PSYCHO 👿 – SMART RABBIT 🩷 – 2
అసలే మన వాడికి ఓపిక తక్కువ…అందులోనూ ఇక్కడ కొంచెం వాతావరణం తేడా కొట్టేస్తుంటే డైరెక్ట్ గా CI కేబిన్ కి పెద్ద పెద్ద అడుగులతో వెళ్ళాడు. బయట వాళ్ళంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.
లోపలికి వెళ్ళిన అధ్వయ్ కి టేబుల్ పైన కాళ్ళు పెట్టుకుని ఫోన్ లో అశ్లీల వీడియోలు చూస్తూ వాళ్ళు అరుస్తుంటే వీడు ఎంజాయ్ చేస్తూ వుంటాడు.
( నేనిక్కడ స్టోరీ కోసం మాత్రమే రాసుకున్న…బయట అలా ఉంటుందని నేను చెప్పట్లేదు… కేవలం స్టోరీ కోసం మాత్రమే …ఇది నా ఊహల ప్రపంచం )
అది చూసిన అధ్వయ్ కి ఉన్న ఓపిక కూడా పాతాళానికి పోతే ….వేగంగా వెళ్ళి ఫోన్ లో మునిగిపోయిన వాడి జుట్టు పట్టుకుని పైకి లాగేసాడు. క్షణం లో జరిగిన దానికి CI అరుపు పోలీస్ స్టేషన్ లో మీరు మోగింది …పాపం ముందే సగం బట్ట ఇప్పుడు ఉన్నవి కూడా అధ్వయ్ చేతిలోకి వచ్చాయి.
నొప్పి తో విలవిలలాడుతూ ఏయ్ నేనెవరో తెలుసా …నా వెనక ఎవరున్నారో తెలుసా అని నొప్పితోనే అరుస్తాడు.
వాడిని ఒక చూపు చూసి లెఫ్ట్ హ్యాండ్ తో ఒక్కో ఒక్క దెబ్బ వేస్తాడు …దెబ్బకి నేలని కరుచుకుంటాడు CI శ్రీను.
రేయ్ నీ వెనక ఎవ్వడున్నాడో నాకు తెలియదు…నువ్వెందుకు ఇంత కొవ్వు పట్టి ఉన్నావో తెలియదు ….ముందు నీ లెక్క సరి చేసి నీ వెనకున్న వాడిని చూసే నీకింత కొవ్వు అని తెలిస్తే వాడి లెక్క తేలుస్తా… ముందు ఆ వీడియోలు కట్ చెయ్యి…చెత్త నా *** అని రెండు నిమిషాల్లో పెండింగ్ ఫైల్స్ అన్ని తీసుకుని నా కేబిన్ కి రా … అది కూడా ఈ అవతారం లో కాదు ..అర్థమైందనుకుంటా అన్నాడు అధ్వయ్.
ఓరి నీ దుంప తెగ ..నేను లేవడానికే ఈ రెండు నిమిషాలు నేను లేవడానికే సరిపోతుంది రా …. వీడెంట్రా పెద్ద సైకో ల ఉన్నాడు అని పళ్ళు నూరుతూ పైకి లేస్తుంటే… డోర్ దాకా వెళ్ళిన అధ్వయ్ కి ఇతని మనసులో మాట వినపడి నట్టే కరెక్ట్ గా గెస్ చేశావ్ రా … ఈ పోలీస్ బ్రెయిన్ మంచికి ఉపయోగిస్తే నువ్వు నా ప్లేస్ లో ఉండే వాడివి ..బట్ బ్యాడ్ లక్ అని పెదవి విరిచి …టైమ్ అప్ …ఈ రోజంతా నువ్వు స్టేషన్ లో ప్రతి పని చెయ్యి …నాకు కాఫీ పట్టుకుర ఫస్ట్ తల పగిలిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అధ్వయ్.
వామ్మో వీడే గ్రహం నుండి వచ్చాడు …?? నా మనసు లో మాటలు కూడా చెప్పేస్తున్నాడు. అయిన అన్న కి తెలిస్తే అప్పుడుంటుంది వీడికి… నా వంటి మీద చెయ్యేసిన వీడికి ఇక్కడే కాదు ఈ లోకం లోనే చోటు లేకుండా చేస్తా అని విలనీ లుక్ ఇద్దామని ఫెయిల్ అయ్యి కామెడీ లుక్ ఇస్తాడు …
శ్రీను కాఫీ కోసం బయటికి వెళ్తే SI వంశీ అధ్వయ్ కేబిన్ దగ్గర కి వెళ్ళాడు… సార్ .. కాన్ ఐ గెట్ ఇన్?? అని బెరుకుగా అడిగాడు.
రూమ్ చూస్తున్న వాడల్లా ఒకసారి వంశీ వైపు చూసి కమ్ అన్నాడు. థ్యాంక్ యు సార్ అని లోపలికి వెళ్ళాడు.
అది సార్ మీరు CI శ్రీను ని కొట్టిన విషయం పెద్ద తల కి తెలిస్తే ….అంటూ నసుగుతుంటే …
అధ్వయ్ కను బొమ్మలు ముడేసి చూస్తూ వెయిట్ వెయిట్..ఈ పెద్ద తల ఎవరు ?? అని అడిగాడు.
అతనెవరో ఎవరికీ తెలియదు సార్ … పెద్ద తల అని పిలుస్తారు ..అతని మనిషే ఈ శ్రీను సార్…
చాలా కేసు లు కూడా ఆయన మనుషులు చేసినవే … ఇక్కడ సాక్ష్యాలు, లా అండ్ ఆర్డర్స్ ఏవీ పని చేయవు సార్. వాళ్ళు ఎంత చెప్తే అంత ..ఎలా చెప్తే అలా చేస్తుంటారు సర్ …ప్రతి పోలీసు స్టేషన్ లో పై అధికారిని కొనేసి వాళ్ళతో నచ్చిన పనులు చేయిస్తుంటారు సర్ మీరు వాళ్ళ జోలికి వెళ్ళక పోవడం మంచిది సార్ అంటాడు వంశీ చిన్నగా.
టేబుల్ మీద కూర్చుని ఒక కాలు నేల మీద ఒక కాలు మడిచి టేబుల్ పెట్టీ లాటి తో నేలని చిన్నగా కొడుతూ
వంశీ మాటలు విన్న అధ్వయ్…పెండింగ్ ఫైల్స్ తీసుకురా అని తాపీగా చెప్పాడు.
వంశీ ఫస్ట్ కొంచెం షాక్ అయినా వెంటనే ఏదో అర్థమైన వదిన ఎస్ సార్ అని సెల్యూట్ చేసి హుషారు గా వెళ్ళాడు.
ఐదు నిమిషాల్లో కాఫీ తెచ్చిన శ్రీను చేతిలో కప్ తీసుకుని మొహం మీదకి విసిరి కొడతాడు అధ్వయ్.
👿👿👿👿
స్వీటీ……❤️
Continues…….
comment చేయండి ☺️… ఎలా ఉందో తెలుసుకోవాలని నాకు వుంటుంది గా 😏
Swipe left/right or tap the sides to turn pages