New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 33

రుద్రాన్ష్ ఆఫీస్ నుండి ఏడుస్తూ తనే సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ తన కార్ ను రోడ్ మీద పరుగులు పెట్టిస్తుంది శ్రియ ….. రుద్ర మనసులో వేరే అమ్మాయి ఉంది అన్న విషయం కూడా శ్రియ తీసుకోలేక పోతోంది ఎందుకిలా చేసావ్ రుద్ర్ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా?? నీ కోసమే కదా నేను తెలుగు నేర్చుకున్నది నీ ప్రేమ కోసమే నేను ఇండియన్ గర్ల్ లా చేంజ్ అయ్యాను & నీ ఫేవరెట్స్ అన్నీ నేను కూడా పిచ్చి దానిలా ఇష్టపడే దాన్ని ఇంతలా లవ్ చేస్తున్నా నన్ను ఎలా చీట్ చేసావ్ అని గట్టిగా ఏడుస్తూ కార్ సైడ్ కి ఆపి స్టీరింగ్ ను చేత్తో కొడుతూ తన హ్యాండ్ కి బ్లడ్ వస్తున్నా పట్టించుకునే స్టేజ్ లో లేదు శ్రియ……

ఏడ్చి ఏడ్చి శ్రియ కళ్ళ నుండి నీళ్ళు కూడా రావడం ఆగిపోయాయి కాసేపటి తర్వాత శ్రియ చేతులు స్టీరింగ్ ను గట్టిగా చుట్టుకుంటాయి….. అప్పటి వరకు తల వంచుకుని మౌనంగా ఏడుస్తున్న శ్రియ మెల్లగా తల పైకి ఎత్తి ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారిన తన కళ్ళను తుడుచుకుంటూ నాకు చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ ఉంది రుద్ర్ నాకు నచ్చిన దాన్ని నేను తీసుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్తాను అలాంటిది నేను ప్రేమించిన నిన్ను అంత ఈజీగా ఎలా వదులుతాను?? …..

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay