప్పు” అని సీరియస్ గా అడిగాడు విజె.   అతని సీరియస్ నెస్ ని అర్థం చేసుకున్న స్వప్నిక అక్కడ ఏమవుతుందో ఆమె ఊహించగలిగింది. అందుకే..   “అవసరమా విజె? లాస్య […]

4 min 13 views