శాన్వి నిద్రపోయిన కాసేపటికి శౌర్య మెల్లగా కళ్ళు తెరిచి చూడగానే……….. !! తన పక్కనే తనకు ఎదురుగా ప్రశాంతంగా నిద్రపోతున్న శాన్వి ను చూసి చిన్నగా నవ్వుకున్నాడు శౌర్య………. !! నిద్రలో కూడా ఎంతో అమాయకంగా కనిపిస్తున్న తన ముఖాన్ని చూస్తూ కాసేపు అలాగే ఉండిపోయాడు………. !! రోజంతా నాతో ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటుంది కనీసం ఒక్కసారైనా నా గురించి ప్రేమగా ఆలోచిస్తుందో లేదో………!! కానీ నిద్రపోతున్నప్పుడు మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అని మనసులో అనుకుంటూ శాన్వి వైపు మరింత దగ్గరగా జరిగాడు………. !!
ముందుగా తన నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టాడు ఆ తర్వాత రెండు బుగ్గలపై ముద్దులు పెట్టుకుంటూ చివరికి శాన్వి పెదవుల దగ్గరకు చేరుకున్నాడు……….!! ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన పెదవులను శాన్వి పెదవులతో కలిపాడు………… !! అప్పటివరకు సరదాగా శాన్వి ను ఆటపట్టించాలనుకున్న శౌర్య తనకే తెలియకుండా ఆ అల్లరిని ముద్దు వరకు తీసుకొచ్చాడు………… !!
శౌర్య శాన్వి పెదవులను తాకగానే ఆ ముద్దు నెమ్మదిగా మరింత గాఢంగా మారింది……….. !! శాన్వి పెదవులను తన పెదవులతో బంధిస్తూ క్షణం కూడా విడిచిపెట్టాలనిపించనట్టుగా కిస్ చేస్తున్నాడు……….. !! శాన్వికు మరింత దగ్గరగా జరుగుతూ ఒక చేతిని తన నడుము చుట్టూ వేసి తనకు దగ్గరగా లాక్కున్నాడు…………. !! నాలుగు పెదవులు ఒకదానితో ఒకటి ముడిపడి ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా చెరిపేస్తున్నట్టుగా అనిపించింది………. !!
శౌర్య పెదవులు తన పెదవులను తాకగానే శాన్వి ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తుంది ………..!!ఎదురుగా కళ్ళు మూసుకుని తనను ముద్దు పెట్టుకుంటున్న శౌర్యను చూసి ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే ఉండిపోయింది……….!!
మరుక్షణమే శౌర్య తనను కిస్ చేస్తున్నాడన్న విషయం అర్థమవడంతో కళ్ళు పెద్దవి చేసి చూసి ………..!! వెంటనే శౌర్య ఛాతీపై రెండు చేతులు పెట్టి వెనక్కి నెట్టడానికి ప్రయత్నించింది……..!!కానీ శౌర్య మాత్రం తన ప్రయత్నాన్ని పట్టించుకోకుండా ముద్దులోనే మునిగిపోయాడు……….!! శాన్వి శౌర్య నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండటంతో కాసేపటికి శౌర్య శాన్వి పెదవులపై నుంచి తన పెదవులను విడదీస్తాడు ……….!! శాన్వి ప్రయత్నానికి వెనక్కి తగ్గిన శౌర్యను విడిపించుకుని లేచి కూర్చుంటూ…………. !! అప్పటికే వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపు చేసుకోవడానికి ఒక చేతిని గుండె పై పెట్టుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంది……… !!