Dark love – 2
Dark love 🖤
హుఫ్…. ఎవరు లేరు అని రిలాక్స్ గా అతడి గదిలోకి పోతున్న సమయంలో గుల్ఫర్ అని పిలిచిన పిలుపుకి హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పనైంది మనోడికి
అబ్బు అని సైలెంట్ గా వెనక్కి తిరిగిన అతడికి అక్కడే ఫ్యామిలి అంతా కనిపించేసరికి భయంగా ఒక్కొక్కరి వైపు చూస్తాడు ఆర్య
( అబ్బు అమ్మి బయ్య )
ఈ టైమ్ లో ఎక్కడకి వెళ్ళొస్తున్నావ్ అని అడుగుతూ ఆర్య వైపు ఒక్కో అడుగు వేస్కుంటూ వెళ్తారు సల్మాన్ షైక్
అది… ఫ్రెండ్స్ బర్త్ డే పార్టీ అని పిలిచారు అందుకే అని అడుగులు వెనక్కి వేస్తు భయం బయంగా అంటుంటే…. ఆర్య చొక్కా పట్టి ముందుకు లాగి చెంప చెల్లుమనిపించి ఇంకోసారి ఇది రిపీట్ అయితే నెల రోజుల పాటు రూమ్ లో పెట్టి లాక్ చేస్తా… అని కోపంగా అంటూ వెనకున్న బేగం కు కోపంగా చూస్తూ వెళ్ళిపోతారు
అప్పటికే ఆర్య కళ్ళు ఎర్రగా మారిపోయాయి…మి అబ్బు గురించి తెలిసి ఇలా ఎందుకు చేసావ్ రా అంటూ ఆయిష బేగం ముందుకు వస్తుంటే ఆవిడ చేతిని విసిరికొట్టి వెనకున్న రూమ్ డోర్ తోస్తు లోపలకు వెళ్లి విసురుగా తలుపు ముసాడు
ఆ సౌండ్ కి మళ్ళీ సల్మాన్ ఎక్కడ కోపగించుకుంటారో అని బేగం బయపడుతు సాహిల్ వైపు చూసింది
( పెద్ద కొడుకు సాహిల్, చిన్నోడు ఆర్య)
చిన్న పరుపు…. రూమ్ లో ఎటు చూసినా విజేంద్ర సింగ్ ఫొటోస్ !! ఇండియన్ బాక్సింగ్ చాంపియన్ !!
ఆర్య షర్ట్ విప్పి ఫోర్ హెడ్ మీద హెయిర్ పడకుండా హెడ్ బండ్ పెట్టుకొని గ్లోవ్సెస్ వెస్కొని హుక్ కు బాక్సింగ్ బ్యాగ్ అతికించి పంచెస్ మోదలు పెట్టాడు
( జానీ మూవీ లో పవన్ కళ్యాన్ లా 😌 కాకపోతే ఇక్కడ మనోడు ప్యూర్ వైట్… అండ్ బ్లాక్ బియార్డ్… ముస్లిమ్ లుక్ )
అతడిలో కనబడని మరొకడు ఆవేశం శాంతించడానికి అర్ధరాత్రి ఒంటి గంటకు మొదలు పెట్టిన బాక్సింగ్ మొర్నింగ్ ఫోర్ వరకు కొనసాగి మళ్ళీ తలుపు చప్పుడు అయిన శబ్దం కు ఆపి ఓపెన్ చేసాడు
రేయ్… సౌండ్ పైకి వస్తుంది !!
అప్పటి నుండి ఇదే పనిలో ఉన్నావా ?? అడిగాడు సాహిల్
అతడికి జవాబు చెప్పకుండా హ్యాండ్ గ్లోవ్సెస్ తీస్తూ…. ఈ మంత్ ఫీస్ ఇవ్వలేదు కోచ్ అడుగుతున్నాడు అబ్బు ని ఓసారి అడుగు అంటూ బెడ్ మీద కూర్చొని వాటర్ తాగుతాడు ఆర్య
నా దగ్గర ఉన్నాయ్ రేపు ఇస్తాలే…. నిజంగా బర్త్ డే పార్టీ సెలెబ్రేషన్స్ కే వెళ్ళావ ?? అనుమానంగా అడుగుతాడు సాహిల్
పెదవి ఒక సైడ్ తిప్పి వెనక్కి బెడ్ మీద పడిపోతు కళ్ళు మూసిన వెనుక దిశ కనిపిస్తుంటే చిన్న నవ్వు నవ్వుకుంటూ నిద్రపోతాడు
💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫
దిశ ఏంటి… ఈరోజు స్పెషల్ ?? లంగావాణి లో వచ్చావ్ అని వెనక బెంచ్ వైపు తిరిగి అడుగుతుంది హీన
ఆమె పక్కన కాస్త లావుగా బొద్దుగా ఉన్న కిన్నెర వైపు దిశ చూస్తు…. ఈరోజు గుడిలో పూజ అయింది అందుకే…. అంటూ తల దించేస్తుంది
కిన్నెర మనసులో నవ్వుకుంటూ సార్ వచ్చారు ఇటు తిరగవే…. అని లాగుతుంది హీన బేగం ను !
క్లాస్ రూమ్ లో అందరూ ఆమె వైపె చూస్తుంటే….. బ్రేక్ సమయానికి కాలేజ్ బయటకి షాప్ కి వెళ్తూ రోజు అక్కడ ఆమె కోసం ఎదురు చూసే ఆర్య కనబడకపోయేసరికి ఆమెలో నిరాశ !
దిశ… తొందరగా లోపలకు వెళ్లిపోదామే…. మళ్ళీ ఈ విజ్ఞాన్ కాలేజ్ వాళ్ళు వస్తే గొడవలు చేస్తారంటూ భయంగా చెప్తుంది కిన్నెర
అవును… నువ్వు చెప్పింది నిజమే వాళ్ళు వచ్చే టైమ్ అయింది…. కదా అంటూ వాచ్ చూసుకొని ఆర్య ఎక్కడున్నావురా అని టెన్షన్ గా అనుకుంటున్నప్పుడు ఆమె బుజం మీద బంగారం అంటూ తడతాడు ఆర్యన్
ఉలిక్కిపడి వెనక్కి తిరిగి ఇంత సేపు ఎక్కడికెళ్లావు…. నీకోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా….!! అంటుంది చిరుకోపంగా
సోరి రా…. ఈ బొక్క కాలేజ్ లో మెన్స్ కు ఒక్క వాష్రోమ్ మాత్రమే ఉంది….. ఆ విషయం నీక్కూడా తెలుసు…. చిటికిన వేలు చూపిస్తూ పోసి వచ్చినప్పటికీ లేట్ అయింది అంటాడు
సరె లే….. నిన్ను చూసానుగా హ్యాపీ !! రౌడీల్లా చేతులకు ఆ కేర్చీఫ్ ఎందుకు చుట్టావు తీసేయ్….!! అని దిశ విప్పబోతుంటే
అతడి చేతిని వెనక్కి లాక్కొని మళ్ళీ ముసలమ్మ పాత్రలోకి దిగకె పంతులమ్మ అంటూ ఆమె నుదుట మీద కొడతాడు
దిశ వాళ్ళు వచ్చేస్తారు వెళ్లిపోదామే అని పక్కనుండి కిన్నెర గోకేసరికి…. సాయంత్రం కలుద్దాం బ్రేక్ బెల్ అయిపోయింది లోపలకు వెళ్తాను ఆర్య అని అంటుంది దిశ
ఉండు చాక్లేట్ కొనిస్తా అంటూ షాప్ కి వెళ్ళబోతుంటే ఇప్పుడు వద్దులే ఆర్య !! అంటుంది
అప్పుడే స్టైల్ గా షూస్ , మెడలో టై , ఇన్ షట్ తో కొంత మంది అబ్బాయిలు వచ్చేసరికి ఆర్య మేము వెళ్ళిపోతాం అని భయంతో కాలేజ్ లోపలకు వెళ్ళిపోతుంది దిశ ఇంకా తన తోక !
ఒసేయ్ ఆగవే..అంటూ చిరాగ్గా తల తిప్పిన ఆర్యన్ కు వాళ్ళు ఎందుకు పారిపోయారో అర్థమై పిడికిలి బిగిస్తూ బడ్డీ దగ్గరకు అడుగులు వేసాడు
గవర్నమెంట్ కాలేజ్ ప్రయివేట్ కాలేజ్….. రెండు మెయిన్ గేట్స్ కాస్త క్రాసింగ్ డిస్టెన్స్ లో ఉంటాయి…
మధ్యలోని బడ్డీ ఉంటుంది 😌
అదే బడ్డీలో ఫోర్టీ రూపీస్ డైరీ మిల్క్స్ రెండు తీస్కొని వాళ్ళ వంకర నవ్వుని చూస్తూ కాలేజ్ లోపలకి వెళ్లిపోయాడు ఆర్య
ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళకి భయపడటం మానని ఈ అమ్మాయిల మీద చిరాకు… దిశ మీద కోపం ఎక్కువవుతుంటే ఆరోజు అసలు అతడి బర్త్ డే సంగతి కూడా మర్చిపోయి చిర్రుబుర్రులాడుతాడు
కాలేజ్ వదలగానే….. కిన్నెరను వెంట బెట్టుకొని రాజు గారి కోట వెనక బాగం కు చేసుకుంటుంది దిశ
( అంటే అది వారి లవ్ స్పాట్ 😌 )
కిన్నెర చేతిలో చెక్లేట్ పెట్టి దిశ ను లాక్కెళ్తూ నిన్ను కొట్టాలనిపిస్తుందే అంటాడు కోపంగా.. ఆమె చేతిని విసరగొట్టి
అబ్బా ఆర్య…. నువ్వు ఇలా గట్టిగా పట్టుకొని చేతులు పొంగిస్తుంటే మా అమ్మ కాలేజ్ లో నన్ను సార్ కొడుతున్నారు అనుకుంటుందిరా…. అని వాడి కోపాన్ని పట్టించుకోకుండా దాని చేతిని చూసుకుంటూ ఉఫ్ ఉఫ్ అని ఊదుతుంది
ఇంకా ఉంది……
Swipe left/right or tap the sides to turn pages