New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఒప్పుకోని బంధం – 21

ఒప్పుకోని బంధం – 21

 

సడెన్ గా శౌర్య పెట్టిన ముద్దుకు శాన్వి కోపంగా దూరం జరగాలని ప్రయత్నించినా ……….. !! క్రమంగా శౌర్య ప్రేమను అర్థం చేసుకుంటూ శౌర్య కిస్ కి రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది………… !! మెల్లగా శౌర్య నుండి గుంజుకోవడం ఆపేసి శౌర్య ను గట్టిగా హగ్ చేసుకుంటూ తను కూడా కిస్ కి కోపరేట్ చేస్తూ ఉంటుంది……… !! శాన్వి నుండి వచ్చిన ఈ రియాక్షన్ చూసి శౌర్య మనసు ఆనందంతో నిండిపోయింది………… !! శాన్వి  పెదవులపై ప్రేమగా ముద్దులు పెట్టి  ఆ తర్వాత మెడపై కూడా ఆప్యాయంగా ముద్దాడాడు…………. !!  ముఖంపై మిగిలిన నీటి చుక్కలను సైతం మెల్లగా తన పెదవులతో తుడిచేశాడు………… !! 

 

శాన్వి ను మరింత దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నిస్తుండగా ……….. !! శాన్వి మాత్రం మెల్లగా తల ఊపుతూ శౌర్య గుండెలపై వాలిపోయింది……….. !! తన 

మనసులోని భయాన్ని అర్థం చేసుకున్న శౌర్య వెంటనే తన అల్లరిని ఆపేశాడు……….. !! శాన్వి ను ప్రేమగా హత్తుకుని భయపడకు శాన్వి ప్రస్తుతానికి ఇంతే……….. !! నీకు ఇష్టం లేని పని నేను ఎప్పుడూ చేయను………..!! నువ్వు చెప్పినట్లుగానే మన ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ పుట్టి …………. !! ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాతే మనం మన బంధంలో ముందడుగు వేద్దాం సరేనా ……….??

 

 

శౌర్య మాటలు విన్న శాన్వి ఆశ్చర్యంగా తలెత్తి చూసింది……….. !! కాసేపటి క్రితం వరకు కూడా అల్లరి చేస్తున్న శౌర్యలో అర్థం చేసుకునే మనసు కూడా ఉందని శాన్వి కు మరోసారి అర్థమైంది……… !! శాన్వి ను మరింత దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటూ శౌర్య మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు………. !! 

 

అవును శాన్వి  నువ్వు చెప్పింది నిజమే………!! అందమైన మ్యారీడ్ లైఫ్ కి ఫిజికల్ అట్రాక్షన్ ఒక్కటే సరిపోదు………… !!  ఇద్దరి మనసుల మధ్య ప్రేమ, ఒకరిపై ఒకరికి నమ్మకం,  గౌరవం కూడా చాలా అవసరం………… !! అవి ఉన్నప్పుడే ఆ బంధం జీవితాంతం అందంగా ఉంటుంది………. !! 

 

అందుకే మనం ముందు మంచి ఫ్రెండ్స్‌లా మన ప్రయాణాన్ని మొదలుపెడదాం………. !! ఒకరినొకరం అర్థం చేసుకుందాం లైక్ మన ఇష్టాలు, బాధలు, సంతోషాలు అన్నీ షేర్ చేసుకుందాం………. !! ఆ స్నేహం నుంచే నెమ్మదిగా ప్రేమ పుడుతుంది ఆ ప్రేమ మన బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది……….. !! అప్పుడు మనం భార్యాభర్తలుగానే కాకుండా  ఒకరికొకరం ప్రాణంగా ప్రేమించుకునే లవర్స్ లా కూడా మారిపోదాం………. !! అలా మన దాంపత్య జీవితాన్ని ప్రేమతో, నమ్మకంతో నిండిన ఒక అందమైన ప్రయాణంగా మార్చుకుందాం……….. !! ఏమంటావు శాన్వి  అంటూ తన కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అడుగుతాడు………. !! 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue