New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 156

ప్రతిమ మొహంలో కనిపిస్తున్న వింత భావాలని గమనించిన ప్రణయ్  ఏంటి ప్రతిమా అలా చూస్తున్నావ్? నేను ఇప్పుడేమంతా తప్పుగా మాట్లాడలేదే..   నేను నీ ఫోన్ నెంబర్ ఏ కదా అడిగాను.. అలా అడగడం తప్ప..లేదంటే నీకు నీ ఫోన్ నెంబరు  నాకు ఇవ్వడం ఇష్టం లేదా అని అయోమయంగా మొహం పెట్టి అడిగాడు..   ఆ మాటలు విన్న వెంటనే  అయ్యో అలాంటిదేమీ లేదండి..మీరు అలా అడగడం తప్పేమీ కాదు.. నా ఫోన్ నెంబర్ మీకు […]

4 min 38 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 155

అంతక ముందే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి,నేరుగా గదిలోకి వచ్చిన భరత్ భాను ప్రతిమల మాటలు వింటాడు…   ప్రతిమ మాటలకి లోలోపల నవ్వుకుంటూ సరిగ్గా చెప్పావు ప్రతిమ .. మీ వదినమ్మ కి ఈ మాత్రం చెప్పకపోతే మనల్ని ఆడేసుకుంటుంది..నీకు ఈ అన్నయ్య సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.. నువ్వు ఏమాత్రం తగ్గొద్దు రెచ్చిపో అంటు నవ్వుతాడు..   సడన్గా వినిపించిన భరత్ మాటలకి తల తిప్పి చూసిన భాను మీరు ఎప్పుడు వచ్చారండి , అయినా […]

3 min 34 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 154

భాను మాటలకి ప్రతిమ కూడా నవ్వేస్తూ నీ రాక కోసం తప్పకుండా ఎదురు చూస్తూ ఉంటాను వదిన.. త్వరగా ఆ బాస్ కి అన్నయ్య మీద ఉన్న కోపం పోయి సెలవులు ఇవ్వాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..   ఏంటో మా పెళ్లి పనులు చేయడం కోసం చెప్పిన అబద్ధానికి ఇప్పుడు అనవసరంగా అన్నయ్య చిక్కుల్లో పడాల్సి వచ్చింది అని కాస్త బాధగా అంటుంది..     అయ్యో ప్రతిమ నువ్వు ఇంత చిన్న దానికి డల్ […]

3 min 35 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 153

నీకు నిజంగానే ఊరికి రావాలి అనిపిస్తుందా స్వీటీ అని ప్రతిమ అడగ్గా హా అవునత్తా ఊరికి వస్తే నీతో ఆటాడుకోవచ్చు కదా.. నువ్వు చాలా కథలు కూడా చెప్తావు.. అందుకే రావాలి అనిపిస్తుంది అని చెప్తుంది స్వీటీ..   అవునా.. అయితే ప్రణయ్ మామని పంపించమంటావా. నువ్వు మామతో వచ్చేస్తావా ఊరికి .. ఇక్కడే నాతో ఉండిపోతావా అని అడిగింది ప్రతిమ…   ఇక్కడ ప్రతిమ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో  స్వీటీ మాటలు ప్రతిమతో […]

3 min 29 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 152

హ అమ్మ అలా చెప్పి మంచి పని చేసింది.. లేదంటే కొత్తగా పెళ్లయిన వాడివి  అప్పుడే పొద్దు పోయే వరకు పొలాల దగ్గర ఉండొచ్చా..   అసలైతే కొద్ది రోజుల వరకు ఒంటరిగా పొలిమేర దాటి వెళ్ళకూడదు అంటుంటారు.. ఇంక మన పరిస్థితి బాగోలేదు ఇంట్లో చేసే వాళ్ళు ఎవరూ లేరు కనుక  పొలం పని నువ్వే  చూసుకోవాలి కాబట్టి అమ్మ వెళ్లడానికి ఒప్పుకుని ఉంటుంది అని చెప్పింది భాను .   హా సేమ్ ఇవే […]

3 min 32 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 151

కాసేపటికి తను కింద పడకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచిన ప్రతిమ కి  అతి చేరువు గా ఉన్న ప్రణయ్ మొహాన్ని చూడగానే  తనకే తెలియకుండా అతని కళ్ళల్లోకి కాసేపలానే చూస్తూ ఉండిపోతుంది..   ఇద్దరు వాళ్లు ఉన్న పొజిషన్ ని మరిచి, కాలాన్ని మరిచి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయిన సమయంలో  ఇద్దరి మొహాలు అతి దగ్గరగా ఉండడం వలన  ప్రణయ్ వదులుతున్న వెచ్చనీ ఊపిరి ప్రతిమ మొహానికే కాకుండా ఆమె మెడవరకు తగలడంతో ప్రతిమ […]

3 min 33 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 150

వాళ్ల నాన్నగారు అలానే పొలం నుండి ఇంటికి వచ్చినప్పుడు ప్రతి మా సమయానికి ఇంట్లో ఉంటే మాత్రం  అలానే మంచినీళ్లు తీసుకెళ్లి ఇవ్వడం ఆమెకి అలవాటు..   ఆ అలవాటుతోనే ఇప్పుడు ప్రణయ్కి తీసుకెళ్తుంది..నిజంగానే దాహంతో ఇంటికి వచ్చిన అతనికి ప్రతి మా నీళ్లు తీసుకురావడం చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలుగుతుంది..   థాంక్యూ ప్రతిమ అని చిన్నగా చెప్పి ఆమె చేతిలో ఉన్న మంచినీళ్లు అందుకుని తాగుతాడు ప్రణయ్ .. యశోద గారు […]

3 min 59 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 149

సరే మరి ప్రతిమ నాకోసం తినకుండా ఎదురుచూస్తుంది.. ఇంక ఉంటానమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఆవిడ..   ఫోన్ కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత మీ ఆయనే మనం తిన్నామా లేదా అని ఫోన్ చేశాడు అని నవ్వుతూ చెప్తారు కోడలితో..   ఆయనకి మీరంటే చాలా అభిమానం, ప్రేమ ఉంది అత్తయ్య… ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మానాన్నల మీద ఇంత ప్రేమ చూపించడం చాలా అరుదనే చెప్పుకోవాలి..     మిమ్మల్ని అంతలా […]

4 min 50 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 148

ప్రతిమకి ప్రణయ్ తో పెళ్లి గురించి ఆ తరువాత భార్యాభర్తల బంధం గురించి  ఎలాంటి అభిప్రాయమైనా ఉండని గాని చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని మోసి కుటుంబాన్ని నిలబెట్టిన విషయంలో మాత్రం ఆమెకి ఎప్పుడు ప్రణయ్ అందనంత ఎత్తులోనే కనిపిస్తాడు..   ఆ విషయంలో మాత్రం మనసులోనే ప్రణయ్ ని పొగుడుతుంది.. అయినా ఈ మొక్కలు అన్నిటిని ఏ టైం లో చూసుకుంటారు అత్తయ్య ఆయన అని ఇంకా పోనీ ఆశ్చర్యంతో ప్రతిమ అడగ్గా ఏముంది ప్రతిమ […]

3 min 39 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 147

ప్రతిమ మాటలకి యశోద గారికి శ్రీరాములు గారు గుర్తొచ్చి ఆయన తన మీద చూపించిన ప్రేమని తలచుకోగానే మీ మామయ్య గారికి నేనంటే ప్రేమ మాత్రమే కాదు ప్రతిమ నేనంటే ఆయనకి ప్రాణం..     ఆయన నన్ను, పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకునేవారో మాటల్లో చెప్పడం చాలా కష్టం.. నీకు గుర్తుందో లేదో కానీ మేమేమీ ధనిక కుటుంబానికి చెందిన వాళ్ళం కాదు..   కానీ మీ మామయ్య గారు ఉన్నంతలోనే మమ్మల్ని చాలా సంతోషంగా […]

4 min 27 views