నువ్వే నా ప్రపంచం. – 2
“ఎందుకు?”అని ఆత్రుత్తగా అడిగింది మహిత. “ఎందుకంటే ఆ వెహికిల్లోని ఎవరికీ ఏమి కాలేదు కాబట్టి..”అని మహిత చేతిని పట్టుకుంది స్రవంతి. ఆ మాట వినగానే మహిత కళ్ళు సంతోషంతో నిండిపోయాయి. “నిజంగా!”అనికళ్ళు పెద్దవి చేసింది మహిత. కనుబొమ్మలు ఆడిస్తూ “హా..నిజంగా..నిన్ననే తెల్సుకున్న, ఆ వెహికల్లోని ఎవ్వరికి ఏమి కాలేదట.ఆ రోజు మనం చూసిన అబ్బాయి వాళ్ళని సేవ్ చేసాడంట.” అని నమ్మకంగా తలాడించింది స్రవంతి. […]