వాంపైర్ సిటీ
దేవ్ అరేయ్ దేవ్ ఇంకెంత సేపు పడుకుంటావ్ రా లే త్వరగా. కాలేజ్ కి టైం అవుతుంది. లేచి త్వరగా రెడీ అవ్వు అంటూ కింద హాల్ నుండి వసుంధర కేకలు వేస్తుంది. ఎంతకీ సమాధానం రాకపోయే సరికి "ఇలా కాదు చెప్తా వీడి పని" అని జగ్గు నీళ్ళు తీసుకుని వెళ్లి బెడ్ పైన పడుకున్న కొడుకు మొహం పై అమాంతం నీళ్ళు కుమ్మరించేసింది. నీళ్ళు పడ్డా కానీ ఎలాంటి రెస్పాండ్ రాకపోయే సరికి వెళ్లి దుప్పటి తీసి చూసిన తనకి బెడ్ పై నిలువునా మనిషిలా ఉన్న దిండ్లు వెక్కిరిస్తూ కనబడ్డాయి. ఎక్కడికి వెల్లుంటాడు వీడు అనుకుంటూ వెనక్కి తిరిగే సరికి ఎదురుగా చెట్టంత కొడుకుని చూసి "అమ్మో దేవుడా…