రానా స్మిత వైపు చిటికెలు వేసి చూపిస్తూ ఇంకొకసారి జనని జోలికి వచ్చినట్టు తెలుసునా కూడా నిన్ను ప్రాణాలతో వదలను మమ్మీ డాడీ చెప్పినట్టు ఏ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము లేదా ఇంకేదో కాదు డైరెక్ట్ గా పైకి పార్సెల్ చేస్తాను అంటూ వార్నింగ్ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్మిత
ఇప్పుడు చెప్పండి అసలు ఏంటిదంతా స్మిత మాట్లాడింది నిజమేనా అడిగారు రఘు గారు ఇద్దరి వైపు చూస్తూ
ఆ మాటకి రానా జనని ఇద్దరు తలదించుకొని అవును అన్నారు ఇద్దరూ ఒకేసారి
రేయ్ అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది రా నీకు నువ్వు డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేద్దామని అనుకుంటున్నావా నువ్వు ఇలాంటి వాడివి అని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇంకా నువ్వు జనని ఎన్ని రోజులు మీ పేరెంట్స్ గురించి మాట వచ్చిన ప్రతిసారి దాటేస్తుంటే ఏమో అనుకున్నాను కానీ అసలు కారణం ఇదా అసలు నువ్వు ఇలా చేస్తున్నట్టు మీ పేరెంట్స్ కి తెలుసా అడిగారు రఘు గారు