Dark love – 1
DARK LOVE 🖤
దిశ ఇంకెంత సేపు… తొందరగా కూర్చో అని తొందర పెడుతున్నాడు ఆర్యన్
అరే ఆగు… ఆర్య…. స్కార్ఫ్ చుట్టుకుంటాను… అని కంగారుగా మొఖం అంతా చుట్టుకొని బైక్ మీద కూర్చుంటుంది దిశ
ఆ ఇద్దరి బైక్ హైవె…. మీద రయ్యిమంటుంటే ఆర్య స్లో…..అని అతడి బుజం మీద చెయ్ వేసింది దిశ
ఇద్దరి బైక్ కి ఎదురుగా కొంత మంది అడ్డం నిల్చొని ఉండడంతో ఆర్యన్ సడన్ గా బైక్ ఆపుతుంటే… దిశ నవ్వుకొని బైక్ దిగి కమ్ అంది..
ఇక్కడకి ఎందుకు తీసుకు రమ్మన్నావే ??? అడిగాడు
చెప్తాను రా అనడంతో ఆర్యన్ దిశ తో పాటు వెళ్లగా బైక్ కి అడ్డగా ఉన్న వాళ్లు అడ్డు తప్పుకొని ఒక్కసారిగా హ్యాపీ బర్త్ డే…. ఆర్యన్ అని అరుస్తారు
అతడి పెదవుల మీద చిన్న స్మైల్….. కళ్ళల్లో మెరుపు…
ఆమె వైపు చూసాడు ఆర్యన్ !!
ఆ చూపులకు కారణం కూడా ఒకటి ఉండేసరికి దిశ చేతులు నూలుముకుంటూ సిగ్గు పడుతుంది పంతొమ్మిదెల్ల దిశ
రేయ్ మావ……కేక్ కట్ చెయ్ రా…. లేట్ అయితే మా అమ్మ సావ కొడుతుంది అని అక్కడ ఆర్యన్ దిశ ఫ్రెండ్స్ అనేసరికి…. కేక్ కట్ చేసి మొదటి పీస్ దిశ కు అందిస్తాడు
హ్యాపీ బర్త్ డే… మై క్యూట్ లవర్ బాయ్ !! అంటూ అతడి చీక్స్ నొక్కి….. సర్పరైస్ నచ్చిందా ? అని అడుగుతుంది దిశ
చాలా… అంటే చాలా… నచ్చింది…. ఈ టైమ్ లో తీసుకోచ్చావ్ అంటే నైట్ రైడ్ కోసం అనుకున్నా…. బర్త్ డే సెలెబ్రేషన్ చేస్తావని అనుకోలేదు…. థాంక్ యూ అంటూ ఆమె బుజం మీద చెయ్ వేసాడు
ఐదు నిమిషాల్లో కేక్ కటింగ్ ముగించి కాలేజ్ లో చూసుకుందాం అంటూ ఫ్రెండ్స్ వెళ్లిపోవడంతో దిశ చేతిని పట్టుకొని ఇంకో సారి థాంక్ యూ అంటాడు
నీకోసం గిఫ్ట్ కూడా తీస్కొచ్చాను…. !! అంటుంది దిశ
ఆమె చేతులు కాలిగా ఉండడంతో అనుమానంగా చూస్తాడు ఈ బర్త్ డే తో ఇరవై ఒక సంవత్సరాలు వచ్చిన ఆర్యన్
ఆమె చుట్టుకున్న స్కార్ఫ్ తీసి చుట్టు చూస్తూ సిగ్గు పడుతూనే ఛాతి మీద వేసుకున్న 𝓐𝓻𝔂𝓪 ( arya) నేమ్ టాటూ ని చూపించి వెంటనే చున్నీ తో కవర్ చేసేస్తూ గిఫ్ట్ నచ్చిందా అని అడుగుతున్న ఆమెని హగ్ చేస్కుంటూ లవ్ యూ చెప్తాడు మనసారా !!
డార్క్ లవ్ 🖤
బాబోయ్….ఆర్యు… ఇలా పట్టేసుకున్నావ్ ఏంటి …? నీకేం చెప్పాను… ఈ హగ్ లు కిస్ లు వద్దన్నానా !! అని కాస్త కోపంగా దూరం జరుగుతుంది దిశ
సోరి…సోరి బంగారం…. హ్యాపీనెస్ ఎక్కువైంది… ని గిఫ్ట్ అంత బాగుంది…. ఇంకా నమ్మలేకపోతున్న అంటూ ఆమెకి దూరం జరిగాడు
ఆర్యన్ అలా పొగుడుతుంటే దిశ లో సిగ్గు ఎక్కువై ముడుచుకుపోతుంది
ఏయ్… అయినా…. మన మధ్య డీల్ మర్చిపోయావా ఏంటి బంగారం ? అంటూ స్టైల్ గా బైక్ కి ఆనుకొని నిల్చొని చేతులు కట్టుకున్నాడు
గుర్తుంది గాని…. నాకు భయంగా ఉంది ఆర్య !!
నేనేం నిన్ను ఇబ్బంది పెట్టనులే….. ఫ్రీ గా ఉండు… అని దిశ చేతులు పట్టుకొని దగ్గరకు తెచ్చుకున్నాడు
నౌ ఐ అమ్ ట్వంటీ వన్…… ఇన్ని సంవత్సరాల ప్రేమకి ఫస్ట్ హగ్ ఫీల్ ఫ్రీ గా చేసుకోని డీల్ ఎండ్ చేద్దామా …..? మెల్లగా అడుగుతాడు
నన్ను ముట్టుకోకుండా చేస్కో….!
హేయ్…. కామెడీ చెయ్యకే… ముట్టకుండా ఎలా చేసుకోను ? అంటూ దిశా ని కౌగిట్లోకి లాక్కున్నాడు
ఫస్ట్ టైమ్ ప్రేయసి కౌగిలింత అతడిని మత్తెక్కిస్తుంటే దిశ…. అని ప్రేమగా పిలిచాడు ఆర్యన్
ఆర్య…. లూస్ గా పట్టుకో !
హ్మ్…. ఆమె కోరినట్టే చేస్తూ నేను మరోసారి ఆ గిఫ్ట్ చూడొచ్చా ? అని అడుగుతాడు
కుదరదు… నాకు ట్వన్టీ వన్ వస్తేనే చూపిస్తా…. అప్పటి వరకు నో ! అని కరాకండిగా అంటూ ఆర్య నుండి దూరమై స్కార్ఫ్ మొఖానికి చుట్టుకొని ఇక వెళదామా అని అడుగుతుంది
ని బెటింగ్స్ నావల్ల కాదమ్మ తల్లి…. ఈ ఏజ్ వస్తేనే హగ్ కు పెర్మిషన్ అని అప్పుడు లాక్ చేసావ్ …. ఇప్పుడు ఈ కొత్త డెసిషన్ !!! నా వల్ల కాదు నేను చూడాల్సిందే అంటూ ఆమె కట్టుకున్న స్కార్ఫ్ లాగి ఎద మీదున్న డ్రెస్ పక్కకి జరపడానికి చూసాడు
అరే ఆర్య వద్దని చెప్తున్నానుగా…. మొండిగా బిహేవ్ చేయ్యకు !!
ప్చ్…నాకోసమే వేసుకున్నావ్… అది కూడా నా పేరు… నెను చూస్తే తప్పేంటి ?? పైగా మొండి చేస్తుంది నువ్వు…
నీతో వాదులాడటం నా వల్ల కాదు… ఇప్పటికే లేట్ అయింది… ఇంకో గంట ఇక్కడే ఉన్నాం అనుకో మా నాన్న లేచి ఇంట్లో గంట మొగిస్తారు… వెళదాం పద..
ప్చ్… నువ్విలా అంటే డీప్ గా హర్ట్ అవుతా… బర్త్ డే కూడా సెలెబ్రేట్ చేసుకోను ! అని మొఖం తిప్పేసాడు ఆర్య
అబ్బా…..కావాలంటే ఇంకోసారి చూపిస్తా… రోడ్ మీదున్నం… ఎవరైనా వస్తారు వెళ్ళిపోదాం పదరా….
ఓహ్ ! ని భయం అదేనా… అంటూ బైక్ మీద కూర్చొని ఎక్కు అన్నాడు ఆర్యన్
హమ్మయ్య అని రిలక్సింగ్ గా ఫీల్ అవుతూ కూర్చుంటుంది దిశ
కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ బైక్ ఆపుతూ ఇక్కడ ఎవరు లేరు ఓకే నా అన్నాడు
కర్మ అని తల కొట్టుకొని…. హ్మ్… అంటూ ఇద్దరు దిగడంతో కొద్దిగా చున్నీ అడ్డు తప్పించి కేవలం పేరు మాత్రమే చూపిస్తుంది
ముచ్చటగా దాన్ని చూస్తూ అక్కడ ముద్దు పెట్టేస్తాడు
రేయ్ అంటూ అతడ్ని దూరం తోసేసి మొఖం అంతా ఎర్రగా చేసుకుంటుంది దిశ
ఆమె కోపాన్ని పట్టించుకోకుండా ఐ వింక్ చేసి థాంక్ యూ బేబీ అంటాడు
నువ్వు చేసే పనేం బాలేదు… ఇంకోసారి ఇలాగే బిహేవ్ చేసావ్ అనుకో… అని కోపంగా అంటున్న ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి….. చేస్తే ఏం చేస్తావ్ అని నవ్వుతూ అడిగాడు
ముద్దు పెట్టిన బుగ్గ తుడిచేసి కరుస్తా ..అంటుంది
అతడి చేతిని ముందు పెట్టి కరుచుకో అన్నట్టు చెప్తుంటే బర్త్ డే బోయ్ అయ్యి బ్రతికిపోయావ్ లేదనుకో కరవడం కాదు వాత పెట్టేదాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయ్ అని బైక్ ఎక్కిపోతుంది
ఒసేయ్….. స్టాండ్ లో ఉన్న బైక్ మీద కూర్చుంటే పడిపోతావె…. ఎన్ని సార్లు చెప్పాను !!! అంటూ అతడు కూర్చొని బైక్ స్టార్ట్ చెయ్యబోయి ఆగుతూ దిశ అని కాస్త గంబీర వాయిస్ తో పిలిచాడు ఆర్య !
ఏంటి….? ఆమెలో ఇంకా తగ్గని కోపం !
ఆ ప్లేస్ లో టాటూ వేసింది అమ్మాయే కదా !! అని మిర్రర్ లో షార్ప్ గా చూస్తూ మెడ రబ్ చేస్తూ అడిగాడు
హాన్…. కిన్నెర సిటీ కి తీసుకువెళ్లింది…. అక్కడ అబ్బాయిలు కూడా ఉన్నారు కాని నేను అమ్మాయితోనే వెయ్యించుకున్నలే…..!! అంటుంది
ఆమె జవాబుకి ఆర్య చిన్నగా నవ్వి బైక్ స్టార్ట్ చేసాడు
ముందుకు రేకుల షెడ్…. వెనక డాబా ఇల్లున్న ఇంటికి దూరంలో బైక్ ఆపి చుట్టు చూస్తూ ఎవరు లేరు దిగు అన్నాడు ఆర్య
దిశ దిగడంతో ఆ ఇంటికి ముందున్న పిట్ట గోడ మీద నుండి దూకి లోపలకు వెళ్తూ జాగ్రత్తగా వెళ్ళిపో ఆర్య… రేపు కాలేజ్ లో కలుద్దాం అంటూ పెరట కి గోళీ సందు ద్వారా లోపలకి వెళ్తూ వెనక డోర్ నుండి వాష్రోమ్ కి వెళ్లి ఇంటి లోపలకు వెళ్ళిపోతుంది దిశ
ఆర్య అక్కడే చెట్టు చాటున నిల్చొని ఎవరైనా అబ్సెర్వ చేస్తున్నాడేమో చూసి ఎవరు లేకపోవడంతో వెనక వీధి లో ఉన్న అతనింటికి బయలుదేరుతాడు
హుఫ్…. ఎవరు లేరు అని రిలాక్స్ గా అతడి గదిలోకి పోతున్న సమయంలో గుల్ఫర్ అని పిలిచిన పిలుపుకి హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పనైంది మనోడికి
ఇంకా ఉంది……..
ఇదండి.. మన న్యూ స్టోరీ …… రొమాంటిక్ గా ఉంటుంది
ఆర్య దిశ ల ప్రేమ కథ !!
ముస్లిమ్ అబ్బాయి… హిందూ అమ్మాయి…..
వీలైనప్పుడు అప్డేట్ ఇస్తా… స్టోరీ రెస్పాన్స్ బట్టి !!!
నచ్చితే మీరే సపోర్ట్ చేస్తారు… లేకపోతే స్కిప్ చేస్తారు 😌
ఇక మొదలెడదామా 😈
👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨
Swipe left/right or tap the sides to turn pages