అప్పుడే ఇంట్లోకి వచ్చిన నాగేంద్ర గారు హడావిడిగా అక్కడే ఒక మూలలో నిలబడి జేష్ఠ చేష్టలకు నవ్వుకుంటూ ఉన్న గాయత్రి గారి దగ్గరికి వెళ్లి పూర్ణివ్ హాస్పటల్ లో ఉన్నాడు అని చెప్తాడు.
ఆ మాట వినగానే గాయత్రి గారి చేతిలో ఉన్న గరిట కింద పడిపోయింది….
” ఏం ..ఏం అంటున్నారు అండి మీరు …? పూర్ణివ్ హాస్పటల్ లో ఉండడం ఎంటి..? ” అని షాకింగ్ గా అడిగింది.
నాకు కూడా తెలియదు.. పూర్ణివ్ ఫ్రెండ్ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాడు…పదా వెల్దాం..! ” అని అక్కడే ఉన్న జేష్ఠ నీ చూస్తాడు నాగేంద్ర గారు.