సుభద్ర గారు అందరూ వెళ్లిపోయిన తర్వాత కోడలికి దిష్టి తీసి రానా తనని రూమ్ లోకి తీసుకొని వెళ్ళు నాన్న అంటూ చెప్పడంతో ఓకే మమ్మీ అని భార్యని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు రానా
రానా జనని ముందు నేల మీద కూర్చుని తన రెండు చేతుల్ని చూస్తూ ఉండిపోయాడు
ఏమైంది శ్రీవారు ఎందుకు అలా నా చేతులు వైపే చూస్తూ కూర్చున్నారు అడిగింది జనని నవ్వుతూ
ఎంత నిండుగా ఉన్నాయో చూడవే. నాకు అసలు చూపు కూడా తిప్పుకోవాలి అనిపించట్లేదు అంత నిండుగా ఉన్నాయి అంటూ తన చేతుల్ని అలాగే పెట్టి ఒక ఫోటో తీసుకున్నాడు రానా