New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 146

అప్పటికే ప్రతిమ  షింక్ లో ఉన్న   ప్లేట్స్ అన్ని క్లీన్ చేసి పెట్టడం చూసి కోడలికి ఇంట్లో పనులు చేసే అలవాటు ఉందిలే.. అన్ని పనులు రాకున్నా కొన్ని పనులు బాగా వచ్చు  ఈ మాత్రం చాలు , మిగిలినవి చిన్నగా నేను నేర్పించుకుంటాను  అనుకుంటారు..   ప్రతిమ గిన్నెలన్నీ నువ్వే తోమేశావా, వెళ్లిపోయాడా ప్రణయ్ పొలానికి  అని అడిగారు.. ఆ మాటకి అటు తిరిగి ఉన్న ప్రతిమా వెనక్కి తిరిగి యశోద గారిని చూస్తూ  ఖాళీగా […]

3 min 35 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 145

హహహ అంతేగా మా నాన్నగారు అంటే ఆ మాత్రం ఉండాలి మరి అని తను కూడా వాళ్ళ అమ్మ నవ్వులో జత కలుపుతాడు ప్రణయ్..   కాసేపు తల్లితో కబుర్లు చెప్పిన తర్వాత  అమ్మ ఇప్పటికే నేను పొలానికి వెళ్లి దగ్గర దగ్గర వారం అవుతుంది.. ఈ రోజైనా నేను పొలానికి వెళ్తాను అమ్మ..   ప్రతిరోజు మనం పొలానికి వెళ్లకుండా పాలేరుల మీద వదిలేయడం మంచిది కాదు.. వాళ్లు కూడా బాగానే చూసుకుంటారు అనుకో..   […]

3 min 33 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 144

కానీ ప్రతిమ మాత్రం ఒకసారి ప్రణయ్ వైపు చూసి ఆ తరువాత యశోద గారి వైపు చూస్తూ గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలి  అత్తయ్య మీరు ఏమి కంగారు పడకండి నేను మాటిస్తున్నాను కదా..   మీరు కోరుకున్నట్టే మొత్తం జరుగుతుంది.. అందరూ ఎప్పుడు సంతోషంగా ఉంటారు .. ఇంక మీరు అవన్నీ వదిలేసి భోజనం చేయండి  అంటూ కనీ సున్నితంగా ప్రణయ చేతిలో ఉండి చేతిని వదిలించుకుంటుంది..   ప్రతిమ ఇద్దరం భార్యాభర్తలుగా జీవితాంతం […]

3 min 32 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 143

మీరిద్దరూ జీవితాంతం ఒకరి చేతిని మరొకరు విడవకుండా ఒకరికొకరు గా బతకాలి అంటూ   ఆమె ఎడమచేత్తోనే ప్రణయ్ చేతిని,ప్రతిమ చేతిని కలిపి పట్టుకుని ఎప్పటికీ ఈ చేతులు ఇలానే కలిసి ఉండాలి ..   చెప్పండి నాన్న మీరిద్దరూ ఎప్పుడు ఇలానే కలిసే ఉంటామని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా,ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీ భార్యాభర్తల బంధాన్ని  నిలబెట్టుకొని కలిసే ముందుకు సాగుతామని నాకు మాట ఇవ్వండి అని అడిగారు యశోద గారు..   ఆమె మాట్లాడే […]

3 min 31 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 142

ఎక్కడైనా సరే ఎవరైనా సరే పని చేస్తేనే డబ్బులు ఇస్తారమ్మ.. ఊరికే ఎవరూ డబ్బులు ఇవ్వరు కదా.. కాకుంటే వాళ్ళక్కడ ఏసీ రూముల్లో కూర్చుని పని చేస్తారు. నేనిక్కడ ఎండలో పని చేస్తాను అంతే తేడా..   వాళ్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకిరీ చేస్తేనే వాళ్లకు జీతాలు ఇస్తారు.. నేను ఇక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకు పొలంలో పని చేస్తేనే మనకి పంట మంచిగా వచ్చి ఆదాయం వస్తుంది..   కాబట్టి […]

4 min 30 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 141

తన తల్లి మాటల్లో ప్రణయ్కి గతం గొర్తొచ్చి ఆమె పడుతున్న బాధ వినిపించడంతో అమ్మ అవన్నీ అప్పుడెప్పుడో అయిపోయాయి.. అప్పుడెప్పుడో జరిగిపోయిన వాటిని ఇప్పుడు గుర్తు తెచ్చుకొని మరీ బాధపడడం ఎందుకు..   ఇప్పుడైతే మనం బాగానే ఉన్నాం కదా దానికి సంతోషించు.. ఒక చదువు లేకపోతే జీవితం ఆగిపోయినట్టు కాదుగా.. ఆ దేవుడు నాకు చిన్నప్పుడే అలా కష్టాలు పెట్టబట్టే నాకు కష్ట,సుఖాల విలువ తల్లిదండ్రుల విలువ,మంచి చెడుల విలువ, డబ్బు విలువ అన్ని తెలిసాయేమో […]

3 min 37 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 140

వెంటనే దాసు అన్నా వద్దన్నా నేను ఇంటికి వెళ్లి చద్దన్నం తింటాను అని అంటూ ఉండగానే రేయ్ నువ్వు ఏమి మాట్లాడకుండా చెప్పింది చేసి పో అని చిరుకోపంగా అంటాడు ప్రణయ్..   ప్రణయ్ అలా అనడంతో ఇంకేమీ మాట్లాడకుండా చేతులు కడుక్కుని వచ్చి మౌనంగా కూర్చుంటాడు దాసు..   దాసుకి ప్రణయ్ అంటే చాలా గౌరవంతో కూడిన చిన్న భయం.. ప్రణయ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పడు దాసు..   తమ జీవితం ఏమైపోతుందో అన్న […]

4 min 43 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 139

ఇప్పుడు ఆ బర్రెలతో వచ్చే పాలని అమ్ముకుంటూనే ఆ కుటుంబాన్ని వాడు పోషిస్తున్నాడు  అని చెప్పడం ముగిస్తాడు…   ప్రణయ్ చెప్పిన మాటలు అన్నీ విన్న ప్రతిమకి  దాసు మీద గౌరవం, ప్రణయ్ మీద ఇది అని మాటల్లో చెప్పలేని ఒక విధమైన ఫీలింగ్ కలుగుతుంది..   ఆ ఫీలింగ్ గుడ్ ఆర్ బ్యాడ్  అన్నది మన హారిక కి మాత్రమే తెలుసు.. వెంటనే హారిక దాసు బుగ్గలు చిన్నగా లాగుతూ  నిన్ను చూస్తుంటే నాకు చాలా […]

3 min 36 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 138

ఒక్కోసారి వయసులో పెద్దవాళ్లే  మెచ్యూర్ గా బిహేవ్ చేయలేక పోతారు.. తమ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోకుండా మొండిగా ప్రవర్తిస్తుంటారు..   కానీ ఇక్కడ దాసు అలా చేయకుండా తమ అమ్మ ఆరోగ్యం కోసం చదువు మానేసి ఆమెను చూసుకోవడం అనేది ప్రతిమ కి చాలా బాగా నచ్చుతుంది..   దాసు చదువు మానేయాల్సి వచ్చినందుకు ఆమెకు బాధగా ఉన్నా ఎవరి తలరాతను ఎవరూ మార్చలేరు  అని తనకి తాను సర్ది చెప్పుకుని  మరి ఇప్పుడు వాళ్ళకి […]

4 min 35 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 137

షాక్ నుండి ముందుగా తేరుకున్న ఆ పిల్లాడు టీచర్ అమ్మ మీరేంటి ఇక్కడ వున్నారు? మీరెందుకు అన్నయ్యకి భోజనం వడ్డిస్తున్నారు అని ఆశ్చర్యం అయోమయం కలగలిసిన మొహం పెట్టి ప్రశ్నిస్తాడు..   ఆ పిల్లాడు తనని టీచర్ అమ్మ అని పిలవడంతో  ప్రతిమ కి ఆ పిల్లాడు తన అనుకున్న పిల్లాడే అని స్పష్టంగా అర్థం అయి రేయ్ నువ్వు లాస్ట్ ఇయర్ ** స్కూల్ లో సిక్స్త్ క్లాస్ చదువుతున్న దాసు వి కదా..   […]

3 min 40 views