డాన్స్ ప్రోగ్రాం ఫినిష్ చేసుకొని డిన్నర్ చేసి రూమ్ కి వచ్చిన శాన్వి ఫ్రెష్ అయి పడుకోవాలి అనుకుంటూ ఉండగా శౌర్య శాన్వితో కాసేపు మనసు విప్పి మాట్లాడాలని అనుకున్నాడు ………… !! తన మనసులో ఇన్నాళ్లుగా దాచుకున్న ఎన్నో విషయాలను శాన్వి తో షేర్ చేసుకోవాలనుకున్నాడు ……….. !! కానీ శౌర్య తన మనసు లోని మాటలు చెప్పే లోపే రోజంతా డ్యాన్స్ ప్రాక్టీస్, ప్రోగ్రామ్స్ తో అలసిపోయిన శాన్వి శౌర్య మాటలు వింటూనే మెల్లగా నిద్రలోకి జారుకుంది……….. !! తను నిద్రపోయిన విషయాన్ని గమనించిన శౌర్య ఇక తనను ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని శాన్వి ను జాగ్రత్తగా తన పక్కనే పడుకోబెట్టుకున్నాడు……….. !! అంతేకాదు శాన్వి తల తన చేతిపై ఆనుకునేలా చేసుకుని మరో చేతితో ఆప్యాయంగా తనను దగ్గరకు తీసుకున్నాడు………. !!
తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలోనే శౌర్యకు మెలకువ వచ్చి చూడగా పక్కనే హాయిగా నిద్రపోతున్న శాన్విని చూసి చిరునవ్వు నవ్వుకున్నాడు…….. !! ఆ తర్వాత సీత కి కాల్ చేస్తాడు అవతల సీత ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్మా ఒక చిన్న రిక్వెస్ట్ శాన్విని ఇంకొంచెం సేపు హాయిగా నిద్రపోనివ్వు………. !! ప్లీస్ తనని ఇప్పుడే లేపొద్దు పాపం తను చాలా టైడ్ అయింది సో ఏమైనా వర్క్స్ ఉంటే నువ్వే మ్యానేజ్ చెయ్ అని శాన్వి నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా మెల్లగా చెప్పాడు………. !!
కొడుకు మాటలు విన్న సీత నిద్రమత్తులోనే నవ్వుకుంటూ,………. !! ఏంట్రా నాన్న నువ్వేనా మాట్లాడేది నా కొడుక్కి తన భార్య మీద ఇంత ప్రేమ, కేరింగ్ ఎప్పుడు పెరిగిపోయాయి………?? అసలు ఇప్పుడు విషయం ఏంటంటే నీ భార్య నిద్ర చెడగొట్టకూడదని తల్లిని మాత్రం తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేపేశావన్నమాట అంటూ ఆటపట్టిస్తుంది………… !!
వాట్ అంటూ మొబైల్ వైపు చూసిన శౌర్య ఎర్లీ మార్నింగ్ 4 అవ్వడం చూసి తల కొట్టుకుంటూ ………. !! అయ్యో సారీ అమ్మా నేను టైమ్ చూడకుండానే కాల్ చేసేశాను …………. !! సరే నువ్వు పడుకో నేను తర్వాత మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేశాడు……….. !!